పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. కోనసీమ కథలు: పిండంతే నిప్పటి గురించి ramakrishna అభిప్రాయం:

    04/18/2012 4:30 pm

    చాలా రోజుల తరువాత తెలుగు కథ చదువుతున్నాను. చదివినంత సేపూ నామిని కతలు గుర్తుకు వచ్చాయి – ఆ మాండలికం కాక పోయినా శైలి అలా అనిపించింది. బాగుంది.

  2. కోనసీమ కథలు: పిండంతే నిప్పటి గురించి Sireesha అభిప్రాయం:

    04/17/2012 8:32 pm

    Interesting story! good one!

  3. మూడు లాంతర్లు – 10 గురించి కనక ప్రసాద్ అభిప్రాయం:

    04/17/2012 12:49 pm

    బ్రహ్మానందం గారు,

    మీరు ప్రతిపాదించిన విషయం, చెప్పిన కారణాలు చాల సబబుగా ఉన్నాయి. ఇవి నేను ముందుకి రాయాలని అనుకున్నవి; మీరే అన్నారు. మీరు వర్ణిస్తున్నది లోకంలో సాధారణమైన మన:స్థితి. లౌక్యుల పద్ధతి అని నేనంటున్నది. మంచి పాఠకుడివి కావాలంటే ఇలాంటి పరిమితుల్ని అధిగమించాలి అని రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ అన్నారన్నాను కదా?! ఈ పరిమితుల వలన సంకుచితం కానివి, భిన్నమైన వ్యక్తిత్వాలుంటాయి. జగమెల్లను సుధాదృష్టిచే బ్రోచువారు వంటి ఊహలు అలాంటి మనుషుల్ని చూసి వచ్చి ఉంటాయి. వాళ్ళు వ్యక్తిగతమైన పరిమితుల్ని తమ వ్యక్తిత్వ బలం వలన అధిగమించగలుగుతారు. సుహృద్భావం, ప్రజాస్వామ్యం కోసం కాదు. Because of who they are. వాళ్ళకు మీరు వర్ణించే పరిమితులు వర్తించవు. అలాంటి మనుషుల్ని నేను ఎక్కడున్నా వేటాడి, వెంటాడి పట్టుకుంటాను. ఒదలను. అందుకే నాకు తెలుసు. త్రిపుర అలాంటి మనిషి. ఆయన కధలూ కవిత్వం అవీ నాకు అక్ఖల్లేదు. ఆయనకీ తెలుసు. ఆయన ఏది రాసినా నాకు ఒప్పుతుందని మీరనుకున్నది నిజం కాదు. తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే. బ్రహ్మానందం గారు, కళలో తన్మయమైన కళాకారులకు ఎవరి అభిప్రాయాలతో ఖాతరు లేదు. లోకం అనుకునేది వాళ్ళకు ఈకముక్కా బరాబర్. నామిని ఉన్నారు కదా?

    Art Spirit అని ఒక పుస్తకం ఉంది. Robert Henri రాసేరు. ఆయన ఈ మన:స్థితిని వర్ణిస్తారు.

    నిఖిల్ బెనర్జీ అని ఒక సితార్ విద్వాన్. ఆయన ఇలా ఉండేవారట. లౌక్యం, తర్కం, మర్యాదా కళాకారుని మనసును అర్ధం చేసుకోలేవు. వాటికి అనుభవం లేదు, హంగులే ఉన్నాయి – social trappings. మీరన్న సుబ్బారావు గనక కళాకారుడైతే ఆయన కూడా అంతే. ఎవరి స్థిరాభిప్రాయాలు, చరాభిప్రాయాలూ ఖాతరు చెయ్యడు. అతనిలోని దయ్యం (సరస్వతీదేవి) అభిప్రాయం తప్ప. మీరు లేవనెత్తిన సంఘర్షణ ఆ ఒక్కలా తప్ప ఇంక ఎలాగూ, ఎవరి వలనా నివారణ కాదు.

    కనకప్రసాద్

  4. కినిమా పత్రిక నుంచి – 2 గురించి jonnalagadda radha krishna అభిప్రాయం:

    04/17/2012 12:44 pm

    Bhava Narayana garu – It gives me great pleasure to find others who are equally fond of Raja Ratnam Pillai, the great master of Nadaswaram. He is said to be all time great. Karai Kuruchi Arunachalam or our Telugu great Shaik China Moula Saheb, though highly revered are rated only after him. My father used to tell me that Raja Ratnam Pillai once rendered ‘Thodi’ one of the most difficult of Ragas, for a whole night. He was a genius. I was told that he never played at Thiruvayyar, where Thyagaraja Swamy Aradhanotsavam is held every year. I also read that the present Nadaswaram bar was designed by him and is called ‘Rajaratnam Bar’.
    If you have any of his collections, please upload them, so that people like me could preserve.

    Jonnalagadda Radha Krishna.

  5. ఖమాజ్/ ఖమాచ్/ కమాస్ రాగం గురించి Madhavamurthy అభిప్రాయం:

    04/16/2012 1:33 pm

    కర్ణాటక సంగీతానికి ఆద్యులు చాలామంది కర్నాటక తీరములో ఉండుటవలన భక్తి ఉద్యమం ఆంధ్ర ప్రాంతం కంటే కర్ణాటక రాజ్యములలొ ప్రబలంగా ఉండేది. పురందరదాసు సంగీత అభ్యాసానికి basics గ్రంధం చేసారు. అందువలననే దక్షిణ సంగీతానికి కర్నాటక సంగీతమనే పేరు స్థిరపడింది. మన తెలుగు వాళ్ళకంటె కన్నడిగులు, తమిళులు భాషా ప్రేమికులు. జ్ఞానపీఠ పురస్కారాలు కన్నడ భాషా రచనలకే ఎక్కువ.

  6. అమ్మ గురించి kiranmayi chadalavada అభిప్రాయం:

    04/16/2012 5:39 am

    Is it a complete story?

  7. మూడు లాంతర్లు – 10 గురించి Brahmanandam Gorti అభిప్రాయం:

    04/15/2012 2:56 pm

    కనక ప్రసాద్ గారూ,

    మీ మూడు లాంతర్లు చాలా బావుంది. Cognitive Scienceతో కళలకీ, సాహిత్యానికీ ఉన్న అనుబంధం చక్కగా వివరిస్తున్నారు. మా స్నేహితుడి అబ్బాయి ఈ మధ్యనే Congtive Scienceలో డిగ్రీ చేసాడు. ప్రస్తుతమిది కేవలం స్పోర్ట్స్ లోనే ఎక్కువగా కనిపిస్తోంది. మీ ఈ రచనని ఎంతో ఉత్సాహంగా చదువుతున్నాను. బాగా రాస్తున్నారు.

    Cognitive Dissonance గురించి ప్రస్తావిస్తూ – “ఇది నచ్చినట్లు లేదు అనిపించిన రచనను, దాన్ని సమర్ధిస్తూ, మెచ్చుకుంటూ వచ్చిన సిఫారసులు ఎన్ని చదివినా, విన్నా ఆ అభిప్రాయం – అంటే ఫిర్స్త్ ఇంప్రెస్సిఒన్ మార్చుకోవటం దుర్లభం. అది ఎప్పుడు సాధ్యమౌతుందంటే, ఏవో బలమైన కారణాల వలన ఆ పాఠకుడు ‘మారు మనసు’ పొందినప్పుడు – అంటే తన నమ్మకాలు, లక్ష్యాలు, సంకల్పాలు, తన ఔద్వేగిక వ్యవస్థల్లోన అనుకూలంగా మార్పు వచ్చినప్పుడు.” అని రాసారు.
    కేవలం ఒక రచనే మీదే ఆధారపడి అభిప్రాయాలు వుండవు. ఉదాహరణకి మనకి ఒక వ్యక్తి నచ్చడనుకోండి. రకరకాల కారణాలుండచ్చు. ఆ సదరు వ్యక్తి ఏం చేసినా అంటే ఎంత మంచి రచన చేసినా మనసు మార్చుకోవడం కాని పని. మిగతా ప్రపంచం మెచ్చుకున్నా మనం మెచ్చుకోలేము. ఎందుకంటే ఇక్కడ రచనని వ్యక్తిగత అభిప్రాయం ఆసాంతమూ ఆవరించుకుంటుంది. ఇదే ఆ వ్యక్తి పరిచయం లేడనుకోండి. రచనగానే పరిగణించి చదువుతాం. నచ్చిందీ, లేనిదీ ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. బాగా నచ్చితే మరిన్ని సార్లు చదువుకుంటాం. ఇక్కడ రచనలో మనల్నీ, మన అభిప్రాయాలకి దగ్గరగా ఉన్న సంఘటనలనీ identify చేసుకోవాడానికి ప్రయత్నిస్తాం. ఒకసారి ఒక అభిప్రాయం వచ్చిన తరువాత దాని ప్రభావం అదే వ్యక్తి రాసిన మిగతా రచనల మీదా కూడా ప్రసరిస్తుంది. ఇది కేవలం సాహిత్యానికే సంబంధించిన విషయమే కాదు. మిగతా కళలకీ వర్తిస్తుంది. అందుకే క్రీడల్లో ప్రతీ ఆటగాడికీ అభిమానుల సమూహాలుంటాయి.

    మనకి నచ్చని వారు ఏం చేసినా మనం మెచ్చుకోలేము. ఇక్కడ value judgement కంటే personal judgementకే ప్రాముఖ్యత ఉంటుంది. ఒకరికొకరు నచ్చడం, నచ్చకపోవడం సాపేక్షం. ఒక్కోసారి మనకి పరిచయమున్న వారి అభిప్రాయాలు మీద ఆధారపడి మన అభిప్రాయాలు ఏర్పరుచుకుంటాం. ఉదాహరణకి సుబ్బారావంటే నా స్నేహితుడికి మంచి అభిప్రాయం వుంది. అది అతను నాతో చెప్పినప్పుడు నా అభిప్రాయం మీద అతని ప్రభావం ఖచ్చితంగా ఉండే అవకాశం వుంది. తద్వారా సుబ్బారావంటే నాకొక స్థిరాభిప్రాయం ఏర్పడుతుంది. ఇది రచనలక్కూడా వర్తిస్తుంది. కాదంటారా? ఇంకా – మీకు త్రిపుర గారితో బాగా పరిచయం వుంది. ఇష్టం కూడా. కాబట్టి ఆయన రాసినవన్నీ మీకు నచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు ఒక రచనని విభేదిద్దామనుకున్నా ఆయన మీద మీకున్న పూర్వపు అభిప్రాయం ప్రస్తుత విభేధాన్ని మింగేయచ్చు. ఇలాంటి సందర్భాల్లో cognitive dissonanceని personal resonance డామినేట్ చేస్తుందని నా అభిప్రాయం.

    మీరు జవాబు చెప్పరని తెలుసు. అయినా ఆత్రుత కొద్దీ రాస్తునాను.

    -సాయి బ్రహ్మానందం

  8. కోనసీమ కథలు: పిండంతే నిప్పటి గురించి kiranmayi chadalavada అభిప్రాయం:

    04/15/2012 6:09 am

    Very different. Awesome story.

  9. కినిమా పత్రిక నుంచి – 2 గురించి Siddineni Bhava Narayana అభిప్రాయం:

    04/14/2012 9:37 am

    Rohini Prasad garu,

    We as a group, those who are deprived of classical foundation in music, I am afraid, are prone to be obsessed with strange, inconsistent likes and dislikes. Should I submit to T N R Rajarattinam Pillai’s Kalyani or Sama, I can not help convincing my self that his is the most sensual of all the musical instruments. And his must be the consummate skill ever attained over the instrument.

    Could any one like KRP, please give us a brief sketch on the man and the artiste [such as the gajarohanam he was felicitated by] with the good offices of the management!

  10. సీత గడియ గురించి Kavitha అభిప్రాయం:

    04/12/2012 12:05 pm

    Sri Raama.

    My whole hearted regards and thanks to the author and others who coordinated in delivering this. I felt deep satisfaction after reading the essay and knowing the song. In our current society, where most of the women’s values have deteriorated in both self and men’s perspectives, I feel these songs increases confidence within. Like conveying how to play different roles easily, manage everyone at home while giving scope to self interests etc. There is need to propagate these songs and I thank the site organizers for bringing such good content in to light.