పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16464

  1. ఇస్మాయిల్‌ గారితో నా పరిచయం గురించి రవిశంకర్ అభిప్రాయం:

    11/24/2010 5:46 pm

    ఇస్మాయిల్ గారి వర్ధంతి దగ్గరపడిన రోజుల్లో ఈ వ్యాసాన్ని మళ్ళీ గుర్తుచేసి, ఆయనను తలుచుకొనే అవకాశం కల్పించినందుకు సుధీర గారికి ధన్యవాదాలు. ఇస్మాయిల్ గారు మంచి స్నేహశీలి. మీవంటివారు అభిమానంతో కలిస్తే తప్పక సంతోషించేవారు.

    రమ గారి వ్యాఖ్యల విషయానికొస్తే , ఈ వ్యాసం ఇస్మాయిల్ గారు మరణించినప్పుడు ఆయనకు నివాళిగా, ఆయనతో నాకున్న సాన్నిహిత్యాన్ని తలుచుకొంటూ రాసినది. అంతేగాని కవులతో నాకున్న పరిచయాలగురించి గొప్పగా చెప్పుకోవటానికి రాసినది కాదు. నివాళిగా రాసినా ఇందులో అతిశయోక్తులేమీ లేవు. దాదాపు ఇవే అభిప్రాయాలు ఆయన బ్రతికుండగా రాసిన వ్యాసాలలో కూడా ప్రస్తావించాను. ఈ మాటలోనే 1999 జూలైలో వచ్చిన వ్యాసం చూడవచ్చు. కరుణ ముఖ్యమన్నది ఎంతమందికి తెలిసినా, దానిని జీవితంలో, కవిత్వంలో ఒక స్థాయికి చేర్చి నిర్వహించినవారు అరుదుగా ఉంటారు. వ్యాసంలోనే సూచించినట్టు సృష్టిలోని చరాచరాలతో సంస్పందించగలిగే ఒక మానసిక స్థితిని ఇస్మాయిల్ గారు సాధించారని నేననుకుంటాను. అందువల్ల, నా ఉద్దేశంలో ఆయన స్థాయి కేవలం ఒక మంచికవి అనేదానికంటె ఉన్నతమైనది.

  2. ఏ నడలో ఏ ఎడలో! గురించి rama bharadwaj అభిప్రాయం:

    11/24/2010 4:16 pm

    ఈ కనక ప్రసాద్ గారు రాసేవన్నీ తెలుగు అక్షరాలలోనే ఉంటాయి. నాకు తెలుగు వర్ణమాలా .. తెలుగు పదాలూ.. కవితా వాక్యాలూ కూడా చదవడంలో కొంచెం శిక్షణ సైతం ఉంది. కానీ నా సమస్య ఏమంటే ఈయన రాసినవేవీ నాకు అర్ధమవటమే లేదు. బుధజనులెవరైనా వీటికి ఇంత టీకా..తాత్పర్యాలు దయచేస్తే మాలాంటి వారికెందరికో.. ఇంత తెలుగు జ్నానాన్ని అలాగే ఈ కవిహృదయాన్నీ కూడా మరింత విశదంగా అందిచిన వారవుతారు కదా అని నా ఆశా ..నా విన్నపమూను.

    ఈ పాట నా చిన్నఫ్ఫుడు ప్రేమ సమాజం వాళ్ళు పాడిన వరసల్లో బాగా ఇమిడి పోయి ఒక్కసారి ఆ “తలపులని” తలపుకు తెచ్చింది . అందుకు కవిగారికి.. స్వరపరిచిన వారికీ.. పాడిన వారికీ కూడా నా కృతజ్నతలు.

    రమ.

  3. జీనో పేరడాక్సు గురించి Purnima అభిప్రాయం:

    11/23/2010 11:33 am

    Wow!

  4. ఇస్మాయిల్‌ గారితో నా పరిచయం గురించి rama bharadwaj అభిప్రాయం:

    11/23/2010 2:04 am

    ఏమిటో ఈ మధ్య మీ ఈమాటలో కవులతో తమకున్న బంధాల్నీ.. అనుబMధాల్నీ చెప్పుకునే వాళ్ళు పెరిగారు. అలా చెప్పుకున్న వాళ్ళని మెచ్చుకునే వాళ్ళు కూడాను. ఎవరి అభిప్రాయంలోనైనా కూడా తమకు నచ్చినప్పుడు అన్నీ “అద్భుతంగానూ..”, “గొప్ప” గానే ఉండటమ్ సహజమే అయినా ఈ అభిమాన .. అనురాగామృతాలన్నీ ఆ కవులు ఉన్నప్పుడు తక్కువగానూ.. పోయాకా ఎక్కువగానూ వ్యక్తమవడమ్ ఒక్క తెలుగులోనే గమనిస్తాం !!

    ఉదాహరణకి ఈ వ్యాసంలో కవిగా ఇస్మాయిల్ దృస్టిలో “కరుణ” కున్న ప్రాముఖ్యాన్ని కొసమెరుపు చేయడాన్ని గమనించవచ్చు. అది ఇస్మాయిల్ గారి కి మాత్రమేనా ప్రత్యేక లక్షణం?? భవభూతి నించి ఉన్నదే కదా?? కరుణ లేని ఎవరైనా ఉత్తమ మానవుడే కాలేరే?? కవి అన్న వాళ్లలో ఆ దృక్పధం మరింతగా ఉండాల్సినది కదా?? మరి కవి అన్నప్పుడు అతడు ఉత్తమ మానిసీ.. ఉత్తమ ద్రష్ట కూడా కావలసిన వాడు కదా??

    మంచి కవిత్వాన్ని నిర్వచించడమ్ కష్టం. అందులో సహజంగా కలిసిపోయి” భాషా.. ఊహా.. సరళతా” …ముప్పేటలుగానే ఉంటాయి. ఒకటి ప్రస్పుటంగా ఉండి మిగతావి లోపిస్తే దాన్ని మంచి కవిత్వంగా గుర్తు పెట్టుకోలేము. ఇస్మాయిల్ గారు అలాంటి ఒక మంచి కవి అని రవిశంకర్ అభిప్రాయ పడుతున్నారు. కాబోలు.
    రమ.

  5. నా అందం ఏమయింది? గురించి v.j.ramarao అభిప్రాయం:

    11/22/2010 12:28 pm

    one of the most beautiful “kavitha” i have ever read .when reading the lines it sent a wave of joy. And reality of life is beautifully depicted in this kavitha.

  6. ఇస్మాయిల్‌ గారితో నా పరిచయం గురించి sudheera godaari అభిప్రాయం:

    11/21/2010 9:52 am

    ఎంత బాగా చెప్పారండి .మీ అదృష్టం కూడా చాలా గొప్పది. నేను ఇస్మాయిల్ గారిని తరచి చూసుకునే లోపే ఆయన వెళిపోయారు .ఏ కవి విషయంలో అనిపించదు కానీ ఇస్మాయిల్ విషయం లోనూ చలం విషయం లోనూ ఒక్క సారైనా కలిసుంటే బాగుండని.అనిపిస్తుంది . ఐనా మీరు చెప్పిన ఆనంద ముద్ర దాల్చిన ఇస్మాయిల్ చిద్విలాస రూపం ఊహించ గలుగుతున్నాను .కృతజ్ఞతలు ..సుధీర ..

  7. మన్మధుని బాణాలు గురించి Kiran Adimatyam అభిప్రాయం:

    11/21/2010 1:02 am

    చాలా బాగుంది. నేను స్కూల్లో చదుకునేటప్పడు పల్లకి మా ఇంట్లో ఉండేది. ఇప్పడు ఇలాంటివి ఉన్నాయో లేవో. 🙂 Thanks for sharing.

  8. నాటికి నేడు – రేడియో నాటిక గురించి jagadeeshwar reddy అభిప్రాయం:

    11/20/2010 3:42 am

    వంశీగారూ…
    బాబోయ్‌ … ఎంత గొప్ప కలక్షనండీ మీది?
    హేట్సాఫ్‌ సార్‌. పరుచూరి శ్రీనివాస్‌గార్ని ‘పూర్ణతిలక’ పరిచయం చేయమని కోరింది నా తోటి ‘ఈమాట’ పాఠకశ్రోతలకోసమని.
    అన్నట్టు రావుబాలసరస్వతిగారితో రంగనాయకమ్మగారి ఇంటర్వ్యూ ఈ మధ్య విడుదలైన రంగనాయకమ్మగారి వ్యాసాల పుస్తకంలో ఉంది. అదీగాక డిసెంబర్‌ 2010 ‘పాలపిట్ట’ (మాసపత్రిక) లో కూడా ఆ ఇంటర్వ్యూ తాలూకు టెక్ట్స్‌ వస్తోందని తెలిసింది.
    ధన్యవాదాలతో …
    -గొరుసు

  9. రవి గాంచిన కవి: విన్నకోట రవిశంకర్ కవితా సంకలనాల పరామర్శ గురించి నరేన్. అభిప్రాయం:

    11/20/2010 12:08 am

    అమోఘమైన ప్రేమని కవితల్నిండా కుమ్మరించి పంచి పెట్టినందుకు రవి శంకర్ గారిని,
    అందులోనూ ఆణిముత్యాలని సమీక్షించినందుకు మీకు ధన్యవాదాలు.
    నరేన్.

  10. నాటికి నేడు – రేడియో నాటిక గురించి వంశీ అభిప్రాయం:

    11/19/2010 8:24 am

    @గొరుసు గారు – ఈ యామినీపూర్ణతిలక నాటిక రెండు భాగాలుగా పబ్లిష్ అయి ఉన్నది డాక్టర్ కె.బి.గోపాలం గారి సౌజన్యంతో.

    మొదటి భాగం 50 MB కావున కొద్దిగా ఓపిక చూపించవలసి ఉంటుంది.. 🙂

    భవదీయుడు
    వంశీ