వేలూరి గారు, కథ బాగుంది, కడుపుబ్బ నవ్వించారు. ఇంతకు బ్రహ్మ భారతదేశపు వాసియా లేక అమెరికాలోని దక్షిణ ప్రాంత వాసియా? ఇంతకూ నాలుగు తలల బ్రహ్మకు నాలుగు టిక్కెట్లా లేక బ్రహ్మ కూడ కామరూపుడా? లేకపోతే బ్రహ్మ నాలుగు తలలను ఒక బ్రహ్మాణీ మాత్రమే చూడగలుగుతుందా? అసలు బ్రహ్మకు సరిగా గూగుల్ చేయడము చేతనవుతుందా? నేను గూగుల్ చేసినప్పుడు, ఆఫ్రికాలో రెండు చోటులలో, అమెరికాలో ఒక చోట, ఇండియాలో ఒక చోట ఈ శంబళ ఉన్నది, కాని బ్రహ్మకు కావలసిన శంబళ లేదు కాబోలు. బ్రహ్మ ఉద్యోగానికి రాజీనామా చేస్తే ఇంటిలో కుంపటి ఎలా వెలుగుతుందో? వ్రాయండి, వ్రాయండి, ఇలాగే వ్రాయండి. లాఫ్టర్ ఈస్ ది బెస్ట్ మెడిసిన్ కాబట్టి ఇక మీద మందులు వాడడము తక్కువ చేసికోవచ్చు 🙂 విధేయుడు – మోహన
నాలుగేళ్ళ కిందట తెలుగు సాహిత్యాన్ని పరిచయం చేసుకునే రోజుల్లో తిలక్ కథలు చదివాను. అందులో నాకు ఈ ’అద్దంలో జిన్నా’ కథ బాగా నచ్చింది. మీరు రాసినదాంట్లో ఓ రెండు విషయాలు ’నా అభిప్రాయాలే’ అని అనిపించాయి.
>> కథలని కొన్ని లక్షణాల చట్రాలతో బిగించి కట్టుదిట్టంగా చూసే అలవాటున్న వారికి, ఇది ఒక స్కెచ్. సైకలాజికల్ స్కెచ్‌గా కనిపించవచ్చు.
ఈ కథ నాకు చాలా నచ్చటానికి ఇదే ముఖ్యకారణం. ఈ కథను చదివిన కొందరు ఇది చాలా అసంబద్ధమైన కథనీ, ఒక పట్టాన అర్థంకాదనీ అంటారు. కానీ నన్ను అడిగితే, కథాకాలంనాటి దేశరాజకీయ పరిస్థితులు అంతగా తెలియకున్నా కూడా ఈ కథ బలంగా తాకింది నన్ను.
తిలక్ ఏమంత గొప్ప కథకుడు కాదన్న వాదననూ విన్నాను. కానీ నేను చదివిన అతికొద్ది మంది తెలుగు కథకుల్లో తిలక్ కథలు ఒకట్రెండు నాకు చాలా నచ్చేవి ఉన్నాయి. నాకాయన కవిత్వంకన్నా కథలమీదే ధ్యాస ఎక్కువ.
>> లబ్ధప్రతిష్టులైన కవులు కథ రాసినా, కవిత్వం రాసినా కవిత్వం లాగానే కనపడుతుంది. చదివితే కవిత్వంలా వినిపిస్తుంది.
మీ మటుకు మీకే కాదు, నేను కూడా మీ జట్టే ఈ విషయంలో. జనరలైజ్ చేసే ఉద్దేశ్యం నాకూ లేదుగానీ, దాదాపుగా నేను చదివిన కవుల prose కూడా కవిత్వంలానే చదివిస్తుంది, వినిపిస్తుంది, అనిపిస్తుంది. తెలుగులో శ్రీశ్రీ, బైరాగి కథలు అలా అనిపించాయి నాకు.
@Siddineni గారు: ’యాట’ అన్న పదానికి ram, she-goat అని ఇచ్చిన అర్థాలు పునరుక్తి కాదు. ’యాట’ అన్న ధాతువు, దాని తద్భవ రూపాలను కొన్ని ద్రావిడ భాషలలో గొఱ్ఱె (మగ గొఱ్ఱె) అన్న అర్థంలోనూ, మరి కొన్ని భాషలలో ఆడుమేక గాను ఉపయోగిస్తారు.
వివిధ భాషలలో ఈ ధాతువుకు సంబంధించిన సజాతి పదాలు వాటి అర్థాలు:
చావల్ అన్న పదం ఏ భాష జన్యం అన్న విషయం గురించి ఎన్నో వాదోపవాదాలు జరిగాయి. అది కచ్చితంగా సంస్కృత జన్యము కాదు (సంస్కృత పదమైన శ్యామల జన్యమని వాదించేవారు లేకపోలేదు). అది ద్రావిడ భాషా జన్యమైనా అయ్యిండాలి. లేదా లుప్తమైన ఉత్తరాది దేశభాషల నుండి హిందీలోకీ ద్రావిడ భాషలలోకి ప్రవేశించైనా ఉండాలి.
“తెర చాటు చందమామ” బ్లాగ్ చర్చలొ చెప్పినట్టు అనువాద చిత్రాల గీతాలు రాయడంలొ వేటూరి గారు విఫలమయ్యారేమో కాని అనువాద చిత్రాలకి పాటలు రాసేపుడు చాల limitations ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకి, చిత్రీకరణ కావచ్చు, లేదా సంగీత దర్షకుడి pressure కావచ్చు, పెద్దల అనుకరణ కావచ్చు. వీటిని కూడా మనము దృష్టిలొ పెట్టుకొవాలి కదా? చాల మంచి పాటలు రాసిన వాళ్ళు ఇందులొ విఫలం కావడానికి ఖచ్చితంగా ఏదో కారణం ఉండి ఉంటుంది.
ఇక్కడ ఇంకొ విషయం గమనించాలి, అనువాద చిత్రాలకి (Dubbing songs) విఫలమయిన వాళ్ళే remake movies songs బాగానే రాశారు కదా? ఉదాహరణకి “సీతాకొక చిలక” సినిమాలొ పాటలు బాగుంటాయి.
Allow me to add a couple of lines as information in re: SrInaatha.
Velcheru Narayana Rao and David Shulman have recently written a cultural biography of SrInaatha, entitled, ” SrInaatha: The Poet who made Gods and Kings”, published by The Oxford University Press (2012). A section in the book, ‘remembered biographies’, has an interesting discussion on ‘cATuvulu’. The discussion on the cATuvulu could as well complement the afterword in their other work: A Poem at the Right Moment (University of California Press, 1998), which has been introduced in these pages long time ago. I am planning on writing a review of SrInaatha for eemaata, soon.
మనం ఫోన్లో ఎంత సెపు మాట్లాడుకున్నా కొన్ని భావాలను చెప్పుకోలేం. వాటిని ఉత్తరాల ద్వారా మాత్రమే చెప్పుకోగలం. ఉత్తరాలే అంతరించిపొతున్న కాలంలో, ఉత్తరాల ప్రాముఖ్యత గురించి చాలా చక్కగా చెప్పారు. పిల్లి గురించి చదివినప్పుడు నాకు బాగా నవ్వు వచ్చింది, ఇటువంటి పిల్లులు కూడా ఉంటాయా అని.
అంత రంగాన పరచు కున్న అంబరం
ఆత్మలో ఆత్మగా వెలిగే కిరణం –
వెన్నెంటి వచ్చే వెచ్చని జ్ఞాపకం – మాతృ హృదయం.
ఇది సత్యం!
మననుంచి అమ్మని విడదీయలేం.
ఇక బాల్యం –
చిత్ర వర్ణాల సజీవ చిత్రపటం
కలల తీరాన –
కరగిపోని కమనీయ దృశ్యం.
ఆకాశానెగిరే రంగుల పతంగం
తళుకులీను జ్ఞాపకాల నక్షత్రం – బాల్యం!
నా వ్యాసం చదివాక, మీకు – మీ అమ్మగారు, వున్న వూరు గుర్తొచ్చాయంటే..
నాకూ ఆనందమేసిందండి!
అద్భుతమైన బాల్యాన్ని అందించిన నా తల్లి తండ్రులకు నేనేమిచ్చి ఋణం తీర్చుకో గలననిపిస్తుంది!..
నా మనసంతా లాగేసుకున్న సంక్రాంతి మీద రచనలు ప్రచురించిన ఈమాట వారికీ – ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు తెలియచే సు కుంటున్నా…థాంక్యూ ఈమాట!
మీ స్పందనని తెలియచేసినందుకు, రాధ గారూ! ధన్యవాదాలు.
శుభాకాంక్షలతో-
ఆర్.దమయంతి.
దీక్షా లాక్షా రాగ రేఖ గురించి adviatam అభిప్రాయం:
05/01/2012 4:40 pm
” క్షితిజ నిశాంత నీలిమల మీద
చెలీ!
అవిశ్రాంతంగా మనం
నవ నవాలైన
ఉషః ఉదయాలు పరవాలి”
అద్భుతంగా ఉంది అండి
బ్రహ్మ సృష్టి గురించి మోహన అభిప్రాయం:
05/01/2012 3:37 pm
వేలూరి గారు, కథ బాగుంది, కడుపుబ్బ నవ్వించారు. ఇంతకు బ్రహ్మ భారతదేశపు వాసియా లేక అమెరికాలోని దక్షిణ ప్రాంత వాసియా? ఇంతకూ నాలుగు తలల బ్రహ్మకు నాలుగు టిక్కెట్లా లేక బ్రహ్మ కూడ కామరూపుడా? లేకపోతే బ్రహ్మ నాలుగు తలలను ఒక బ్రహ్మాణీ మాత్రమే చూడగలుగుతుందా? అసలు బ్రహ్మకు సరిగా గూగుల్ చేయడము చేతనవుతుందా? నేను గూగుల్ చేసినప్పుడు, ఆఫ్రికాలో రెండు చోటులలో, అమెరికాలో ఒక చోట, ఇండియాలో ఒక చోట ఈ శంబళ ఉన్నది, కాని బ్రహ్మకు కావలసిన శంబళ లేదు కాబోలు. బ్రహ్మ ఉద్యోగానికి రాజీనామా చేస్తే ఇంటిలో కుంపటి ఎలా వెలుగుతుందో? వ్రాయండి, వ్రాయండి, ఇలాగే వ్రాయండి. లాఫ్టర్ ఈస్ ది బెస్ట్ మెడిసిన్ కాబట్టి ఇక మీద మందులు వాడడము తక్కువ చేసికోవచ్చు 🙂 విధేయుడు – మోహన
అద్దంలో జిన్నా: కథ నచ్చిన కారణం గురించి Purnima అభిప్రాయం:
05/01/2012 2:53 pm
నాలుగేళ్ళ కిందట తెలుగు సాహిత్యాన్ని పరిచయం చేసుకునే రోజుల్లో తిలక్ కథలు చదివాను. అందులో నాకు ఈ ’అద్దంలో జిన్నా’ కథ బాగా నచ్చింది. మీరు రాసినదాంట్లో ఓ రెండు విషయాలు ’నా అభిప్రాయాలే’ అని అనిపించాయి.
>> కథలని కొన్ని లక్షణాల చట్రాలతో బిగించి కట్టుదిట్టంగా చూసే అలవాటున్న వారికి, ఇది ఒక స్కెచ్. సైకలాజికల్ స్కెచ్‌గా కనిపించవచ్చు.
ఈ కథ నాకు చాలా నచ్చటానికి ఇదే ముఖ్యకారణం. ఈ కథను చదివిన కొందరు ఇది చాలా అసంబద్ధమైన కథనీ, ఒక పట్టాన అర్థంకాదనీ అంటారు. కానీ నన్ను అడిగితే, కథాకాలంనాటి దేశరాజకీయ పరిస్థితులు అంతగా తెలియకున్నా కూడా ఈ కథ బలంగా తాకింది నన్ను.
తిలక్ ఏమంత గొప్ప కథకుడు కాదన్న వాదననూ విన్నాను. కానీ నేను చదివిన అతికొద్ది మంది తెలుగు కథకుల్లో తిలక్ కథలు ఒకట్రెండు నాకు చాలా నచ్చేవి ఉన్నాయి. నాకాయన కవిత్వంకన్నా కథలమీదే ధ్యాస ఎక్కువ.
>> లబ్ధప్రతిష్టులైన కవులు కథ రాసినా, కవిత్వం రాసినా కవిత్వం లాగానే కనపడుతుంది. చదివితే కవిత్వంలా వినిపిస్తుంది.
మీ మటుకు మీకే కాదు, నేను కూడా మీ జట్టే ఈ విషయంలో. జనరలైజ్ చేసే ఉద్దేశ్యం నాకూ లేదుగానీ, దాదాపుగా నేను చదివిన కవుల prose కూడా కవిత్వంలానే చదివిస్తుంది, వినిపిస్తుంది, అనిపిస్తుంది. తెలుగులో శ్రీశ్రీ, బైరాగి కథలు అలా అనిపించాయి నాకు.
పలుకుబడి: మానవ బంధుత్వ పదాలు 2 గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:
05/01/2012 9:58 am
@Siddineni గారు: ’యాట’ అన్న పదానికి ram, she-goat అని ఇచ్చిన అర్థాలు పునరుక్తి కాదు. ’యాట’ అన్న ధాతువు, దాని తద్భవ రూపాలను కొన్ని ద్రావిడ భాషలలో గొఱ్ఱె (మగ గొఱ్ఱె) అన్న అర్థంలోనూ, మరి కొన్ని భాషలలో ఆడుమేక గాను ఉపయోగిస్తారు.
వివిధ భాషలలో ఈ ధాతువుకు సంబంధించిన సజాతి పదాలు వాటి అర్థాలు:
తమిళం: యాటు, ఆటు goat, sheep; ఆట్ట్-ఆళ్ shepherd.
మలయాళం: ఆటు goat, sheep; ఆట్టుకారన్ shepherd.
కోత:. అర్ goat.
తొద: ఒడ్ goat.
కన్నడ: ఆడు goat
కొడగు: అడి
తుళు: ఏడు
తెలుగు: ఏడిక, ఏట
గొండి: యేటీ, ఏటి she-goat (Voc. 376).
పెంగొ: ఓడ goat.
మండ: ఊడె
కుయి: ఓడ
కువి: ఓడా, ఓడ
కూరుఖ్: ఏరా she-goat.
మాల్తో: ఏరె
బ్రాహుయి: హేట్
సంస్కృతం: ఏడ, ఏడక, ఏడీ a kind of sheep;
(Turner, CDIAL, no. 2512., DEDR 5152)
చావల్ అన్న పదం ఏ భాష జన్యం అన్న విషయం గురించి ఎన్నో వాదోపవాదాలు జరిగాయి. అది కచ్చితంగా సంస్కృత జన్యము కాదు (సంస్కృత పదమైన శ్యామల జన్యమని వాదించేవారు లేకపోలేదు). అది ద్రావిడ భాషా జన్యమైనా అయ్యిండాలి. లేదా లుప్తమైన ఉత్తరాది దేశభాషల నుండి హిందీలోకీ ద్రావిడ భాషలలోకి ప్రవేశించైనా ఉండాలి.
పలుకుబడి: మానవ బంధుత్వ పదాలు 2 గురించి Siddineni Bhava Narayana అభిప్రాయం:
05/01/2012 8:45 am
”యాట ‘ram, she-goat’ > ఆటు (త.) – – ఏట (తె.)”
ram ఆంటే male goat/sheep [uncastrated] గదా? అచ్చు తప్పనుకుంటాను.
‘చవియల్/చావల్ > అవియల్ = దంచిన బియ్యం’
హిందీ లో కనిపించె చావల్ ద్రవిడ జన్యమా?
వేటూరి పాట గురించి pradeep అభిప్రాయం:
05/01/2012 5:47 am
“తెర చాటు చందమామ” బ్లాగ్ చర్చలొ చెప్పినట్టు అనువాద చిత్రాల గీతాలు రాయడంలొ వేటూరి గారు విఫలమయ్యారేమో కాని అనువాద చిత్రాలకి పాటలు రాసేపుడు చాల limitations ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకి, చిత్రీకరణ కావచ్చు, లేదా సంగీత దర్షకుడి pressure కావచ్చు, పెద్దల అనుకరణ కావచ్చు. వీటిని కూడా మనము దృష్టిలొ పెట్టుకొవాలి కదా? చాల మంచి పాటలు రాసిన వాళ్ళు ఇందులొ విఫలం కావడానికి ఖచ్చితంగా ఏదో కారణం ఉండి ఉంటుంది.
ఇక్కడ ఇంకొ విషయం గమనించాలి, అనువాద చిత్రాలకి (Dubbing songs) విఫలమయిన వాళ్ళే remake movies songs బాగానే రాశారు కదా? ఉదాహరణకి “సీతాకొక చిలక” సినిమాలొ పాటలు బాగుంటాయి.
వేటూరి పాట గురించి pradeep అభిప్రాయం:
05/01/2012 4:40 am
యశస్వి గారు,
మీరు చెప్పిన పాట గురించి వేటూరి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. వీలు అయితే చదవండి.
[దయచేసి ఇంగ్లీష్‌లో కానీ, తెలుగులో కానీ వ్రాయండి. తెంగ్లీష్ వాడకండి – సం.]
చాటు పద్యాల్లో శ్రీనాథుడు గురించి vrveluri అభిప్రాయం:
04/28/2012 4:51 pm
Allow me to add a couple of lines as information in re: SrInaatha.
Velcheru Narayana Rao and David Shulman have recently written a cultural biography of SrInaatha, entitled, ” SrInaatha: The Poet who made Gods and Kings”, published by The Oxford University Press (2012). A section in the book, ‘remembered biographies’, has an interesting discussion on ‘cATuvulu’. The discussion on the cATuvulu could as well complement the afterword in their other work: A Poem at the Right Moment (University of California Press, 1998), which has been introduced in these pages long time ago. I am planning on writing a review of SrInaatha for eemaata, soon.
Regards, — Veluri Venkateswara Rao
అమ్మ ఉత్తరం గురించి rambabu అభిప్రాయం:
04/27/2012 6:20 am
ప్రసాద్ గారు,
మనం ఫోన్లో ఎంత సెపు మాట్లాడుకున్నా కొన్ని భావాలను చెప్పుకోలేం. వాటిని ఉత్తరాల ద్వారా మాత్రమే చెప్పుకోగలం. ఉత్తరాలే అంతరించిపొతున్న కాలంలో, ఉత్తరాల ప్రాముఖ్యత గురించి చాలా చక్కగా చెప్పారు. పిల్లి గురించి చదివినప్పుడు నాకు బాగా నవ్వు వచ్చింది, ఇటువంటి పిల్లులు కూడా ఉంటాయా అని.
-రాంబాబు
భోగి తలంట్లు గురించి ఆర్.దమయంతి అభిప్రాయం:
04/27/2012 3:22 am