మీరు కేవలం ఒక ఏడాది కాలం పనిచేసిన సంస్థలో, ఒక వ్యక్తి జీవితాన్ని తీర్చిదిద్దారంటే మీ కృషి నిజంగా అభినందనీయం. ఇంకనూ మొదటి పనిగా మీరు చేసిన శ్రీలత వేతన సవరణ 5500 /- నుండి 11000/- (100 శాతం పెరుగుదల) పైగా కాలిఫోర్నియా ఛాన్స్, ఇవి చూస్తే ఎవరికైనా మీ వంటి మేనేజర్ ఉంటే బాగుండు అనిపిస్తోంది. మీరు వెళ్ళిన వెంటనే ఆ సదరు కంపెనీ దురదృష్టంతో మూతపడినా కూడా, శ్రీలత పడిలేచిన కెరటం వలె మారుతి కారు కొనగలిగే స్థాయికి చేరటం నిజంగా ‘కృషితో నాస్తి దుర్భిక్షం’.
నా వరకు నేను, మూడు ఏండ్లుగా మేనేజర్ గా విధులు నిర్వర్తిస్తున్న కూడా నా సహోద్యోగుల కార్యాలయ జీవితం మినహా, వారి స్వవిషయాలు తెలుసుకోలేనందుకు చింతిస్తున్నాను.
రాఘవ గారూ మీరు విన్నది నిజమే. వంశీ గారి “పసలపూడి కథ”ల శైలి ఇలాగే ఉంటుంది. నేను ఇండియాలో ఉన్నప్పుడు “స్వాతి”లో్ చదివాను.
బ్రహ్మానందం గారూ, చిన్న అక్షరదోషం “చాందసురాలు” అని కాదు “చాంధసురాలు” అని ఉండాలి. ఇక పోతే కథ, కథనం చాలా బాగున్నాయి. ఆడవాళ్ళు పుకార్లు పుట్టించటములోనూ, వాటి వ్యాప్తిలోనూ సిధ్ధహస్తులు. చురక బాగానే అంటించారు. మానవసంబంధాలలోని వైచిత్రిని మరోసారి కళ్ళకు కట్టారు. అభినందనలు.
అచంగ
నిజమైన సాహిత్యాభిమాని అన్ని భాషలనూ అభిమానిస్తాడు.ఏ భాషనూ ద్వేషించడు. ఆధునిక కాలంలో ఇది అత్యవసరం.దృక్ప్ఠథం విశాలం కావడానికి దోహదం చేస్తుంది.అయితే మాతృభాషను కించ పరచుకో రాదు. అనవసరంగా ఆంగ్ల పదాలు చొప్పిస్తూ వ్రాస్తే ఇక ‘తెలుగు’ అని చెప్పుకోవడానికి ఏమి మిగులుతుంది అనే విషయాన్ని రచయితలు ఆలోచించు కోవాలి.
మీ సందేహం సబబుగానే వుంది. మీరు చెప్పిన కీర్తనలో సూచించిన “గరా” అన్నది అనుప్రాసలో క్రిందకే వస్తుంది.
ఈ “వందనము రఘు నందనా” కృతిలో చాలా అనుప్రాసలున్నాయి. నేను ఒక్కొక్క శబ్దాలంకారానికీ ఒక్కో కృతే తీసుకున్నాను. చాలా కృతుల్లో ఇవి కనిపిస్తాయి. మీరు చెప్పిన కృతే తీసుకోండి.
వందనము రఘు నందన సేతు
బంధన భక్త చందన రామ
శ్రీ-దమా నాతో వాదమా నే
భేదమా ఇది మోదమా రామ (వ)
శ్రీ రమా హృచ్చారమా బ్రోవ
భారమా రాయ-భారమా రామ (వ)
వింటిని నమ్ముకొంటిని
శరణంటిని రమ్మంటిని రామ (వ)
ఓడను భక్తి వీడను ఒరుల
వేడను నీ-వాడను రామ (వ)
కమ్మని విడెమిమ్మని వరము
కొమ్మని పలుకు రమ్మని రామ (వ)
న్యాయమా నీకాదాయమా ఇంక
హేయమా ముని గేయమా రామ (వ)
చూడుమీ కాపాడుమీ మమ్ము
పోడిమిగా కూడుమీ రామ (వ)
క్షేమము దివ్య ధామము నిత్య
నేమము రామ నామము రామ (వ)
వేగ రా కరుణా సాగరా శ్రీ
త్యాగరాజ హృదయాగారా రామ (వ)
ప్రతీ చరణంలో అనుప్రసాలున్నాయి. “ఓడను, వీడను, వేడను, వాడను” ఒకే రకమైన అక్షరాలతో పలికే విభిన్న పదసముదాయమది. మొత్తం కృతినిండా ఇలాంటివే వున్నాయి. వెతికితే మిగతా కృతుల్లోనూ ఇలాంటివి కనబడతాయి. త్యాగరాజు శబ్దాలంకారాలకి చాలా ప్రాముఖ్యత చూపించాడు. ముఖ్యంగా సంగీతాన్ని కర్ణపేయంగా చేయడానికి ఇవి ఎలా ఉపయోగపడతాయో, సంగీతానికివెంత అవసరమో చూపించాడు. అన్ని కవితా ప్రక్రియల్లోకీ పాట రాయడం చాలా కష్టం. రాసి మెప్పించడం మరీ కష్టం. సశాస్త్రీయంగా రాయడం బహు దుర్లభం. అందుకే చాలా మంది కవులు కవిత్వంతోనే సర్దిపెట్టుకుంటారు. పాటలజోలికి పోరు. పోయినా శాస్త్రీయ సంగీతం వైపు అస్సలు కన్నెత్తి కూడా చూడరు. త్యాగరాజు తరువాత మనకు మిగిలిన ఒకే ఒక పెద్ద వాగ్గేయకారుడు బాలమురళీకృష్ణ. తెలుగువారు ఆయనకెంత గౌరవం ఇస్తారో అందరికీ తెలుసున్నదే!
సామాన్యుని స్వగతం: మంచి స్నేహితురాలు గురించి ఫణికుమార్ అభిప్రాయం:
03/07/2011 8:04 am
మీరు కేవలం ఒక ఏడాది కాలం పనిచేసిన సంస్థలో, ఒక వ్యక్తి జీవితాన్ని తీర్చిదిద్దారంటే మీ కృషి నిజంగా అభినందనీయం. ఇంకనూ మొదటి పనిగా మీరు చేసిన శ్రీలత వేతన సవరణ 5500 /- నుండి 11000/- (100 శాతం పెరుగుదల) పైగా కాలిఫోర్నియా ఛాన్స్, ఇవి చూస్తే ఎవరికైనా మీ వంటి మేనేజర్ ఉంటే బాగుండు అనిపిస్తోంది. మీరు వెళ్ళిన వెంటనే ఆ సదరు కంపెనీ దురదృష్టంతో మూతపడినా కూడా, శ్రీలత పడిలేచిన కెరటం వలె మారుతి కారు కొనగలిగే స్థాయికి చేరటం నిజంగా ‘కృషితో నాస్తి దుర్భిక్షం’.
నా వరకు నేను, మూడు ఏండ్లుగా మేనేజర్ గా విధులు నిర్వర్తిస్తున్న కూడా నా సహోద్యోగుల కార్యాలయ జీవితం మినహా, వారి స్వవిషయాలు తెలుసుకోలేనందుకు చింతిస్తున్నాను.
-ఫణికుమార్
కోనసీమ కథలు: ఆకాశం వారి మేడ గురించి అచంగ అభిప్రాయం:
03/07/2011 7:31 am
రాఘవ గారూ మీరు విన్నది నిజమే. వంశీ గారి “పసలపూడి కథ”ల శైలి ఇలాగే ఉంటుంది. నేను ఇండియాలో ఉన్నప్పుడు “స్వాతి”లో్ చదివాను.
బ్రహ్మానందం గారూ, చిన్న అక్షరదోషం “చాందసురాలు” అని కాదు “చాంధసురాలు” అని ఉండాలి. ఇక పోతే కథ, కథనం చాలా బాగున్నాయి. ఆడవాళ్ళు పుకార్లు పుట్టించటములోనూ, వాటి వ్యాప్తిలోనూ సిధ్ధహస్తులు. చురక బాగానే అంటించారు. మానవసంబంధాలలోని వైచిత్రిని మరోసారి కళ్ళకు కట్టారు. అభినందనలు.
అచంగ
వాళ్ళు రాక ముందు గురించి Seetha Kumari అభిప్రాయం:
03/07/2011 7:10 am
చక్కని దృశ్య కవిత…
భాషల ఋతువు గురించి Seetha Kumari అభిప్రాయం:
03/07/2011 7:08 am
చాలా మంచి కవిత….ఎంతో నచ్చింది..
ఫాదరు జోజి గురించి Seetha Kumari అభిప్రాయం:
03/07/2011 7:05 am
బాగుంది…
ఇల్లు విడిచి పోతావా రమణా? గురించి pratap అభిప్రాయం:
03/07/2011 4:51 am
చాలా బాగున్నది.
భాషల ఋతువు గురించి sesha kumar kv అభిప్రాయం:
03/07/2011 4:12 am
నిజమైన సాహిత్యాభిమాని అన్ని భాషలనూ అభిమానిస్తాడు.ఏ భాషనూ ద్వేషించడు. ఆధునిక కాలంలో ఇది అత్యవసరం.దృక్ప్ఠథం విశాలం కావడానికి దోహదం చేస్తుంది.అయితే మాతృభాషను కించ పరచుకో రాదు. అనవసరంగా ఆంగ్ల పదాలు చొప్పిస్తూ వ్రాస్తే ఇక ‘తెలుగు’ అని చెప్పుకోవడానికి ఏమి మిగులుతుంది అనే విషయాన్ని రచయితలు ఆలోచించు కోవాలి.
విద్యాసుందరి – వ్యాసానుబంధము గురించి Sowmya అభిప్రాయం:
03/06/2011 8:26 am
మొదటి విద్యాసుందరి లంకె మరేదో వ్యాసానికి వెళ్తోంది…సరిచేయగలరు.
[పొరపాటు సరిజేశాం, ధన్యవాదాలు, సం.]
ప్రేమ కవితలు గురించి asan అభిప్రాయం:
03/06/2011 8:13 am
ok చాలా బాగుంది.
త్యాగరాజు కృతుల్లో శబ్దాలంకారాలు గురించి సాయి బ్రహ్మానందం గొర్తి అభిప్రాయం:
03/06/2011 3:55 am
కిషోర్ గారూ,