ధన్యవాదాలు
*
శ్రీ మోహన,
శ్రీ యదుకుల భూషణ్ గారికి,
నమస్తే.
ముందుగా మీ ఇరువురికీ నా మనఃపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా.
మోహన గారూ!
మీరు అన్నదీ నిజమే. వచన రచనలో ఒక మూడ్, ఆ నీడల ప్రభావం కవిత మీద జీరాడుతూ వుంటాయి.
యదుకుల భూషణ్ గారూ! మీ ప్రశంస నాకొక బహుమతి లాంటిది.అంతే కాదు, బహు స్ఫూర్తిదాయకం కూడా!
రామాయణం కథ నాలాటి అపండిత పల్లెటూరి ఘటం చదువుకుంటే, ప్రతి పాత్ర దేనికదే స్పష్టంగా ఉంటుంది. ఎన్నో పేర్లు వస్తూ ఉంటాయి. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు – అందరూ విడివిడిగానే కనిపిస్తారు. ఋషులుంటే వశిష్టుడు, విశ్వామిత్రుడు, ఋష్యశృంగుడు. ఇలా ఎవరికి వారే. ఎవరి పాత్ర వారిదే. మనుషులకేనా అంటే కోతులకు కూడా వారి ఐడెంటిటీలున్నయ్. వాలి, సుగ్రీవుడు, హనుమంతుడు, అంగదుడు – ఇలా ఎన్ని పేర్లు గుర్తుంచుకోటానికీ ఏం ఇబ్బంది లేదు.
కధలు ఇష్టపడేవాళ్ళు నాలాటి వారు అనేక రకాల పాత్రలను ఇష్టపడతారు. ఆ పాత్రల వైవిధ్యం లోంచి, వారి సంభాషణల నుంచీ, స్నేహాల నుంచీ, ఘర్షణల్నుంచీ, వినోదం కలుగుతుంది. ఆ జరిగే సంఘటనల మీదా, రాబొయే ఘట్టాల మీదా నాకు ఆసక్తి. అది నా తెలియనితనం లో నుంచి వచ్చిన రక్తి.
కాని పండిత వ్యాసులకు, ఇట్టి మామూలు కథల మామూలు మానవులకుండే అట్టి ఎదురు చూపుల అమాయకమైన ఆనందాలు లేవు. Scholars ఉన్నవీ లేనివీ అర్థాలు తీసుకుని, ప్రతిదీ లోతుగా తవ్వుకుని పోతూ, ఆ గూఢార్థాల గోతిలో పడి చివరికి -అన్నీ ఒకే అర్థం చెప్పుకుని, అన్నీఅంతకు ముందే తెలుసుననుకుని, అంతా ఒకటై పోయి- నిరవధిక, నిరామయ, నిర్గుణ సుఖం అనుభవిస్తూ ఉంటారు.
ఆ సుఖం నాకొద్దండి.
రామాయణంలో సీతా రాముడూ ఒకరే అంటే, ఆ మతమేంటో నాకు మాత్రం అంటించకండి. పైగా శబరి పాత్ర కల్పనకు కారణం ఏంటని ఆలోచన చెస్తూ, సీతా, శబరీ కూడా రాముడికి ఒకటేనంటే, ఇక నేను ‘ఏమి రామ కథ! శబరీ, శబరీ’ – అని లబలబలాడాల్సిందే.
రామా=సీతా= శబరి= బ్రహ్మ పదార్థం.
రాముడు = సీత = విశ్వనాథ = you know who= you know why.
Satan = Milton = T.S. Eliot = H. Bloom=
ఈ వ్యాసంలో ఎవరి అభిప్రాయాలు ఏవో విడదీయటం, ఎవరి తరం?
రెండు నెలలకోసారి ఒక సాహిత్య పురుషుడిపై ప్రేమ ప్రకటనలు చెయ్యమని సంపాదకులు అడిగితే, రాసే ‘మధుర భక్తి’ వ్యాసాలు ఇలాగే గజిబిజిగా ఉంటాయి. అప్పటి వరకు బాగున్న నాకు ఇట్టి ‘కోవెల’ లోకి అడుగు పెట్టగానే ‘జీవుని వేదన’ ఆరంభమవుతుంది.
ఒక పుష్కర కాలంలో ఈ మాటలో వచ్చిన అందమైన అభిప్రాయాల జాబితా ఒకటి తయారు చేస్తే అందులో దమయంతి గారి పేరు అగ్ర భాగాన ఉంటుంది అనడంలో సందేహం లేదు. జాగ్రత్తగా పరిష్కరించి విడిగా ప్రచురించినా ఈ అభిప్రాయం నిలబడుతుంది, దమయంతి గారి భావుకత్వానికి ఎత్తిన పతాకగా రెప రెప లాడుతూ. కొత్త కవులకు కొన్ని సంగతులు చెప్పే ప్రయత్నం నేనైతే చేశాను. గతంలో అదే పేరుతో మరొక వ్యాసం ఈ సంచికల్లో (నవంబర్ 2002 )ఉండేది , అది సాంకేతిక కారణాల వల్ల మరుగున పడినా దాని మీద వేడి వాడి చర్చ జరిగింది. అదీ సంగతి.
ఏంటో లైలా గారూ !! మీరు భలే వారు సుమా !! ఆయన రాసినది కMదపద్యమేనా?? అందులో కవిత్వం ఉందా?? వగైరా నానా ప్రశ్నలూ వేయగలరు తెలిసిన వారు చెప్పండి అని ఒక ప్రశ్న సంధించ గలరు. తీరా ఆయన రాసిన ఆ కంద పద్యాలు నాకు మాత్రం చాలా బాగున్నాయి అని ఒక జవాబు కూడా చెప్పగలరు. కోవెల సంపత్కుమార గారు రాసిన ఆ పద్యాలు మీ లాంటి వాళ్ళకి నచ్చుతాయనే కదా మరి సంపాదకులు వాటిని మళ్ళీ ప్రచురించినదీ ?! బహుబాగు.
ఇకపోతే మీ అభిప్రాయం లోని మరో సందేహం గురించి నా సందేహం మరొకటి. ఏమంటే అసలు తెలుగులో ఎవరైనా ఆడా మగా మధ్య ఎప్పుడైనా స్నేహం అని ఒకటి ఉంటుందని అనుకున్నారా?? అలా అనుకుని అభిప్రాయపడి ప్రశ్నలు సంధించిన వాళ్ళు ఉన్నారా?? ఒక్క మీకే ఇంత చక్కని అనుమానాలు ఎట్లా వస్తాయో నాకు వచింపరాని ఇష్టం;)
తెలుగు వాళ్ళు …అయితే, ఇద్దరు ఆడాళ్ళ స్నేహాన్నో లేదా ఇద్దరు మగాళ్ళ స్నేహాన్నో ఇబ్బంది లేకుండా ఒప్పుకుంటారు. అది ఖచ్చితంగా “అమలినంగా “మాత్రమే ఉండవచ్చని బహుశా వారి ప్రగాఢ నమ్మకం కాబోలు. రాయప్రోలు సుబ్బారావు గారి పంథాలోని తరహా స్నేహం స్త్రీ పురుషుల మధ్య ఇద్దరు రచయితల మధ్య కొనసాగడం తెలుగు వారికి ఇష్టమైన నమ్మకం ఇప్పటికీని. చాలా షరతులూ చాలా శీల పరీక్షలూ అందులో ఉండనఖ్ఖర లేదు. అలాగే .. ఇద్దరు స్త్రీలో లేదా .. ఇద్దరు పురుషులో అయితే కూడా ఈ బాదరబందీ ఉండనఖ్ఖరలేదన్నది అటు రచయితలకీ ఇటు విమర్శకులకీ కూడా స్పష్టంగానే తెలుసు. అలాంటి స్నేహాన్ని కీర్తించడంలో ఎప్పుడూ ఒక సుఖముంటుంది వీరందరికీను కదా?? మరి తెలిసి తెలిసీ.. అలాంటి సుఖాన్ని చీకాకు పరిచే తరహా ప్రశ్నలు మీలాంటి వాళ్ళెందుకు వేస్తుంటారో ఏంటో?? పాపం!! మీకు సాహిత్య రంగం ఇలా ఎప్పటికీ సుఖ శాంతులతో వర్ధిల్లడం ఇష్టం లేదు కామోసు!!
దమయంతి గారు, మీ అభిప్రాయములోనే కవిత్వం ప్రవహిస్తుంది. మరే లక్షణాలు అక్కర్లేదు. ఒక “వచన” రచనను చదివితే అది కవితో కాదో అర్థమవుతుంది. దాని లక్షణాలు ఎలాటివో తరువాతి కసరత్తు. ఈ కసరత్తు లేకపోయినా కవితకు వచ్చిన లోటేమీ లేదు. వచన రచనను ఎలా వ్రాయాలో చెప్పడం కష్టమే. కానీ ఒక వచన “కవితను” చదివితే అది కవితో కాదో చెప్పడము కష్టం కాదు. ఒకే కవి తన కవితనే వేరు వేరు సమయాలలో వేరు వేరు విధంగా పంక్తులుగా అమర్చగలడంటే అది అతిశయోక్తి కాదు. విధేయుడు – మోహన
కమాండో: డా. నిసి షామల్ నొవెల్లా గురించి Raghu అభిప్రాయం:
02/17/2011 7:51 am
కథ చాలా పెద్దదిగా ఉంది. చిన్నగా ఉంటే బాగుండేది.
రచయితలకు సూచనలు గురించి shailaja అభిప్రాయం:
02/17/2011 4:16 am
అభినందనలు!
చాలా సంతొషముగా ఉంది.
చాలా exciting గా ఉంది.
wish u all the best.
ఒక ప్రముఖ చర్చకు పునఃపరిచయం గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:
02/14/2011 1:29 am
ధన్యవాదాలు
*
శ్రీ మోహన,
శ్రీ యదుకుల భూషణ్ గారికి,
నమస్తే.
ముందుగా మీ ఇరువురికీ నా మనఃపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా.
మోహన గారూ!
మీరు అన్నదీ నిజమే. వచన రచనలో ఒక మూడ్, ఆ నీడల ప్రభావం కవిత మీద జీరాడుతూ వుంటాయి.
యదుకుల భూషణ్ గారూ! మీ ప్రశంస నాకొక బహుమతి లాంటిది.అంతే కాదు, బహు స్ఫూర్తిదాయకం కూడా!
కృతజ్ఞతాభినందనలతో-
ఆర్.దమయంతి.
కలకీ కలకీ మధ్య గురించి కిరన్ అభిప్రాయం:
02/13/2011 11:56 pm
నాకు ఏమీ అర్ధము కాలేదు.
విశ్వనాథ కోవెల గురించి lyla yerneni అభిప్రాయం:
02/13/2011 4:19 pm
రామాయణం కథ నాలాటి అపండిత పల్లెటూరి ఘటం చదువుకుంటే, ప్రతి పాత్ర దేనికదే స్పష్టంగా ఉంటుంది. ఎన్నో పేర్లు వస్తూ ఉంటాయి. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు – అందరూ విడివిడిగానే కనిపిస్తారు. ఋషులుంటే వశిష్టుడు, విశ్వామిత్రుడు, ఋష్యశృంగుడు. ఇలా ఎవరికి వారే. ఎవరి పాత్ర వారిదే. మనుషులకేనా అంటే కోతులకు కూడా వారి ఐడెంటిటీలున్నయ్. వాలి, సుగ్రీవుడు, హనుమంతుడు, అంగదుడు – ఇలా ఎన్ని పేర్లు గుర్తుంచుకోటానికీ ఏం ఇబ్బంది లేదు.
కధలు ఇష్టపడేవాళ్ళు నాలాటి వారు అనేక రకాల పాత్రలను ఇష్టపడతారు. ఆ పాత్రల వైవిధ్యం లోంచి, వారి సంభాషణల నుంచీ, స్నేహాల నుంచీ, ఘర్షణల్నుంచీ, వినోదం కలుగుతుంది. ఆ జరిగే సంఘటనల మీదా, రాబొయే ఘట్టాల మీదా నాకు ఆసక్తి. అది నా తెలియనితనం లో నుంచి వచ్చిన రక్తి.
కాని పండిత వ్యాసులకు, ఇట్టి మామూలు కథల మామూలు మానవులకుండే అట్టి ఎదురు చూపుల అమాయకమైన ఆనందాలు లేవు. Scholars ఉన్నవీ లేనివీ అర్థాలు తీసుకుని, ప్రతిదీ లోతుగా తవ్వుకుని పోతూ, ఆ గూఢార్థాల గోతిలో పడి చివరికి -అన్నీ ఒకే అర్థం చెప్పుకుని, అన్నీఅంతకు ముందే తెలుసుననుకుని, అంతా ఒకటై పోయి- నిరవధిక, నిరామయ, నిర్గుణ సుఖం అనుభవిస్తూ ఉంటారు.
ఆ సుఖం నాకొద్దండి.
రామాయణంలో సీతా రాముడూ ఒకరే అంటే, ఆ మతమేంటో నాకు మాత్రం అంటించకండి. పైగా శబరి పాత్ర కల్పనకు కారణం ఏంటని ఆలోచన చెస్తూ, సీతా, శబరీ కూడా రాముడికి ఒకటేనంటే, ఇక నేను ‘ఏమి రామ కథ! శబరీ, శబరీ’ – అని లబలబలాడాల్సిందే.
రామా=సీతా= శబరి= బ్రహ్మ పదార్థం.
రాముడు = సీత = విశ్వనాథ = you know who= you know why.
Satan = Milton = T.S. Eliot = H. Bloom=
ఈ వ్యాసంలో ఎవరి అభిప్రాయాలు ఏవో విడదీయటం, ఎవరి తరం?
రెండు నెలలకోసారి ఒక సాహిత్య పురుషుడిపై ప్రేమ ప్రకటనలు చెయ్యమని సంపాదకులు అడిగితే, రాసే ‘మధుర భక్తి’ వ్యాసాలు ఇలాగే గజిబిజిగా ఉంటాయి. అప్పటి వరకు బాగున్న నాకు ఇట్టి ‘కోవెల’ లోకి అడుగు పెట్టగానే ‘జీవుని వేదన’ ఆరంభమవుతుంది.
లైలా
తవ్విపోత గురించి aaa అభిప్రాయం:
02/13/2011 11:04 am
బాగుంది
ఒక ప్రముఖ చర్చకు పునఃపరిచయం గురించి తమ్మినేని యదుకుల భూషణ్ అభిప్రాయం:
02/13/2011 10:14 am
ఒక పుష్కర కాలంలో ఈ మాటలో వచ్చిన అందమైన అభిప్రాయాల జాబితా ఒకటి తయారు చేస్తే అందులో దమయంతి గారి పేరు అగ్ర భాగాన ఉంటుంది అనడంలో సందేహం లేదు. జాగ్రత్తగా పరిష్కరించి విడిగా ప్రచురించినా ఈ అభిప్రాయం నిలబడుతుంది, దమయంతి గారి భావుకత్వానికి ఎత్తిన పతాకగా రెప రెప లాడుతూ. కొత్త కవులకు కొన్ని సంగతులు చెప్పే ప్రయత్నం నేనైతే చేశాను. గతంలో అదే పేరుతో మరొక వ్యాసం ఈ సంచికల్లో (నవంబర్ 2002 )ఉండేది , అది సాంకేతిక కారణాల వల్ల మరుగున పడినా దాని మీద వేడి వాడి చర్చ జరిగింది. అదీ సంగతి.
తమ్మినేని యదుకుల భూషణ్.
చేరా కు ఒక శతమానం గురించి rama bharadwaj అభిప్రాయం:
02/13/2011 7:02 am
ఏంటో లైలా గారూ !! మీరు భలే వారు సుమా !! ఆయన రాసినది కMదపద్యమేనా?? అందులో కవిత్వం ఉందా?? వగైరా నానా ప్రశ్నలూ వేయగలరు తెలిసిన వారు చెప్పండి అని ఒక ప్రశ్న సంధించ గలరు. తీరా ఆయన రాసిన ఆ కంద పద్యాలు నాకు మాత్రం చాలా బాగున్నాయి అని ఒక జవాబు కూడా చెప్పగలరు. కోవెల సంపత్కుమార గారు రాసిన ఆ పద్యాలు మీ లాంటి వాళ్ళకి నచ్చుతాయనే కదా మరి సంపాదకులు వాటిని మళ్ళీ ప్రచురించినదీ ?! బహుబాగు.
ఇకపోతే మీ అభిప్రాయం లోని మరో సందేహం గురించి నా సందేహం మరొకటి. ఏమంటే అసలు తెలుగులో ఎవరైనా ఆడా మగా మధ్య ఎప్పుడైనా స్నేహం అని ఒకటి ఉంటుందని అనుకున్నారా?? అలా అనుకుని అభిప్రాయపడి ప్రశ్నలు సంధించిన వాళ్ళు ఉన్నారా?? ఒక్క మీకే ఇంత చక్కని అనుమానాలు ఎట్లా వస్తాయో నాకు వచింపరాని ఇష్టం;)
తెలుగు వాళ్ళు …అయితే, ఇద్దరు ఆడాళ్ళ స్నేహాన్నో లేదా ఇద్దరు మగాళ్ళ స్నేహాన్నో ఇబ్బంది లేకుండా ఒప్పుకుంటారు. అది ఖచ్చితంగా “అమలినంగా “మాత్రమే ఉండవచ్చని బహుశా వారి ప్రగాఢ నమ్మకం కాబోలు. రాయప్రోలు సుబ్బారావు గారి పంథాలోని తరహా స్నేహం స్త్రీ పురుషుల మధ్య ఇద్దరు రచయితల మధ్య కొనసాగడం తెలుగు వారికి ఇష్టమైన నమ్మకం ఇప్పటికీని. చాలా షరతులూ చాలా శీల పరీక్షలూ అందులో ఉండనఖ్ఖర లేదు. అలాగే .. ఇద్దరు స్త్రీలో లేదా .. ఇద్దరు పురుషులో అయితే కూడా ఈ బాదరబందీ ఉండనఖ్ఖరలేదన్నది అటు రచయితలకీ ఇటు విమర్శకులకీ కూడా స్పష్టంగానే తెలుసు. అలాంటి స్నేహాన్ని కీర్తించడంలో ఎప్పుడూ ఒక సుఖముంటుంది వీరందరికీను కదా?? మరి తెలిసి తెలిసీ.. అలాంటి సుఖాన్ని చీకాకు పరిచే తరహా ప్రశ్నలు మీలాంటి వాళ్ళెందుకు వేస్తుంటారో ఏంటో?? పాపం!! మీకు సాహిత్య రంగం ఇలా ఎప్పటికీ సుఖ శాంతులతో వర్ధిల్లడం ఇష్టం లేదు కామోసు!!
రమ.
ఒక ప్రముఖ చర్చకు పునఃపరిచయం గురించి మోహన అభిప్రాయం:
02/12/2011 12:58 pm
దమయంతి గారు, మీ అభిప్రాయములోనే కవిత్వం ప్రవహిస్తుంది. మరే లక్షణాలు అక్కర్లేదు. ఒక “వచన” రచనను చదివితే అది కవితో కాదో అర్థమవుతుంది. దాని లక్షణాలు ఎలాటివో తరువాతి కసరత్తు. ఈ కసరత్తు లేకపోయినా కవితకు వచ్చిన లోటేమీ లేదు. వచన రచనను ఎలా వ్రాయాలో చెప్పడం కష్టమే. కానీ ఒక వచన “కవితను” చదివితే అది కవితో కాదో చెప్పడము కష్టం కాదు. ఒకే కవి తన కవితనే వేరు వేరు సమయాలలో వేరు వేరు విధంగా పంక్తులుగా అమర్చగలడంటే అది అతిశయోక్తి కాదు. విధేయుడు – మోహన
కలిశాం గురించి Narayana అభిప్రాయం:
02/12/2011 2:02 am
ముందు కామెంటులో లంకె తప్పు పడింది. ఈ లంకె చదవండి. 2007 సంవత్సరానికి ఇస్మాయిల్ అవార్డు వరించినందుకు గరికపాటి వారికి మరొకసారి కంగ్రాట్స్!!
విధేయుడు,
నారాయణ