పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16464

  1. జీనో పేరడాక్సు గురించి C.S.Rao అభిప్రాయం:

    11/14/2010 7:52 pm

    ఎన్నో ఏళ్ళ క్రింద మా కొలీగ్ మాధమేటిక్స్ హెడ్ చెప్పగా విన్నాను ఈ జీనో పారడాక్స్ గురించి.తమాషాగా ఉందే అనుకున్నాను.దీన్ని కవితా వస్తువుగా తీసుకుని హింసను నిరసిస్తూ, సామాజిక స్పృహను,కరుణామయ మానవీయతను ఆవిష్కరించిన తీరు బావుంది. మాధవ్ గారికి అభినందనలు.

  2. గ్లాస్ నోస్త్ గురించి sivasankar అభిప్రాయం:

    11/14/2010 2:27 pm

    “కట్టువిప్పినపుడు మళ్ళీ
    గాయమే ఎదురైనట్టుగా ఉంది.” సహజంగా ఉంది ఈ పోలిక.

  3. జ్ఞాపకం గురించి sivasankar అభిప్రాయం:

    11/14/2010 2:20 pm

    “జ్ఞాపకం ” యెప్పటికీ ఒక మంచి కవితా వస్తువే కదా… Like Edgar Allan Poe said ” Lost of a beautiful women” is always a everlasting topic for poets..
    Life swirls and drills in and out within the mind with it’s memories.. I sometimes wonder how many gigabytes of memory it require to shell out all these..

    I like your style ” simplicity”.. Keep writing

    Reg
    Siva

  4. నిన్నటి కల గురించి sivasankar అభిప్రాయం:

    11/14/2010 2:14 pm

    “పచ్చిగానే” అన్న పదము యెప్పుడు యెక్కడ చదివినా ఒక్క సారిగా శరీరము పులకరిస్తుంది యేమో మరి ! నిశితము గా ఉన్నది మీ ఆలొచనా విధానము…

  5. రామప్ప సరస్సు గురించి sivasankar అభిప్రాయం:

    11/14/2010 2:09 pm

    చని పోయిన మా అక్క గుర్తుకు వచ్చింది అండీ మీ కవిత్ చదివాక.
    “నన్ను నిలువెల్లా కుదిపేసిన నిశ్చలతని

    ఎలా చూడగలిగాం !” జీవతం లో యేదో ఒక రోజు ప్రతీ ఒక్కరూ తప్పని సరిగా దీన్ని చవి చూడ వలసిందే కదా!

  6. నిద్రానుభవం గురించి sivasankar అభిప్రాయం:

    11/14/2010 1:58 pm

    లాగి లెంపకాయ కొట్టినట్టు నాకు అచిపించింది అండి మీ కవిత. మనస్సు తనువు రెండూ స్పందించాయి మీ కవిత చదివాక…

  7. కథ నచ్చిన కారణం: కొత్త శీర్షిక. మీకు మా ఆహ్వానం గురించి Madhav అభిప్రాయం:

    11/14/2010 10:06 am

    ఈ శీర్షిక ప్రకటనపై ఇప్పటిదాకా వచ్చిన అన్ని అభిప్రాయాలూ కేవలం ఒకే విషయంపై రావడం మాకు కొంచెం విడ్డూరంగానే ఉంది. పాతకథలకి ప్రాధాన్యం ఇవ్వడాన్ని కొత్త కథలను నిరుత్సాహపరచడంగా భావించడం ఎందుకో మాకు అర్థం కాని విషయం. ఇప్పటి కథలు చాలా మటుకు అందరికీ అందుబాటులో వున్నవి. వాటిపై చర్చలూ, సమీక్షలూ జరుగుతూన్నై. సంకలనాలూ వస్తున్నై. ప్రస్తుత వ్యవస్థ పైనో, సమాజం పైనో, పోయిన వారమో, నెల్లోనో అచ్చై మీరు చదివిన కథను పరిచయం చేయించడం ఈ శీర్షిక ఉద్దేశం మాత్రం కాదు. వాటి గురించి ఈ శీర్షికలో రాయాలనే ఎందుకు? మీరు ఒక వ్యాసంగా కూడా ఈమాటకు రాయవచ్చు కదా. ఒక కథ, మీరెప్పుడో చదివింది, ఇన్నేళ్ళూ మిమ్మలనంటిపెట్టుకున్నది – ఆ కథ ఉందే, దానిని మీచేత పరిచయం చేయించటం ఈ శీర్షిక లక్ష్యం. పాత కథకులు, కథలు ఇప్పటి తరాలకు విస్మృతులు. వారిని మళ్ళీ పరిచయం చేయడం, తద్వారా ఆనాటి ప్రపంచాన్ని, అందరికీ తెలిసిన ప్రపంచం గురించే కాక, మనకు తెలీని ఇంకో ప్రపంచాన్ని పరిచయం చేసుకోడం ఈ శీర్షిక ఉద్దేశమని స్పష్టంగానే ఉంది కదా. లేదా?

    ఏ ఒక్క శీర్షిక తోటో సాహిత్యం మొత్తం చుట్టబెట్టలేం. కేవలం మీకు నచ్చిన కథ అంటే మరీ విస్తారంగా ఉండి, అందరికీ తెలిసిన కథలనే మళ్ళీ మళ్ళీ ప్రస్తావిస్తారనే భయంతో, ఈ శీర్షికకు కొన్ని సరళమైన నియమాలు, జనరల్ గైడ్‌లైన్స్ రాశాం. అంతమాత్రం చేత, పైన కామెంట్లలో రాసినట్టు, మాకు లేని అభిప్రాయాలని మాకంటగట్టి, మమ్మల్ని దీవిస్తే మేమేం చేయగలం? చెప్పండి :-). ప్రముఖుల కథలే పరిచయం చేయమని చెప్పామా? కొత్త కథలంటే చిన్నచూపు అన్నామా? (ఉదాహరణకిచ్చిన పేర్లలో ప్రముఖులే ఎక్కువ. అది మా తప్పే!)

    పైన అభిప్రాయాలు చెప్పిన వారంతా ఈమాటకి ఆప్తులు. మీ సలహాలు మాకు శిరోధార్యం. ఇంత కష్టపడి, ఈ శీర్షిక ఎలా ఉంటే బాగుంటుందో చెప్పారు కాబట్టీ, అదే శ్రమతో ఓ కథను గూడా పరిచయం చేయండి. సరే, కొత్తదో, పాతదో, మీకు బాగా నచ్చి మిమ్మల్నంటి పెట్టుకుని ఉండిపోయిన ఒక కథ గురించి, ఆ కథ వినూత్నంగా పరిచయం చేసిన ప్రపంచాన్ని గురించి వ్రాయండి. ఆ ప్రపంచాన్ని అందరికీ చూపించండి. కేవలం ఈ శీర్షిక ఎలా ఉండాలో చెప్పి మౌనంగా మాత్రం దయచేసి ఉండకండి.

    – సంపాదకులు

  8. పూల పల్లకి గురించి mallikarjundev Ch అభిప్రాయం:

    11/14/2010 9:33 am

    చల్లని పిల్లగాలిలో తేలిపోయినట్లుంది. అభినందనలు.

  9. కథ నచ్చిన కారణం: కొత్త శీర్షిక. మీకు మా ఆహ్వానం గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    11/14/2010 1:30 am

    మంచి ప్రయత్నం. కాని పేరు నిరపేక్షంగా (impersonal గా) ఉంది. “నాకు నచ్చిన కథ” అంటే క్లుప్తంగా బాగుంటుంది. పాత కథలయినంత మాత్రాన అందరూ పదే పదే చెప్పే గొప్ప పేరున్న కథకులవే అయి ఉండాలని లేదు. పూసపాటి గారి గురించి ఎంతమందికి తెలుసు?

    నచ్చిన కారణంతో కేవలం పరిచయం చేసేదిగా కాక, వ్యాసం కథకి వన్నె తెచ్చేదిగా ఉంటుందని ఆశిద్దాం. నేను కొన్నేళ్ళ క్రితం షాపులో చూసి వెంటనే కొన్న పుస్తకం, Touchstones [1] గుర్తొచ్చింది. ఈ కాలపు కవులు, బాగా పేరున్న వాళ్ళూ, అంతగా లేని వాళ్ళూ, ఒక్కొక్కరు తమకి నచ్చిన ఓ కవిత, వేరే వాళ్ళు రాసినది, పాతదైనా కొత్తదైనా, ఎందుకు నచ్చిందో రాశారు. కవితలే కాక వ్యాసాలు కూడా గుర్తుంచుకోదగ్గవి. పుస్తకం అంతా ఒక్క పట్టున చదవనవసరం లేదు.

    ఇవాళ దాంట్లో Maxine Kumin వ్యాసం చదివాను. తన భుజాల్లో, వెన్నుపూసలో బాధ ఎందుకో కనుక్కోడానికి ఆవిడని డాక్టర్లు MRI scan కి పంపించారు. ఆ పరీక్ష చావుకి దరిదాపుల్లో ఉంటుంది. దాన్ని భరించడానికి తను కంఠస్థం చేసిన కవితలని గుర్తు తెచ్చుకున్నాననీ, వాటన్నిటిలోకీ బాగా పనికొచ్చినది AE Housman కవిత “XXVII,” అన్నది. “We are all mortal, but it is the poet who shivers most articulately under the thin blanket of mortality,” అని ముగించిన వ్యాసం, “Trochee, Trimeter, and the MRI,” నన్నాకట్టుకుంది. నేనూ ఒకసారి MRI తతంగం పాలయ్యాను, అప్పటికిది చదివుంటే బాగుండేది.

    తెలుగులో Touchstones లాంటి పుస్తకాలేమన్నా ఉన్నాయేమో తెలియదు.

    కొడవళ్ళ హనుమంతరావు

    [1] “Touchstones: American Poets on a Favorite Poem,” edited by Robert Pack and Jay Parini. Middlebury College Press, 1996.

  10. పరిశోషణం గురించి rama bharadwaj అభిప్రాయం:

    11/14/2010 12:04 am

    జమిలిగా వైదేహీ ఉదయకళలకి,

    ఈ సంచికలో వైదేహి కవిత .. ఉదయకళ కవిత కూడా వ్యక్తీకరణ లో వేరే తోవ అయినా…. థీమ్ లో ఇంచుమించుగా ఒకేలాంటి భయాన్ని తమ భావనల్లో తొణికిసలాడించడం కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించింది.

    వయసుజారిపోయే వేదన అనేది ఒకటి ఉంటుందని అది ఆడవాళ్ళకే ఉంటుందనీ అన్పించేలా సాగాయి ఈ కవితలు. మగవాళ్ళకి అవసరంలేని ఈ అభద్రత ఇలా ఈ కవయిత్రులకే ఎందుకో?? అమ్మాయిలూ అన్ని వయసుల్లోనూ అంతర్లీనంగా ఒక అందం ఉంటుందనీ..ఒక హుందాతనం ఉంటుందనీ మీరు నమ్మలేకపోవడం ఏం బాలేదు . నా అందం ఏమయ్యిందో అని ఇప్పుడే ఈ చిన్న వయసులోనే బేజారైపోతే ఇహ నడి వయసులోకి అడుగుపెట్టాకా మరింకేం విశ్వాసం ఉంటుందీ ఊహించడానికీ??

    అంచేత ఇప్పట్నించే ఈ ముసలి మాటలు ఊహల్లోకి రానివ్వకండి. మీరింకా మంచిమంచి వయసు ఊహలు బోలెడన్ని చేయాల్సే ఉంది:)

    రమ.