పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16464

  1. జీనో పేరడాక్సు గురించి Tirunagari Satyanarayana అభిప్రాయం:

    12/29/2010 5:43 pm

    ముందుగా పేరడాక్స్ గురించి మాట్లాడుకుందాం. సత్యాలుగా కనిపించే (లేదా సత్యం తెలిపే) వాక్యాల (లేదా వాక్యం) తో ఒక అసత్యాన్ని ప్రకటించడం, లేదా ఒక వైరుధ్యాన్ని తెలపడం పేరడాక్స్ . అంతిమ విశ్లేషణకు వైరుధ్యం నిలవదు. అది అసత్యమని తేలిపోతుంది. జీనో పేరడాక్స్ చలనం అసాధ్యమని ప్రతిపాదించ చూస్తుంది. కానీ విశ్లేషణలో అది నిజం కాదని, అసత్యమనీ తేలిపోతుంది. మూలం లో బిల్లీ కాలిన్స్ సేంట్ సెబాస్టియన్ అమరత్వాన్ని ఎంచుకున్నాడు (ఇక్కడ అనువాదంలో సీతారామరాజు అమరత్వాన్ని ఎంచుకున్నాడు). రెస్టారెంటులో జీనో పేరడాక్స్ ని సెబాస్టియన్ మరణానికి apply చేసిన తన మిత్రుని వాదనను బిల్లీ సమర్థవంతంగా తిప్పికొట్టాడు. చలనశీలమైన జీవితంలోని అనేక ఉదాహరణలని (ఆశ్చర్యంగా మన దేశంలో తనని ప్రేమించని అమ్మాయిల ముఖమ్మీద పోసే ఆసిడ్ తో సహా – అమెరికాలో కూడా పోస్తారేమో) పద్యంలో images గా చెప్పాడు. చివరికి సెబాస్టియన్ ని ఒక hagiographer (సేంట్ల జీవితాన్ని రికార్డ్ చేసే చరిత్రకారులు) ఎట్లా వర్ణించాడో తెలిపాడు.
    అంతా బాగానే ఉంది. కానీ అనువాదకుడు సెబాస్టియన్ స్థానంలో సీతారామరాజునెంచుకున్నాడు, సీతారామరాజు కు సెబాస్టియన్ కూ పోలిక లేదు. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మన్య ప్రజలతో (marginalized people) విప్లవం నడిపినవాడు సీతారామరాజు. పైగా చివరి వాక్యాల్లో ‘రామరాజు దైనా ఇంకోడిదైనా
    ఏ సంస్కర్తదో సాధుజీవిదో అయినా
    భక్తి తలకెక్కిన చరిత్రకారుడెవడో
    రక్త సిక్తమైన ఆ మాంసపుముద్దని
    ఎర్ర మందారఁవనో
    మోదుగపూవనో కీర్తిస్తాడు’ అంటూ అనువాదకుడు చాలా తెలివిగా రెండు పనులు చేసాడు. ఒకటి రామరాజు అమరత్వాన్ని ‘ఇంకోడిదైనా’ అంటూ సాధారణీకరించాడు. పైగా ‘భక్తి తలకెక్కిన చరిత్రకారుడు’ అంటూ సీతారామరాజు అమరత్వాన్ని కీర్తించిన చరిత్రకారులని కించపరిచాడు. నిజానికి సీతారామరాజు అమరత్వం చలనశీలమైంది. స్వాతంత్ర్య పోరాటానికి, తర్వాత ఎన్నో భావితరాలకూ (ఇప్పటికి కూడా) ఉత్తేజాన్నిస్తోంది. మరి సీతారామరాజును రక్తసిక్తమైన మాంసపుముద్దగా కాక భావితరాలకు ఉత్తేజాన్నిచ్చిన ఎర్రమందారంగానో, మోదుగుపూవుగానో కీర్తించిన చరిత్రకారులు భక్తి తలకెక్కిన వాళ్ళుగా అనువాదకునికి (ఇది మూలంలో లేదు – బిల్లీ సూచించిన hagiographer వేరు) కనబడడానికి కారణమేమిటో! జీనో చెప్పింది సీతారామరాజు అమరత్వం విషయంలో (మిగతా వాటిలో కాదు) పేరడాక్స్ నిజమని నమ్ముతున్నాడా! లేక అంతకు ముందు వాక్యాల్లో
    ‘ఈ ప్రపంచంలో తుపాకీ గుళ్ళు శరీరాన్ని
    చేరుకుని ఛిద్రం చేస్తాయి’
    అన్న స్వేచ్చానువాదకుడు (మూలంలో బిల్లీ సెబాస్టియన్ కు తగిలిన బాణాలని చెప్పాడు) తర్వాత సీతారామరాజు అమరత్వాన్ని సాధారణీకరించి, కీర్తించిన చరిత్రకారులని భక్తి తలకెక్కిన వాళ్ళుగా ప్రకటించడం ఎందుకో? ఇదే ఒక పేరడాక్స్ లాగా లేదూ?

  2. నింగి-నేల గురించి appala naidu barla అభిప్రాయం:

    12/29/2010 12:40 am

    super…sir, i like that really.

  3. 2010 ఇస్మాయిల్ అవార్డు, బ్రౌన్ పురస్కారం గురించి Ravi అభిప్రాయం:

    12/28/2010 3:53 pm

    భూషణ్ కు అభినందనలు, మిగతా కవితలు 2, 3 స్దానాలు అర్హత గల కవితలు కూడా ప్రచురిస్తె బాగుంటుంది.

    -రవి.

  4. కోనసీమ కథలు: న్యాయవాదం గురించి behara satyanandam అభిప్రాయం:

    12/28/2010 2:23 am

    మీ కథ చాలా బాగుంది సార్!

  5. శ్రీశ్రీ ఛందఃశిల్పము గురించి మోహన అభిప్రాయం:

    12/27/2010 1:32 pm

    కిరణ్ గారు, మిరియాల రామకృష్ణగారి పుస్తకము ఇక్కడ దొరుకుతుంది

    నమస్సులు – మోహన

  6. రవి గాంచిన కవి: విన్నకోట రవిశంకర్ కవితా సంకలనాల పరామర్శ గురించి naren అభిప్రాయం:

    12/26/2010 9:14 pm

    సమీక్ష్లలు నేను ఈ పుస్తకాలు తెప్పించుకుని చదివే భాగ్యాన్ని కలిగించాయి.

    నిజంగానే ఒక అధ్భుతమైన మానవత్వ ప్రయాణం చేసిన అనుభూతిని కలిగించాయి.

    అనేకానేక జారిపోయిన క్షణాలను, కోల్పోయిన సందర్భాలను తడిమిన

    అనిర్వచనీయమైన అత్మీయ పరవశం కమ్ముకుంది.

    ధన్యవాదాలు.

    నరేన్.

  7. ప్రేమ కవితలు గురించి satish అభిప్రాయం:

    12/25/2010 7:00 am

    నాకు చాలా బాగా నచ్చాయి, కృతజ్ఞతలు.

  8. రాగలహరి: సింధుభైరవి గురించి Rohiniprasad అభిప్రాయం:

    12/24/2010 7:46 am

    దక్షిణాదివాళ్ళు సింధుభైరవి అని పిలిచే రాగాన్ని ఉత్తరాదిలో భైరవీ అంటారు. వాళ్ళ శైలిలో దాన్ని రకరకాల పోకడలతో పాడతారు. కర్నాటక నఠభైరవి (స రి2 గ1 మ1 ప ధ1 ని1 స) అనే పోకడ ఉన్నదాన్ని జంగ్లా భైరవీ అంటారు. ఉదాహరణకు తలత్ పాడిన సినిమాపాట యే హవా యే రాత్ లేదా రఫీ పాడిన తుఝే క్యా సునావూ అటువంటిదే. వాడినపూలే కూడా ఆ కోవదే కాని మధ్యలో తిలంగ్ తదితర రాగాలు కూడా వినిపిస్తాయి.

    అరుదుగా, అచ్చగా కర్నాటక హనుమతోడిలా పాడినప్పుడు దాన్ని శుద్ధ భైరవీ అంటారు. ఠుమ్రీ, గజల్ లేదా భజన్ వినిపిస్తున్నప్పుడు సందర్భాన్ని బట్టి 12 స్వరాలూ పలికించడం కూడా ఉంటుంది. మామూలుగా అయితే రెండు రిషభాలూ, రెండు ధైవతాలూ వేస్తారు. చాలా జనాదరణ పొందే రాగం కనక ఎలా పాడినా దాన్ని పోల్చడం సులువే.

  9. శ్రీశ్రీ ఛందఃశిల్పము గురించి kiran అభిప్రాయం:

    12/24/2010 6:17 am

    Dear Sir,
    I need an e-copy of Sri Miriyala Ramakrishna’s comments on SRI SRI Maha Prasthanam, if available.I am a civil services aspirant. I need that as a part of my preparation.

    Thanks & Regards,
    Kiran

  10. రాగలహరి: సింధుభైరవి గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:

    12/23/2010 4:11 pm

    శ్రీ రాజగోపాల్ గారికి:

    మీ అభిప్రాయం తెలిపినందుకు సంతోషం.

    సంగీతంలో పరాకాష్ట శాస్త్రీయ సంగీతానికే అన్న విషయం మీకూ తెలుసు. అలా అని మిగిలిన సంగీతాలని చిన్న చూపు చూడటం లేదు. ఏ సంగీతానికి ఉన్న స్థానం ఆ సంగీతానికి ఉండనే ఉన్నది.

    మీరు ప్రస్తావించిన సింధుభైరవి, నఠభైరవి రాగాల్లో తేడా రిషభం స్వరంలో ఉంది. మొదటి రాగానికి స్వరం కోమలమైతే, రెండవ రాగానికి స్వరం తీవ్రమైనది. సినిమాపాటల, అందులో పాత సినిమా పాటల్లో మరీనూ, బాణీల్లో రాగాలు ఉపయోగించుకున్నా నిబద్ధత తప్పనిసరి అయిన శాస్త్రీయ సంగీతాన్ని దాటి స్వేచ్చగా సినిమా పాటల్లో అన్య స్వరాలు వాడటం సర్వ సాధారణం అన్న విషయం సంగీత ప్రియులకి విదితమే. ముఖ్యంగా కె. వి. మహదేవన్ వంటి సంగీతదర్శకులు రాగచ్చాయలని నిలపటానికి చేసే ప్రయత్నాల కన్నా పాట శ్రావ్యతపై నిమగ్నం కావటం మనం చూస్తూ ఉంటాం! అందుకనే అలాంటి సంగీత దర్శకులు “రాగం” అన్న పదం కన్న “స్కేల్ ” అన్న పదం తరచు ఉపయోగిస్తుంటారు. బహుళ ప్రజాదరణ పొందిన కె. వి. మహదేవన్ బాణి “ముద్దబతి పూవులో” అన్న పాటలో నాకు సింధుభైరవి ఛాయలు అదుకే తక్కువ కనపడతాయి. ఇక రెండవ పాట “మాంగల్య బలం” సినిమా కోసం మాష్టర్ వేణు స్వరపరచిన “వాడిన పూలే వికసించెలే” అన్న పాటపై కూడా ఇలాంటి వివరణలే ఇవ్వవచ్చు.

    రాగాల పరిచయాలకి సినిమా పాటలు ఉదాహరణలుగా ఇవ్వటానికి నా మనసు ఇష్టపడకున్నా ఉత్సాహవంతులైన పాఠక-శ్రోతలకి తేలికగా సంగీతాన్ని పరిచయం చేయటానికి ఇది ఒక సులువైన మార్గం అని భావించి రాసిన వ్యాసాలు ఇవి. అందుకే సంగీతపరంగా ఇవి కొందరికి అసహనాన్ని కలిగగించవచ్చు.

    ఒక వాయిద్యంపై ఈ సినిమా పాటలు వాయిస్తే నేను రాస్తున్న మాటలకి అర్ధాలు తెలుస్తాయి.

    ధన్యవాదాలతో,

    విష్ణుభొట్ల లక్ష్మన్న