మెగాస్టార్ చిరంజీవి “రవీంద్రనాథ్ టాగూరు” పేరి పాత్రలో న్యాయాలయములో విశ్వకవికి ఆరోపించి చెప్పిన మాటలు (ఠాగూరు చిత్రంలో – రచన పరుచూరి సోదరులు) –
“ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో
ఎక్కడ మానవుడు సగర్వంగా తలెత్తుకొని తిరుగగలడో
ఎక్కడ ప్రపంచం ముక్కలు ముక్కై పోయి మగ్గిపోదో
ఎక్కడ మా చదువు విజ్ఞానం మూఢ నమ్మకాలలో ఇంకిపోదో
ఎక్కడ ఒక మనిషి తోటి మనిషిని దోచుకోడో
అక్కడ ఆ స్వేచ్ఛా స్వర్గంలోకి భగవంతుడా
నా ఈ దేశాన్ని మేలుకొలుపు”
జ్యోతిష్యం గురించి ఆసక్తి లేనందువల్ల నేను ఇంతకాలమూ ఈ వ్యాసాలు చదవలేదు. రచయిత శైలీ, అభిప్రాయాలూ బాగానే ఉన్నాయి. పైగా ఇది ఎక్కువమంది ముట్టుకోని విషయం.
ఈ జాతకాలనేవి మనుషులకి మాత్రమే వర్తిస్తాయని ఎవరైనా అంటే నాకు ఉన్న లేశమాత్రమైన ఆసక్తి కూడా తగ్గిపోతుంది. భూమిమీది, లేదా విశ్వంలోని జీవరాశిలో మనుషులు కేవలం ఒక భాగం మాత్రమేనని రుజువయింది కనక ఇతర జీవాలకు వర్తించని సిద్ధాంతాలు చప్పరించేసేవిగానే అనిపిస్తాయి.
పుట్టిన వేళ అనేది అన్ని ప్రాణులమీదా తన ప్రభావం చూపుతుంది అనే మాట కూడా అసంబద్ధమే. ఎందుకంటే ప్రతి రోజూ, ప్రతి క్షణమూ వేలకొద్దీ గొడ్లూ, కోళ్ళవంటి పక్షులూ మాంసాహారుల నిమిత్తమై బలిఅవుతూనే ఉంటాయి. మరి అవన్నీ దురదృష్ట జాతకులేనా? అదే క్షణంలో, అదే ప్రాంతంలో అంతే అయస్కాంతక్షేత్రానికీ, మెలనిన్ తదితర ప్రభావాలకీ గురి అయిన ఇతర ప్రాణులు బలి అవటం లేదేం?
ఒక్క కాంతిని మినహాయిస్తే పుట్టిన వేళలోని విశేషం ఏముంటుంది? అండం ఫలదీకరణం చెందిన క్షణం ముఖ్యమైనదా? గుడ్లుపెటే ప్రాణుల మాటేమిటి? మధ్యస్థంగా అనిపించే ప్లాటిపస్ ఎలాంటి జాతకం కలిగి ఉంటుంది? జ్యోతిష్యానికి భౌతికశాస్త్ర పద్ధతిలో రుజువులు వెతకబోతే అన్నీ సమస్యలే కనిపిస్తాయి.
సామాజిక, ఆర్థికశక్తుల కారణంగా అయోమయానికి లోనయే మనుషుల జీవితాలను బలంగా ప్రభావితం చేస్తున్న దుష్టులు ఇందరు కనిపిస్తూ ఉంటే ఎక్కడో ఉన్న గ్రహాలనీ, నక్షత్రాలనీ తప్పుపట్టడంలో అర్థం ఉందా?
ఒకవేళ నేను పుట్టిన వేళ, స్థలం నా స్వభావాలను నిర్ణయిస్తాయని అనుకున్నా నేనెక్కే బస్సు ప్రమాదానికి గురి అయి నేను ఫలానారోజున చచ్చిపోతాననేది అందువల్ల ఎలా నిర్ణయమౌతుంది? నేను మాటిమాటికీ చావును ప్రస్తావించడం ఎందుకంటే మేక అయినా, మనిషి అయినా చావుకు లోనవడం బతుకులో అన్నిటికన్నా పెద్ద దుర్ఘటన కాబట్టి. దాన్ని ఊహించి చెప్పలేని జ్యోతిష్యం నాలుక గీసుకోవడానికి కూడా పనికిరాదు.
వాడపల్లి శేషతల్పశాయి గారు 45 యేళ్ళనాటి వ్యాసాన్ని పరిచయం చేసినందుకూ, ఆంధ్రభారతి వారు ఆవ్యాసాన్ని అందించినందుకూ వారికి చాలా కృతజ్ఞతలు!
అప్పటికీ ఇప్పటికీ యీకవిత మీద ఆసక్తి ఏమాత్రం తగ్గకపోవడం రవీంద్రుని ప్రతిభకు తార్కాణమైతే, ఆవ్యాసంలోనూ, నావ్యాసంలోనూ అదే కవులు ఎక్కువమంది కనిపించకపోవడం మరొక విధంగా రవీంద్రుని ప్రతిభకు అంజలి పట్టడమేననుకోవచ్చు. భారతి వ్యాసాన్నిబట్టి ఆదిపూడి సోమనాథరావు గారి అనువాదం ఇప్పటికి దాదాపు 85 యేళ్ళ క్రిందటి నాటిదన్నమాట. మరి అది ఆవ్యాసరచయిత శ్రీవాత్సవగారికి ఎందుకు నచ్చలేదనంది నాకు కొంచెం ఆశ్చర్యకరమే.
ఆట చాలించి కామెంటరీ/విశ్లేషణకి దిగడం ఆటగాళ్ళకి శారీరకపరిమితులదృష్ట్యా అవసరం. సృజనకారులకెందుకీ గోల? కనకప్రసాద్ గారు, ఈ telling మానేసి showingలోకి వచ్చేద్దురూ.
విభు గారితో ఏకీభవిస్తానండీ.
వ్యాసాలు చాలా శక్తివంతంగా, ఆలోచింపజేసేవిగా ఉన్నాయి కానీ వీటిల్లో పడి కమ్మకమ్మగా, కారం కారంగా మిరపకాయ బజ్జీల్లా ఉండే మీ కధలు,ఎండాకాలంలో చల్లని గోళీ సోడాల్లా జిల్లుమనిపించే మీ కవితలు రాయడం మానేయకండే…
ఇలాటి ప్రత్యేక సంచికలు ఉండాలా ఉండకూడదా అనే దానిపైన కాదు ఈ అభిప్రాయం. పాత సంచికలు తిరగవేసి అందులో ఇలాటివి ఎన్ని ఉన్నాయో అనే విషయాన్ని తెల్పడమే దీని ఉద్దేశం. జనవరి 2007 నుండి విడుదలయిన ఈమాట సంచికలను ఇందుకై ఎన్నుకొన్నాను. జనవరి 2008లో భద్రిరాజు కృష్ణమూర్తిగారి 80వ జన్మదినోత్సవము సందర్భముగా దీనిని ప్రచురించారు. చనిపోయినవారిపయిన మాత్రమే కాదు బతికిఉన్న వాళ్లపయిన కూడ సంచికలను ప్రచురిస్తారు అన్నదానికి ఇది నిదర్శనము. తరువాత నవంబరు 2008లో స్మైలుపైన ఒక సంచిక వచ్చింది. నవంబరు 2009 నుండి ప్రత్యేక సంచికలు కొన్ని ఎక్కువే. అయితే దానికి ఒక కారణము ఉంది. నవంబరు 2009 సంచిక కొ.కు.ను, జనవరి 2010 సంచిక శ్రీశ్రీని వారి శతజయంతి సందర్భముగా సంస్మరిస్తూ ప్రచురించినవి. జూలై 2010 సంచిక శ్రీకృష్ణదేవరాయల సింహాసనారోహణమయి 500 సంవత్సరాలు కాలం గడచిన సందర్భముగా వెలువడింది. కృష్ణరాయలను కన్నడిగులకన్న తెలుగువారు “మనవాడు” అనుకొంటారు, అందులకు ఇది నిదర్శనము. ఈ నెల సంచిక దివంగతులు సంపత్కుమారులను సంస్మరిస్తూ వెలువడింది. సామాన్యముగా ఇటువంటి పండితులను పండితులు, పరిశోధకులు తప్ప మిగిలిన వారెవ్వరూ పట్టించుకోరు. అట్టివారు కూడ తెలుగు భాషకు గొప్ప సేవ చేస్తూ ఉన్నారని ఈ సంచికను చూస్తే మనకు విదితమవుతుంది. అదీ కాక ఇందులోని వచన కవిత పద్యమా కాదా అన్నది ఇప్పుడు కూడ ఒక పెద్ద ప్రశ్నే. పై సంచికలకు భిన్నముగా ఊహించని కారణముగా వెలువడిన ఒకే ఒక సంచిక సెప్టెంబరు 2010 సంచిక. ఇది మహాకవి తిలకును గురించినది. ఈ నా అభిప్రాయాన్ని ఎవ్వరూ వ్రాయమని అడుగలేదు. నేనే వెదకి వ్రాసినది. మరో విషయం – ఈమాటలోని అన్ని విషయాలు అందరికీ నచ్చక పోవచ్చు, కాని ఇందులోని ఒక్కొక్కటి కొందరి కయినా తప్పక నచ్చుతుంది అనుకొంటాను. ముఖ్యముగా తెలుగుజాతి మరచిపోయిన, మరచిపోతున్న కొన్ని సాహిత్య, సంగీత, లలితకళల విలువలను వీరు ప్రోత్సాహం చేయడము ఎంతో ముదావహము. ఇది ముత్యాలసరము అంగడిలో కొనుక్కోవచ్చు అనుకొనే కాలం వాళ్లకు ఎంతో ఉపకరిస్తుంది.
కన్యాశుల్కం ఆనాటికి ఒక ఆధునిక నాటకం. అప్పారావు గారు నాటకం రాసి వ్యావహార భాషకీ..కన్యాశుల్కపు సమస్యకీ తన దృక్పధం నించి ఒక వేదికని ఇచ్చారు. అంతే !! ఆ పరిధిలోనే కన్యాశుల్కం నాటకం గమనించవలసి ఉంది. రచయిత చెప్పని విషయాలని రచయితకి ఆపాదించడం చేసినప్పుడు అందుకు జవాబులు ఆ రచన నించి దొరకడమ్ కస్టమ్ ఎప్పుడైనా !! ప్రాచీన సంప్రదాయ పధ్ధతిలో కన్యాశుల్కం నాటకాన్ని చూసి కోవెల సంపత్కుమార దాన్ని రసచర్చ లోకి నడిపించడలో సబబూ లేదు. అర్ధమూ లేదు. ఆస్కార్ వైల్డ్ తరహా లాంటి వారి రచనల్లో మనకి కనిపించే సంభాషణల వాడి “పంచ్ ” లాంటిది మనకి కన్యాశుల్కం లో కన్పిస్తుంది. ఆనాటికి అప్పారావు గారి మీద అప్పటి పాశ్చ్యాత రచయితల ప్రేరణలని ఆ నాటకం మనకి తెలియజేస్తుంది.
ఒక రచయితకి తన రచన పరిధినీ దాని ప్రయోజనాన్నీ విస్తరించుకునే వెసులుబాటు ఎప్పుడూ ఉంటుంది. కన్యాశుల్కం మొదటి ప్రతికీ మలిప్రతికీ మధ్య ఉన్న భేదం రచయితగా అప్పారావుగారి ఆశయాల లో వచ్చిన మార్పు కూడా కావొచ్చు. మధురవాణి పాత్ర పెరగడం ..గిరీశం వేపునుంచి ఫోకస్ మధురవాణి వేపు మారితే గనక అలా జరగడానికి ఆయన తనవైన కారణాలకి అవకాశం కల్పిచుకోడం అసాధ్యం కానఖ్ఖరలేదు. గిరీశం ఒక “మంచి” పాత్ర ఏ కోశానా కాదు. ఆ నాటకం బట్టి ఆ పాత్ర మీద రచయితగా అప్పారావు గారికి ఏమంత సానుభూతి కూడా ఉన్నట్టు కనబడదు. అసలు కన్యాశుల్కం నాటకం లో ఏ మగ పాత్ర మీదా అప్పారావుగారికి సానుభూతి ఉన్నట్టు అన్పించదు.
గిరీశం చేత ఆయన అనేక భావాలు మాట్లాడించారు. అందులో కప్పదాట్లూ ఉంటాయి. సదాశయాలూ ఉంటాయి. గిరీశానికి ప్రధానంగా తాను మాత్రమే ప్రధానం. ఇంకెవ్వరూ కాదు. అతగాడు ఏ పని చేసినా ఏ ఆలోచన చేసినా తనే కేంద్రంగా చేసిన వాడు. తన బాగు కోసమే చేసిన వాడు. అలాంటి పాత్ర “మచి వాడు ” అవగలగటమ్ అసాధ్యం జీవితంలో!! అందుకనే అప్పారావుగారు బుచ్చమ్మ పెళ్ళిని గిరీశం తో జరగనివ్వలేదు.
ఇంక అప్పారావుగారికి వైదీకి నియ్యోగి భేదాలు మెండుగా ఉన్నాయని ఆరోపించడం లో అర్ధం లేదు. అందుకు ఆ నాటకం నించీ ఏ ఆధారమూ లేదు. రామప్పంతుల్ని రెండవ ప్రతిలో ఆయన నియ్యోగిని ఎందుకు చెయ్యాలీ?? ఆయనకి అసలు సౌజన్యారావు మీదనే అంత సదభిప్రాయం ఉన్నట్టు కనపడదు. సౌజన్యారావు పంతులూ నియ్యోగే!! ఇకపోతే కొండుభోట్లు సిధ్ధాంతీ లాంటి పాత్రలు మాత్రమే వైదీకి పాత్రలు. వాటిని ఆయన వెకిలి పాత్రలుగా చూపించలేదు. వీళ్ళు కాక మిగిలిన పాత్రలు అంటే అగ్నిహోత్రావధాన్లూ..లుభ్దావధాన్లూ..కరటక శాస్త్రీ..గిరీశం వీరంతా “ద్రావిడ బ్రాహ్మణులు” అప్పారావు గారు విజయనగరం ఇలాకాలోని ద్రావిడ బ్రాహ్మణులనే తన నాటకంలో చాదస్తులుగా చూపించేరు. వారి ఇంటి పేర్లతో సహా రాసేరాయన. “నేమాని” గిరీశం. అలాగే బుచ్చమ్మ గిరీశంతో అంటుంది ఇలా !! ” మీరొప్పుకుంటే మా రాంభొట్ల అచ్చమ్మ మిమ్మల్ని పెళ్ళాడుతానంది” అని. ఇదులోని నేమాని ..రాంభొట్ల ఇంటీ పేర్లు ద్రావిడుల ఇంటి పేర్లు గానీ వైదీకుల ఇంటి పేర్లు కావు. నందాపురపు పట్టీ [ పట్టీ అంటే 18 అగ్రహారాలు] అంతా ద్రావిడ బ్రాహ్మణ్యమే !! వైదీకులు నియ్యోగులూ తగుమాత్రంగా ఉన్న ప్రాంతాలు అవి. ఈ సంగతి ఆ ప్రాంతాలని ఎరిగిన వారికి తెలుసు.
అందువలన గురజాడ అప్పారావు గారికి వైదీకి ద్వేషాన్నీ..నియ్యోగపుటభిమానాన్నీ ఇవాళ కొత్తగా అంటగట్టటం లో నిజమూ లేదు. ఔచిత్యమూ లేదు.
గురజాడవారి కాలములోని జాతి, వర్గ రాజకీయాలు నాకు ఎక్కువ తెలియవు కానీ నన్నయ కాలములో ఈ కాలములోవలె వైదికులు, నియోగులు ఉన్నారా అనే సందేహము నాకు కలుగుతుంది. బాటసారిగారూ, మీరు నన్నెచోడుని కుమారసంభవము కుహనా కవిత్వమని, మానవల్లి రామకృష్ణకవి వ్రాసి నన్నెచోడునికి ఆపాదించారు అనే వాదాన్ని ఏ ఒకరో ఇద్దరో తప్ప తెలుగు కవులు, పండితులు, పరిశోధకులు అందరూ నిరాకరించారు. వారి వాదన అంతా నన్నెచోడుని కాలము గురించే. ఇంతకూ నన్నెచోడుడు వైదికుడు కాడు, నియోగి అసలే కాడు, ఒక క్షత్రియుడు. వివరాలకు నేను వ్రాసిన కవిరాజశిఖామణి, క్రౌంచపదము వ్యాసాలను చదువుతారని ఆశిస్తాను.
కామేశ్వర రావుగారూ, ఐదవ అక్షరము లఘువు మాత్రమే కాదు, ఆరవ ఏడవ అక్షరాలు గురువుగా కూడ ఉండాలి. మీరు చెప్పిన ఉదాహరణలో అనేకదంతం లోని తం గురువే ఐనా, భక్తానం లోని మొదటి రెండు అక్షరాలు గురువే కనుక శ్లోకాన్ని పాడేటప్పుడు గురువును లఘువుగా పాడుకోవచ్చు. కాని ఇక్కడ సా జయతి లోని జయ అక్షరాలు రెండూ లఘువులే. అందువల్ల ఇది పద్యము కాదని నేను చెప్పలేదు. సామాన్యముగా మనము అర్థము చేసికొనే శ్లోకములా లేదు ఇది అని మాత్రమే అన్నాను. విధేయుడు – మోహన
మంచుమనిషి గురించి Venu Dasigi (VEDA) అభిప్రాయం:
01/09/2011 10:32 pm
మంచు ముత్యము లెంచి చేర్చిట
మంచి ముత్యపు మాల పేర్చి వి
రించి సృష్టిని మించి కూర్చిరి
కాంచ విందేనోయ్ !
రవీంద్రధనుస్సు గురించి మోహన అభిప్రాయం:
01/09/2011 9:02 pm
మెగాస్టార్ చిరంజీవి “రవీంద్రనాథ్ టాగూరు” పేరి పాత్రలో న్యాయాలయములో విశ్వకవికి ఆరోపించి చెప్పిన మాటలు (ఠాగూరు చిత్రంలో – రచన పరుచూరి సోదరులు) –
“ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో
ఎక్కడ మానవుడు సగర్వంగా తలెత్తుకొని తిరుగగలడో
ఎక్కడ ప్రపంచం ముక్కలు ముక్కై పోయి మగ్గిపోదో
ఎక్కడ మా చదువు విజ్ఞానం మూఢ నమ్మకాలలో ఇంకిపోదో
ఎక్కడ ఒక మనిషి తోటి మనిషిని దోచుకోడో
అక్కడ ఆ స్వేచ్ఛా స్వర్గంలోకి భగవంతుడా
నా ఈ దేశాన్ని మేలుకొలుపు”
– మోహన
జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 4 గురించి K.Rohiniprasad అభిప్రాయం:
01/08/2011 3:55 am
జ్యోతిష్యం గురించి ఆసక్తి లేనందువల్ల నేను ఇంతకాలమూ ఈ వ్యాసాలు చదవలేదు. రచయిత శైలీ, అభిప్రాయాలూ బాగానే ఉన్నాయి. పైగా ఇది ఎక్కువమంది ముట్టుకోని విషయం.
ఈ జాతకాలనేవి మనుషులకి మాత్రమే వర్తిస్తాయని ఎవరైనా అంటే నాకు ఉన్న లేశమాత్రమైన ఆసక్తి కూడా తగ్గిపోతుంది. భూమిమీది, లేదా విశ్వంలోని జీవరాశిలో మనుషులు కేవలం ఒక భాగం మాత్రమేనని రుజువయింది కనక ఇతర జీవాలకు వర్తించని సిద్ధాంతాలు చప్పరించేసేవిగానే అనిపిస్తాయి.
పుట్టిన వేళ అనేది అన్ని ప్రాణులమీదా తన ప్రభావం చూపుతుంది అనే మాట కూడా అసంబద్ధమే. ఎందుకంటే ప్రతి రోజూ, ప్రతి క్షణమూ వేలకొద్దీ గొడ్లూ, కోళ్ళవంటి పక్షులూ మాంసాహారుల నిమిత్తమై బలిఅవుతూనే ఉంటాయి. మరి అవన్నీ దురదృష్ట జాతకులేనా? అదే క్షణంలో, అదే ప్రాంతంలో అంతే అయస్కాంతక్షేత్రానికీ, మెలనిన్ తదితర ప్రభావాలకీ గురి అయిన ఇతర ప్రాణులు బలి అవటం లేదేం?
ఒక్క కాంతిని మినహాయిస్తే పుట్టిన వేళలోని విశేషం ఏముంటుంది? అండం ఫలదీకరణం చెందిన క్షణం ముఖ్యమైనదా? గుడ్లుపెటే ప్రాణుల మాటేమిటి? మధ్యస్థంగా అనిపించే ప్లాటిపస్ ఎలాంటి జాతకం కలిగి ఉంటుంది? జ్యోతిష్యానికి భౌతికశాస్త్ర పద్ధతిలో రుజువులు వెతకబోతే అన్నీ సమస్యలే కనిపిస్తాయి.
సామాజిక, ఆర్థికశక్తుల కారణంగా అయోమయానికి లోనయే మనుషుల జీవితాలను బలంగా ప్రభావితం చేస్తున్న దుష్టులు ఇందరు కనిపిస్తూ ఉంటే ఎక్కడో ఉన్న గ్రహాలనీ, నక్షత్రాలనీ తప్పుపట్టడంలో అర్థం ఉందా?
ఒకవేళ నేను పుట్టిన వేళ, స్థలం నా స్వభావాలను నిర్ణయిస్తాయని అనుకున్నా నేనెక్కే బస్సు ప్రమాదానికి గురి అయి నేను ఫలానారోజున చచ్చిపోతాననేది అందువల్ల ఎలా నిర్ణయమౌతుంది? నేను మాటిమాటికీ చావును ప్రస్తావించడం ఎందుకంటే మేక అయినా, మనిషి అయినా చావుకు లోనవడం బతుకులో అన్నిటికన్నా పెద్ద దుర్ఘటన కాబట్టి. దాన్ని ఊహించి చెప్పలేని జ్యోతిష్యం నాలుక గీసుకోవడానికి కూడా పనికిరాదు.
రవీంద్రధనుస్సు గురించి Venu Dasigi (VEDA) అభిప్రాయం:
01/08/2011 1:24 am
వాడపల్లి శేషతల్పశాయి గారు 45 యేళ్ళనాటి వ్యాసాన్ని పరిచయం చేసినందుకూ, ఆంధ్రభారతి వారు ఆవ్యాసాన్ని అందించినందుకూ వారికి చాలా కృతజ్ఞతలు!
అప్పటికీ ఇప్పటికీ యీకవిత మీద ఆసక్తి ఏమాత్రం తగ్గకపోవడం రవీంద్రుని ప్రతిభకు తార్కాణమైతే, ఆవ్యాసంలోనూ, నావ్యాసంలోనూ అదే కవులు ఎక్కువమంది కనిపించకపోవడం మరొక విధంగా రవీంద్రుని ప్రతిభకు అంజలి పట్టడమేననుకోవచ్చు. భారతి వ్యాసాన్నిబట్టి ఆదిపూడి సోమనాథరావు గారి అనువాదం ఇప్పటికి దాదాపు 85 యేళ్ళ క్రిందటి నాటిదన్నమాట. మరి అది ఆవ్యాసరచయిత శ్రీవాత్సవగారికి ఎందుకు నచ్చలేదనంది నాకు కొంచెం ఆశ్చర్యకరమే.
— వేణు దశిగి (వేద)
మూడు లాంతర్లు గురించి indrani Palaparthy అభిప్రాయం:
01/07/2011 3:21 am
కనక ప్రసాదు గారు:
ఆట చాలించి కామెంటరీ/విశ్లేషణకి దిగడం ఆటగాళ్ళకి శారీరకపరిమితులదృష్ట్యా అవసరం. సృజనకారులకెందుకీ గోల? కనకప్రసాద్ గారు, ఈ telling మానేసి showingలోకి వచ్చేద్దురూ.
విభు గారితో ఏకీభవిస్తానండీ.
వ్యాసాలు చాలా శక్తివంతంగా, ఆలోచింపజేసేవిగా ఉన్నాయి కానీ వీటిల్లో పడి కమ్మకమ్మగా, కారం కారంగా మిరపకాయ బజ్జీల్లా ఉండే మీ కధలు,ఎండాకాలంలో చల్లని గోళీ సోడాల్లా జిల్లుమనిపించే మీ కవితలు రాయడం మానేయకండే…
పాలపర్తి ఇంద్రాణి.
కృష్ణా తటచారిన్ గురించి indrani Palaparthy అభిప్రాయం:
01/07/2011 3:07 am
కనక ప్రసాదు గారు:
పాట వీనులవిందుగా ఉన్నదండి.ఇప్పటికి పది సార్లు విన్నాను.
పాలపర్తి ఇంద్రాణి.
ఒక పండితుడి స్మరణలో…: ఈమాట జనవరి 2011 సంచికకి స్వాగతం గురించి మోహన అభిప్రాయం:
01/05/2011 1:35 pm
ఇలాటి ప్రత్యేక సంచికలు ఉండాలా ఉండకూడదా అనే దానిపైన కాదు ఈ అభిప్రాయం. పాత సంచికలు తిరగవేసి అందులో ఇలాటివి ఎన్ని ఉన్నాయో అనే విషయాన్ని తెల్పడమే దీని ఉద్దేశం. జనవరి 2007 నుండి విడుదలయిన ఈమాట సంచికలను ఇందుకై ఎన్నుకొన్నాను. జనవరి 2008లో భద్రిరాజు కృష్ణమూర్తిగారి 80వ జన్మదినోత్సవము సందర్భముగా దీనిని ప్రచురించారు. చనిపోయినవారిపయిన మాత్రమే కాదు బతికిఉన్న వాళ్లపయిన కూడ సంచికలను ప్రచురిస్తారు అన్నదానికి ఇది నిదర్శనము. తరువాత నవంబరు 2008లో స్మైలుపైన ఒక సంచిక వచ్చింది. నవంబరు 2009 నుండి ప్రత్యేక సంచికలు కొన్ని ఎక్కువే. అయితే దానికి ఒక కారణము ఉంది. నవంబరు 2009 సంచిక కొ.కు.ను, జనవరి 2010 సంచిక శ్రీశ్రీని వారి శతజయంతి సందర్భముగా సంస్మరిస్తూ ప్రచురించినవి. జూలై 2010 సంచిక శ్రీకృష్ణదేవరాయల సింహాసనారోహణమయి 500 సంవత్సరాలు కాలం గడచిన సందర్భముగా వెలువడింది. కృష్ణరాయలను కన్నడిగులకన్న తెలుగువారు “మనవాడు” అనుకొంటారు, అందులకు ఇది నిదర్శనము. ఈ నెల సంచిక దివంగతులు సంపత్కుమారులను సంస్మరిస్తూ వెలువడింది. సామాన్యముగా ఇటువంటి పండితులను పండితులు, పరిశోధకులు తప్ప మిగిలిన వారెవ్వరూ పట్టించుకోరు. అట్టివారు కూడ తెలుగు భాషకు గొప్ప సేవ చేస్తూ ఉన్నారని ఈ సంచికను చూస్తే మనకు విదితమవుతుంది. అదీ కాక ఇందులోని వచన కవిత పద్యమా కాదా అన్నది ఇప్పుడు కూడ ఒక పెద్ద ప్రశ్నే. పై సంచికలకు భిన్నముగా ఊహించని కారణముగా వెలువడిన ఒకే ఒక సంచిక సెప్టెంబరు 2010 సంచిక. ఇది మహాకవి తిలకును గురించినది. ఈ నా అభిప్రాయాన్ని ఎవ్వరూ వ్రాయమని అడుగలేదు. నేనే వెదకి వ్రాసినది. మరో విషయం – ఈమాటలోని అన్ని విషయాలు అందరికీ నచ్చక పోవచ్చు, కాని ఇందులోని ఒక్కొక్కటి కొందరి కయినా తప్పక నచ్చుతుంది అనుకొంటాను. ముఖ్యముగా తెలుగుజాతి మరచిపోయిన, మరచిపోతున్న కొన్ని సాహిత్య, సంగీత, లలితకళల విలువలను వీరు ప్రోత్సాహం చేయడము ఎంతో ముదావహము. ఇది ముత్యాలసరము అంగడిలో కొనుక్కోవచ్చు అనుకొనే కాలం వాళ్లకు ఎంతో ఉపకరిస్తుంది.
విధేయుడు – మోహన
కోవెల సంపత్కుమార, కన్యాశుల్కం – మరో కోణం: విమర్శలు – పరామర్శ గురించి rama bharadwaj అభిప్రాయం:
01/05/2011 1:18 pm
కన్యాశుల్కం ఆనాటికి ఒక ఆధునిక నాటకం. అప్పారావు గారు నాటకం రాసి వ్యావహార భాషకీ..కన్యాశుల్కపు సమస్యకీ తన దృక్పధం నించి ఒక వేదికని ఇచ్చారు. అంతే !! ఆ పరిధిలోనే కన్యాశుల్కం నాటకం గమనించవలసి ఉంది. రచయిత చెప్పని విషయాలని రచయితకి ఆపాదించడం చేసినప్పుడు అందుకు జవాబులు ఆ రచన నించి దొరకడమ్ కస్టమ్ ఎప్పుడైనా !! ప్రాచీన సంప్రదాయ పధ్ధతిలో కన్యాశుల్కం నాటకాన్ని చూసి కోవెల సంపత్కుమార దాన్ని రసచర్చ లోకి నడిపించడలో సబబూ లేదు. అర్ధమూ లేదు. ఆస్కార్ వైల్డ్ తరహా లాంటి వారి రచనల్లో మనకి కనిపించే సంభాషణల వాడి “పంచ్ ” లాంటిది మనకి కన్యాశుల్కం లో కన్పిస్తుంది. ఆనాటికి అప్పారావు గారి మీద అప్పటి పాశ్చ్యాత రచయితల ప్రేరణలని ఆ నాటకం మనకి తెలియజేస్తుంది.
ఒక రచయితకి తన రచన పరిధినీ దాని ప్రయోజనాన్నీ విస్తరించుకునే వెసులుబాటు ఎప్పుడూ ఉంటుంది. కన్యాశుల్కం మొదటి ప్రతికీ మలిప్రతికీ మధ్య ఉన్న భేదం రచయితగా అప్పారావుగారి ఆశయాల లో వచ్చిన మార్పు కూడా కావొచ్చు. మధురవాణి పాత్ర పెరగడం ..గిరీశం వేపునుంచి ఫోకస్ మధురవాణి వేపు మారితే గనక అలా జరగడానికి ఆయన తనవైన కారణాలకి అవకాశం కల్పిచుకోడం అసాధ్యం కానఖ్ఖరలేదు. గిరీశం ఒక “మంచి” పాత్ర ఏ కోశానా కాదు. ఆ నాటకం బట్టి ఆ పాత్ర మీద రచయితగా అప్పారావు గారికి ఏమంత సానుభూతి కూడా ఉన్నట్టు కనబడదు. అసలు కన్యాశుల్కం నాటకం లో ఏ మగ పాత్ర మీదా అప్పారావుగారికి సానుభూతి ఉన్నట్టు అన్పించదు.
గిరీశం చేత ఆయన అనేక భావాలు మాట్లాడించారు. అందులో కప్పదాట్లూ ఉంటాయి. సదాశయాలూ ఉంటాయి. గిరీశానికి ప్రధానంగా తాను మాత్రమే ప్రధానం. ఇంకెవ్వరూ కాదు. అతగాడు ఏ పని చేసినా ఏ ఆలోచన చేసినా తనే కేంద్రంగా చేసిన వాడు. తన బాగు కోసమే చేసిన వాడు. అలాంటి పాత్ర “మచి వాడు ” అవగలగటమ్ అసాధ్యం జీవితంలో!! అందుకనే అప్పారావుగారు బుచ్చమ్మ పెళ్ళిని గిరీశం తో జరగనివ్వలేదు.
ఇంక అప్పారావుగారికి వైదీకి నియ్యోగి భేదాలు మెండుగా ఉన్నాయని ఆరోపించడం లో అర్ధం లేదు. అందుకు ఆ నాటకం నించీ ఏ ఆధారమూ లేదు. రామప్పంతుల్ని రెండవ ప్రతిలో ఆయన నియ్యోగిని ఎందుకు చెయ్యాలీ?? ఆయనకి అసలు సౌజన్యారావు మీదనే అంత సదభిప్రాయం ఉన్నట్టు కనపడదు. సౌజన్యారావు పంతులూ నియ్యోగే!! ఇకపోతే కొండుభోట్లు సిధ్ధాంతీ లాంటి పాత్రలు మాత్రమే వైదీకి పాత్రలు. వాటిని ఆయన వెకిలి పాత్రలుగా చూపించలేదు. వీళ్ళు కాక మిగిలిన పాత్రలు అంటే అగ్నిహోత్రావధాన్లూ..లుభ్దావధాన్లూ..కరటక శాస్త్రీ..గిరీశం వీరంతా “ద్రావిడ బ్రాహ్మణులు” అప్పారావు గారు విజయనగరం ఇలాకాలోని ద్రావిడ బ్రాహ్మణులనే తన నాటకంలో చాదస్తులుగా చూపించేరు. వారి ఇంటి పేర్లతో సహా రాసేరాయన. “నేమాని” గిరీశం. అలాగే బుచ్చమ్మ గిరీశంతో అంటుంది ఇలా !! ” మీరొప్పుకుంటే మా రాంభొట్ల అచ్చమ్మ మిమ్మల్ని పెళ్ళాడుతానంది” అని. ఇదులోని నేమాని ..రాంభొట్ల ఇంటీ పేర్లు ద్రావిడుల ఇంటి పేర్లు గానీ వైదీకుల ఇంటి పేర్లు కావు. నందాపురపు పట్టీ [ పట్టీ అంటే 18 అగ్రహారాలు] అంతా ద్రావిడ బ్రాహ్మణ్యమే !! వైదీకులు నియ్యోగులూ తగుమాత్రంగా ఉన్న ప్రాంతాలు అవి. ఈ సంగతి ఆ ప్రాంతాలని ఎరిగిన వారికి తెలుసు.
అందువలన గురజాడ అప్పారావు గారికి వైదీకి ద్వేషాన్నీ..నియ్యోగపుటభిమానాన్నీ ఇవాళ కొత్తగా అంటగట్టటం లో నిజమూ లేదు. ఔచిత్యమూ లేదు.
రమ.
కోవెల సంపత్కుమార, కన్యాశుల్కం – మరో కోణం: విమర్శలు – పరామర్శ గురించి మోహన అభిప్రాయం:
01/05/2011 11:52 am
గురజాడవారి కాలములోని జాతి, వర్గ రాజకీయాలు నాకు ఎక్కువ తెలియవు కానీ నన్నయ కాలములో ఈ కాలములోవలె వైదికులు, నియోగులు ఉన్నారా అనే సందేహము నాకు కలుగుతుంది. బాటసారిగారూ, మీరు నన్నెచోడుని కుమారసంభవము కుహనా కవిత్వమని, మానవల్లి రామకృష్ణకవి వ్రాసి నన్నెచోడునికి ఆపాదించారు అనే వాదాన్ని ఏ ఒకరో ఇద్దరో తప్ప తెలుగు కవులు, పండితులు, పరిశోధకులు అందరూ నిరాకరించారు. వారి వాదన అంతా నన్నెచోడుని కాలము గురించే. ఇంతకూ నన్నెచోడుడు వైదికుడు కాడు, నియోగి అసలే కాడు, ఒక క్షత్రియుడు. వివరాలకు నేను వ్రాసిన కవిరాజశిఖామణి, క్రౌంచపదము వ్యాసాలను చదువుతారని ఆశిస్తాను.
విధేయుడు – మోహన
విశ్వనాథ కోవెల గురించి మోహన అభిప్రాయం:
01/05/2011 10:39 am