పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. మల్లెపూల మధూలిక గురించి ఆర్.దమయంతి అభిప్రాయం:

    03/30/2012 12:08 pm

    లక్ష్మీ మాధవ్ గారూ!
    చిగురించిన నందన వనం మీకు నచ్చినందుకు, నాకెంతో సంతోషంగా వుంది.
    నూతన సంవత్సర శుభాకాంక్షలతో-
    ఆర్.దమయంతి.

  2. కోనసీమ కథలు: పిండంతే నిప్పటి గురించి jagadish అభిప్రాయం:

    03/29/2012 1:05 pm

    సూపర్ గా చెప్పారు కధ..

  3. నాకు నచ్చిన పద్యం: వింధ్యుని స్వగతం గురించి వరదయ్య తిరువాయిపాటి అభిప్రాయం:

    03/28/2012 5:25 pm

    నాకు ఈ మధ్యనే ఈ మాట గురించి మా పెద్దబ్బాయి చెప్పాడు. నేను అనాలోచతంగా చూడడం తటస్థ పడింది. నేను విశ్రాంత తెలుగు పండితుడను. మీ ఈ మాట, దీనిలో ఉన్న విభిన్న శీర్షికలు చదివాను. మీ విశ్లేషణలు, మీ రచనలు మనోజ్ఞంగా ఉన్నాయి. నేను ఇప్పుడు అమెరికాలో ఒక ఆరు మాసాలు ఉంటాను, మీ ఈ మాట నాకు మంచి తోడు అవుతుందని అనుకొంటున్నాను.

    సీ !! చిరుత ప్రాయము నందు చిరునగ వొలికించి
    పూతన జంపిన పుత్రు డెవరు
    గోవర్ధనం బెత్తి గోవుల కాపాడి
    కాళీయు నణచిన బాలుడెవరు
    గోడల డాటుచు గొల్లభామల యిండ్ల
    వెన్న భుజించిన కన్నడెవరు
    మాపటి వేళల గోపకాంతల జేరి
    సరసాలు సాగించు సరసుడెవరు

    తే. గి.!! తానె! గోపకిశోర బృందా విహారి
    కంస సంహారి దేవకి కన్నబిడ్డ
    ముదము గలుగ యశోదకు ముద్దు బిడ్డ
    నంద గోపాల కృష్ణుండె మనకు దిక్కు!!

    ధన్యవాదములతో
    వరదయ్య తిరువాయిపాటి

  4. కాల్వీనో కథల నుంచి – 2 గురించి lakshmimadhav అభిప్రాయం:

    03/28/2012 9:41 am

    అనువాదం కథలు ఎంతొ బాగున్నాయి. ప్రతీ కథలోనూ ఈ నాటి పరిస్తితులకి అన్వయించుకో తగ్గ మార్మిక అర్థాలు ఉన్నాయి .మాధవ గారికి నా అభినందనలు.

  5. మల్లెపూల మధూలిక గురించి lakshmimadhav అభిప్రాయం:

    03/28/2012 9:15 am

    చాలా బాగుందండీ దమయంతిగారు, మీ మల్లెపూల మధూలిక. ఆకులు రాలి మళ్ళీ వసంతమొచ్చి వనం చిగురించడాన్ని ఎంతో అద్భుతంగా వర్ణించారు. మీకు నా అభినందనలు.

  6. సిరికాకొలను చిన్నది: సంగీత నాటిక గురించి శ్రీనివాస్ పప్పు అభిప్రాయం:

    03/28/2012 8:35 am

    శ్రీనివాస్ గారికి నమస్తే.

    ఈ వ్యాసాన్ని మా వేటూరి సైట్ లో ప్రచురించుకోడానికి అనుమతించమని,అలాగే ఆ ఆడియో ఎంబెడ్ కోడ్ కూడా ఇవ్వగలరని కోరుకుంటున్నాను.

    భవదీయుడు
    శ్రీనివాస్ పప్పు

  7. పహాడీ రాగం అందాలు గురించి Rohiniprasad అభిప్రాయం:

    03/27/2012 10:34 pm

    కొండగాలి పాట మలయమారుతం రాగంలో చేసినది. మాటకు సరిపోయే రాగం వాడడం పెండ్యాల గొప్పదనం.

  8. మల్లెపూల మధూలిక గురించి ఆర్.దమయంతి అభిప్రాయం:

    03/27/2012 11:55 am

    సురేష్ గారూ! మీ స్పందన మొత్తం చదివాను. చాలా బాగా రాసారు. అందుకు ముందుగా నా ధన్యవాదాలు తెలుపనీయండి. మీరు విమర్శించినందుకో, ప్రశంసించినందుకో కాదు, కానీ, ఒక పాఠకుడిగా మీ అభిప్రాయాన్ని ఇక్కడ వ్యక్తపరిచినందుకు సాటి తెలుగు వారిగా మిమ్మల్నిఆనందంగా – అభినందిస్తున్నా..(ఎందుకంటే చాలా మంది చదువుతారు..కాని చెప్పరు..హార్లిక్స్ ప్రకటనలో లా….) అందుకే మీ ఒకో సందేహానికి ఒక్కో సమాధానాన్నిక్కడ పొందుపరుస్తున్నాను.
    @ ” మిమ్మల్ని కాని మీ కవితని కాని ఉద్దేశించి అనటంలేదు కానీ” …
    *.. అంటూ ఆగారే! ఇందులో వెనకాడేందుకేముందీ?.. మీరు నా కవిత నుద్దేశించే ఇదంతా రాశారు. (లేకపోతే నేనింత గా ప్రతిస్పందించే అవకాశం నాకెక్కడిదనీ !?)
    @ ‘ ఒకసారి మీ కవితని ‘చదివినవెంటనే ‘ అభిప్రాయాన్ని రాయటం మొదలుపెట్టాను. కానీ ‘ మరలా పైనుంచి కొసదాక చదివాను’ భావాన్ని ఎలా ప్రవహింపచేసారా అని.,,’
    * చాలా తక్కువమందికి మాత్రమే అలవడే ఒక మంచి అలవాటు ఇది. (నాకు లేని మంచి లక్షణాలు ఎవరిలో వున్నా మెచ్చుకోకుండా వుండలేను మరి! .)
    ముందొచ్చే ఆలోచన్లన్నీ – సముద్రపు తుఫాన్లు. ఆ వెనకొచ్చేవే అసలైన తేట తనపు ప్రవాహాలు. – ఇలా రెండో ఆలోచన దగ్గర ఆగి, ఆలోచించి రాసే వారి మాటలే నిజానికి – అందర్నీ ఆలోచింపచేస్తాయి. అందుకే మాట్లాడేటప్పుడు…తెలివైన వారు మాత్రమే – కాసేపాగి, నిదానించి సమాధానమిస్తారు.

    @ ” మీ విధానం, పదాలు, అల్లిక బాగుంది.’
    * నిజమే. కవిత్వం అంటే – మంచుదారాల పోగులు, మలయ పవనాల పరిమళాలు – కలిపి నేసిన విరిమబ్బుల కోక వంటిది. థాంక్యూ!

    @ ‘చదువుతున్నపుడు ప్రతి పాఠకుడు తనకర్ధమైనంతవరకు వాక్యంలో రచయిత పొందుపరిచిన భావానికి లోనవుతాడు..’
    * అప్పుడే రచయిత గుర్తుండిపోతాడు. మన తెలుగు లో అలాంటి వారిని వేళ్ళమీద లెక్కించొచ్చు.. (ఆ వరసలో చేరాలనుకోవడం – నా వరకు నాకు ఖచ్చితంగా అత్యాశే అవుతుంది. కాదనను. కాని, ప్రయత్నించడంలో తప్పు లేదు కదా అని..)

    @ “ఒక వాక్యం నుండి మరో వాక్యానికి, ఒక పాదం నుండి మరో పాదానికి దాటుతున్న గ్రాహకుడికి, ఒక ప్రయాణీకుడు మజిలీలు మజిలీలుగా పల్లకిలో పయ నించి గమ్యాన్ని చేరుకున్న అనుభవం కలగాలి.”
    * అంటే మీ వుద్దేశం లో – అక్షరాలు పల్లకీలు, భావాలు మనసుని మోసే బోయీలూ కా వా లంటారు.. అవునా!?
    @ “ఒక్కోకవితలో నవరసాల్ని పండించవచ్చు ఐతే భాషతో పాటు భావాన్ని చక్కగా పరచగలిగితే. మన తెలుగు అందుకు ప్రసిద్ధం.”
    * మీరంటోంది నిజమే! నేనూ ఒప్పుకుంటాను. మన తెలుగు భాషకున్న విశిష్టత ఏమిటంటే – రచనల్లో నవరత్నాల్ని గుమ్మరించ వచ్చు.. పున్నమి గుత్తులనూ పూయించనూవచ్చు..

    @ ‘ఓ పాఠకుడిగా నా అభిరుచిని వ్యక్తపరుస్తున్నానంతే.’
    * అంతే అనకండి. ఇంత అద్భుతంగా..అందరూ వ్యక్త పరచలేరు! మంచో, చెడో..తప్పో..ఒప్పో..నిష్టూరమో..నిగ్గదీయడమో..ఏదో ఒక దాని గురించి మన తెలుగు వాళ్ళం స్వేచ్చగా మాట్లాడుకోవాలి. సాహిత్యపరమైన విషయాలు చరిచించుకోవాలి. అభిప్రాయాలు, వ్యక్తపరచుకోవాలి. విస్తృత పరిధిలో వెల్లడించుకోవాలి. అసలిందుకే గా – ఈమాట నిర్వాహకులు మనకిక్కడ ఈ స్పేస్ ఇచ్చింది? మీకు దొరికిన అవకాశాన్ని చాలా చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. అభినందనలు.
    @ “తప్పులుంటే క్షమించాలి.’
    * ఎందుకండీ..అంత పెద్ద మాట!..సాహితీ ప్రియుల అంచనా మేరకు రాయలేకపోతున్నందుకు.. ఇలా – నేనే అడగాలేమో! .( రాయకుండా నన్ను నేను బాధపెట్టుకుంటే సరిపోయేదానికి..రాసి అందర్నీ బాధిస్తు న్నానేమో ననే శంక కలుగుతూ వుంటుంది అప్పుడప్పుడు!
    మూల్గుతున్న నక్క మీద తాటి పండు .. అన్న సామెత చందంలా..- ఈసారి సంపాదకుల వ్యాసం ‘ ఎమితిని సెపితివె.’. చదివాక నా భయం మరింత హెచ్చిందంటే నమ్మండి!)
    సురేష్ గారూ! అందరి రచన్ల మీదా.. మీ అభిప్రాయాల్ని – నిర్భయంగా, నిర్మొహమాటంగా మీరిలాగే అభివ్యక్తీకరించాలని అభిలషిస్తూ…
    ముందు కాలంలో కూడా మీ విలువైన అభిప్రాయాలను ఈ రీతిలోనే మాకందచేస్తారని ఆకాంక్షిస్తూ..
    మీకు నా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియ చేసుకుంటూ..మరి వుంటాను.
    నమస్సులతో –
    – ఆర్.దమయంతి.

  9. త్రిపురాంతకేశ్వరా! గురించి vadluri murthyraju అభిప్రాయం:

    03/27/2012 9:47 am

    “విషయా విషాదన నిచయా” వాక్యం చాల నచ్చింది మరియు పల్లవి హృద్యంగా వుంది.

  10. పిలూ రాగం గురించి Snkr అభిప్రాయం:

    03/26/2012 10:54 pm

    1. ఓఓ వాలు కన్నుల దానా
    .. మురిపించే అందాలే అవినన్నే చెందాలే
    2. నినుచేర మనసాయెరా నా స్వామీ
    అనే బొబ్బిలియుద్ధం లోని పాటలు కాపి/పిలు లా వుంటాయండి.