మోహనగారు, నరసింహమూర్తిగారు, మీ అభిప్రాయానికి ధన్యవాదాలు.
మోహనగారు, చివరి శ్లోకం మూడవపాదం సంపత్కుమార “విశ్వనాథ సాహిత్య దర్శనం” పుస్తకంలో ఉన్నట్టుగానే ఇక్కడ ఇచ్చాను. అందులో ముద్రారాక్షసమైతే నాకు కనిపించలేదు. మూడవపాదంలో అయిదో అక్షరం గురువవ్వడం గురించా మీరన్నది? బహుశా అది కచ్చితంగా పాటించాల్సిన నియమం కాదనుకుంటా. కొన్ని అనుష్టుప్ పద్యాలలో గురువు కనిపిస్తోంది (ఉదా: అగజానన పద్మార్కం మూడవపాదం).
లైలా గారూ !! మా అనేక మంది భావనలకి మీ లేఖ ప్రతిబింబమయ్యిది.
చాలా సూటిగా ఉన్న విషయాన్ని చెప్పినందుకు మీకు నా అభినందనలు. నాకు ఇంకో సందేహం కూడా వచ్చింది. అథవా వీరు అంటే ఈమాట పత్రిక వారు ఆ “పండితుల గొప్పదనాలకి” పట్టం కట్టదలుచుకున్నారనే అనుకుందాం.. దాన్ని వారు బతికి ఉన్నప్పుడే చెప్తే గనక కనీసం ఆ “పండితులు” చదువుకుని సంతోషించుకుని అన్నా ఉండేవారేమో కద? మనుష్యుల్లోని ఆ గొప్పదనాలన్ని వాళ్ళు పోయేకే ఎందుకు బయటికి మాట్లాడాలని అన్పిస్తుంది చెప్మా?? వాళ్ళు బతికి ఉండగా చెప్పకూడదా ఏమి?? పండితులు పోతేనే గానీ వారిలోని “గొప్పదనాలని” గురించి మాట్లాడరన్నమాట.!! ఇదెలాంటి లక్షణమో??
పత్రికని రూపొందించడంలో.. ఈమాట వైఖరి లో స్పస్టంగా ఇవాళ కనిపిస్తూన్నవి ..చాందసం… అనాసక్తత ..యాంత్రికత.. విసుగూను. రచనల్లోనూ ఆ లోటుంది. వాటి ఎంపికలోనూ ఉంది. ఇలా స్మారక సంచికలని రూపొందించుకు పోవడంలో ఒక సులువుంది. కొత్త వారినించి రచనలని ఆశించనఖ్ఖరలేదు.. ఆ సరికే అచ్చైన రచనలతో ఒక పత్రికని నింపేయవచ్చును. మళ్ళీ 2 నెలలపాటు రచనల జంఝాటం లేదాయె!!
గుఱజాడ కూడా ఒక సంస్కర్తేనా ? అతను వైదికద్వేషి. నియోగుల fanatical అభిమాని. ఆయన రచనల నిండా అదే ధోరణి. తాను వైదీకుడని భావించిన ఆదికవి నన్నయ్య మీది ద్వేషంతో మానవిల్లి రామకృష్ణకవి అనే ఆయన చేత కుమారసంభవం అనే పద్యకావ్యాన్ని రచింపించి దాన్ని వావిళ్ళవారికి అందజేసి అది నన్నయ్యగారి మహాభారతం కంటే పూర్వగ్రంథమనీ, అందుచేత నన్నయ్యగారు ఆదికవి కాదనీ నిరూపించడానికి పూనుకున్నాడు.
మంచి కథ, చక్కని కథాశిల్పం! అన్నిటికంటె నాకు నచ్చింది కథ పేరు – వామనుడు. ఈ కథలో ఎవరు వామనుడు? రూపంలో నల్లగా పొట్టిగా ఉండే పేరప్పగారా, లేకపోతే ప్రేమాభిమానాలు లేని వారి కుటుంబ సభ్యులా? ఆలోచించాల్సిందే. – మోహన
వేమూరి గారు రాసిన అనుభవాలు లోగడ ఒక బ్లాగులో చదివాను. వారి అనుభవాలు చాలా విస్తృత పరిధిలొ ఉన్నాయి. అమెరికా వెళ్ళే తెలుగువారికి బాగా ఉపయోగపడతాయి. ఇవి చదవక మునుపు నేను అమెరికా వెళ్ళి మా పిల్లల దగ్గర ఆరుమాసాలు వుండివచ్చాను. వృత్తి రీత్యా జర్నలిస్టుని కాబట్టి నా అనుభవాలను అక్షరబద్ధం చేశాను. నా బ్లాగులొ వుంచాను కానీ పుస్తక రూపంలో తేలేదు. కొత్తగా అమెరికా వెళ్ళి కొన్ని రొజులు గడిపివచ్చే తలిదండ్రులను దృష్టిలో వుంచుకుని చేసిన రచన అది. అభిరుచి వున్న బ్లాగర్లు చూడదలిస్తే -bhandarusrinivasarao.blogspot.com (వార్త వ్యాఖ్య) ఓపెన్ చేయాల్సిందని కోరుతున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్ష్లలతో -భండారు శ్రీనివాసరావు, హైదరాబాదు. (bhandarusr@yahoo.co.in)
ఈ వ్యాసము విమర్శకు విమర్శయినా ఎంతో బాగుంది.మీలో ఉన్న కవి కంటె విమర్శకుడు మరో మూడడుగులు ఉన్నతంగా ఉన్నాడు. చాలా మంచి వ్యాసము.రామాయణ కల్పవృక్షము చదవబోయే నా వంటి వారలకు ఈ వ్యాసము దోహదకారి.
చాలా అందంగా ఉన్నాయి మీ శిశిర చిత్రాలు. ఆకుల ఆకులపాటు వ్యాకులాన్ని కూడా కలిగిస్తుంది. వెనుక ఆనందమయమైన వసంతగ్రీష్మాలు, ముందు హేమంత నిశాంతాల అనంత ఖేదాలు. శిశిరము ఒక సంధి కాలమే. మంచి కవితను అందించినదులకు అభినందనలతో – మోహన
విశ్వనాథ కోవెల గురించి Kameswara Rao అభిప్రాయం:
01/05/2011 2:26 am
మోహనగారు, నరసింహమూర్తిగారు, మీ అభిప్రాయానికి ధన్యవాదాలు.
మోహనగారు, చివరి శ్లోకం మూడవపాదం సంపత్కుమార “విశ్వనాథ సాహిత్య దర్శనం” పుస్తకంలో ఉన్నట్టుగానే ఇక్కడ ఇచ్చాను. అందులో ముద్రారాక్షసమైతే నాకు కనిపించలేదు. మూడవపాదంలో అయిదో అక్షరం గురువవ్వడం గురించా మీరన్నది? బహుశా అది కచ్చితంగా పాటించాల్సిన నియమం కాదనుకుంటా. కొన్ని అనుష్టుప్ పద్యాలలో గురువు కనిపిస్తోంది (ఉదా: అగజానన పద్మార్కం మూడవపాదం).
పాఠకులకు సూచనలు గురించి మోహన అభిప్రాయం:
01/04/2011 7:28 pm
సుధాకర్ గారు మంచి సలహానే ఇచ్చారు. ఈమాట ప్రతి సంచిక ఎందరు చూస్తారో? ఒక పాఠకుల counter పెడితే బాగుంటుందేమో? – మోహన
ఒక పండితుడి స్మరణలో…: ఈమాట జనవరి 2011 సంచికకి స్వాగతం గురించి rama bharadwaj అభిప్రాయం:
01/04/2011 2:03 pm
లైలా గారూ !! మా అనేక మంది భావనలకి మీ లేఖ ప్రతిబింబమయ్యిది.
చాలా సూటిగా ఉన్న విషయాన్ని చెప్పినందుకు మీకు నా అభినందనలు. నాకు ఇంకో సందేహం కూడా వచ్చింది. అథవా వీరు అంటే ఈమాట పత్రిక వారు ఆ “పండితుల గొప్పదనాలకి” పట్టం కట్టదలుచుకున్నారనే అనుకుందాం.. దాన్ని వారు బతికి ఉన్నప్పుడే చెప్తే గనక కనీసం ఆ “పండితులు” చదువుకుని సంతోషించుకుని అన్నా ఉండేవారేమో కద? మనుష్యుల్లోని ఆ గొప్పదనాలన్ని వాళ్ళు పోయేకే ఎందుకు బయటికి మాట్లాడాలని అన్పిస్తుంది చెప్మా?? వాళ్ళు బతికి ఉండగా చెప్పకూడదా ఏమి?? పండితులు పోతేనే గానీ వారిలోని “గొప్పదనాలని” గురించి మాట్లాడరన్నమాట.!! ఇదెలాంటి లక్షణమో??
పత్రికని రూపొందించడంలో.. ఈమాట వైఖరి లో స్పస్టంగా ఇవాళ కనిపిస్తూన్నవి ..చాందసం… అనాసక్తత ..యాంత్రికత.. విసుగూను. రచనల్లోనూ ఆ లోటుంది. వాటి ఎంపికలోనూ ఉంది. ఇలా స్మారక సంచికలని రూపొందించుకు పోవడంలో ఒక సులువుంది. కొత్త వారినించి రచనలని ఆశించనఖ్ఖరలేదు.. ఆ సరికే అచ్చైన రచనలతో ఒక పత్రికని నింపేయవచ్చును. మళ్ళీ 2 నెలలపాటు రచనల జంఝాటం లేదాయె!!
రమ.
కోవెల సంపత్కుమార, కన్యాశుల్కం – మరో కోణం: విమర్శలు – పరామర్శ గురించి తెలుగు బాటసారి అభిప్రాయం:
01/04/2011 1:17 pm
గుఱజాడ కూడా ఒక సంస్కర్తేనా ? అతను వైదికద్వేషి. నియోగుల fanatical అభిమాని. ఆయన రచనల నిండా అదే ధోరణి. తాను వైదీకుడని భావించిన ఆదికవి నన్నయ్య మీది ద్వేషంతో మానవిల్లి రామకృష్ణకవి అనే ఆయన చేత కుమారసంభవం అనే పద్యకావ్యాన్ని రచింపించి దాన్ని వావిళ్ళవారికి అందజేసి అది నన్నయ్యగారి మహాభారతం కంటే పూర్వగ్రంథమనీ, అందుచేత నన్నయ్యగారు ఆదికవి కాదనీ నిరూపించడానికి పూనుకున్నాడు.
ఇది ఆ మేధావికి ఉన్న సంకుచిత చీకటి కోణం.
కోనసీమ కథలు: వామనుడు గురించి మోహన అభిప్రాయం:
01/03/2011 4:13 pm
మంచి కథ, చక్కని కథాశిల్పం! అన్నిటికంటె నాకు నచ్చింది కథ పేరు – వామనుడు. ఈ కథలో ఎవరు వామనుడు? రూపంలో నల్లగా పొట్టిగా ఉండే పేరప్పగారా, లేకపోతే ప్రేమాభిమానాలు లేని వారి కుటుంబ సభ్యులా? ఆలోచించాల్సిందే. – మోహన
ఒక పండితుడి స్మరణలో…: ఈమాట జనవరి 2011 సంచికకి స్వాగతం గురించి sivalenka అభిప్రాయం:
01/03/2011 1:08 pm
tried typing in telugu but somehow the letters are not coming out correctly.
What laila gaaru said is absolutely true.. nothing more to add
శిశిర చిత్రాలు గురించి Anand అభిప్రాయం:
01/03/2011 7:15 am
చాలా బాగుది మీ కవిత.
పుస్తక పరిచయం: వేమూరి వెంకటేశ్వర రావు ‘అమెరికా అనుభవాలు’ గురించి భండారు శ్రీనివాసరావు అభిప్రాయం:
01/03/2011 6:02 am
వేమూరి గారు రాసిన అనుభవాలు లోగడ ఒక బ్లాగులో చదివాను. వారి అనుభవాలు చాలా విస్తృత పరిధిలొ ఉన్నాయి. అమెరికా వెళ్ళే తెలుగువారికి బాగా ఉపయోగపడతాయి. ఇవి చదవక మునుపు నేను అమెరికా వెళ్ళి మా పిల్లల దగ్గర ఆరుమాసాలు వుండివచ్చాను. వృత్తి రీత్యా జర్నలిస్టుని కాబట్టి నా అనుభవాలను అక్షరబద్ధం చేశాను. నా బ్లాగులొ వుంచాను కానీ పుస్తక రూపంలో తేలేదు. కొత్తగా అమెరికా వెళ్ళి కొన్ని రొజులు గడిపివచ్చే తలిదండ్రులను దృష్టిలో వుంచుకుని చేసిన రచన అది. అభిరుచి వున్న బ్లాగర్లు చూడదలిస్తే -bhandarusrinivasarao.blogspot.com (వార్త వ్యాఖ్య) ఓపెన్ చేయాల్సిందని కోరుతున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్ష్లలతో -భండారు శ్రీనివాసరావు, హైదరాబాదు. (bhandarusr@yahoo.co.in)
విశ్వనాథ కోవెల గురించి గన్నవరపు నరసింహ మూర్తి అభిప్రాయం:
01/02/2011 9:24 pm
ఈ వ్యాసము విమర్శకు విమర్శయినా ఎంతో బాగుంది.మీలో ఉన్న కవి కంటె విమర్శకుడు మరో మూడడుగులు ఉన్నతంగా ఉన్నాడు. చాలా మంచి వ్యాసము.రామాయణ కల్పవృక్షము చదవబోయే నా వంటి వారలకు ఈ వ్యాసము దోహదకారి.
శిశిర చిత్రాలు గురించి మోహన అభిప్రాయం:
01/02/2011 4:43 pm