పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16469

  1. మధ్య వ్యవధిలో నీడలు గురించి Vidya అభిప్రాయం:

    06/01/2011 12:17 am

    చంద్ర గారు.. ఈ కధను ‘మధ్య వ్యవధిలో నీడలు’ అని అన్నారు. ఇది నాకు అర్ధముకాలేదు. దీనికి కొంచెం వివరణ ఇస్తారా.

  2. నువ్వు గురించి rajashaker అభిప్రాయం:

    05/31/2011 11:30 pm

    మీరు రాసిన కవితలు చదివాను. నిజానికి దగ్గరగా ఉన్నాయి.

  3. పిల్లల కోసం గురించి Vidya అభిప్రాయం:

    05/31/2011 10:21 pm

    మొదటి రెండు కవితలు నాకు బాగా నచ్చాయి.

  4. పిల్లల కోసం గురించి buddana veena అభిప్రాయం:

    05/31/2011 2:39 am

    చాలా బాగున్నాయి మీ కవితలు…చాలా ఆహ్లాదాన్ని కలిగించాయి.

  5. నల్లతోలు: కథ నచ్చిన కారణం గురించి subramanyam.Ravuluri అభిప్రాయం:

    05/30/2011 9:24 am

    I read this story 50 years ago. The review posted by Sri.K.V.Giridhar Rao gaaru is excellent. Thanks to eemaata. May I request you to publish the story “family portrait” (Telugu version) which is one among the several wonderful Telugu stories translated in to English by Sri.Vadrevu Patanjali gaaru.

    Subramanyam.R

  6. భావ కవిత్వంలో జానపదం, జానపదంలో భావకవిత్వం – 1 గురించి jayaprabha అభిప్రాయం:

    05/29/2011 3:27 pm

    లవణరాజు కల లోని భోజనమ్ గురించి వ్యాసకర్తల ప్రస్తావన అయినప్పటికీ… అప్పారావు గారి తోకచుక్క లోని “చాపకూటి” ప్రస్తావనని అలాగే తోకచుక్క లోని యువకుని భార్య అన్న మాటల ప్రస్తావననీ నేను గుర్తు చేయడం – మార్పులని వాళ్ళు పైపైననే కాక వాటీ మూలాలని గురించి కూడా ప్రస్తావన చేసారు సుమా అని చెప్పడానికి మాత్రమే!! రాయప్రోలు సుబ్బారావుగారు రాసిన లాంటి దేశభక్తీ అప్పారావుగారు రాసిన దేశభక్తీ ఒక్కలాంటివి కావు. వాళ్ళ గొంతుకలు వేరు. వాళ్ళ ఊహలు వేరు. వాళ్ల ఆదర్శాలూ వేరు. అప్పారావు గారు భావకవిత్వానికి ప్రేరకుడూ కాడు. ఆద్యుడూ కాడు.

    మనవాళ్ళు కాశీమజిలీకధలూ ..హంసచెప్పినకధలూ చిలకచెప్పినకధలూ ఇవన్నీ జానపద విభాగంలో భాగంగా చేసి ఉండకపోవచ్చు. ఈ రకమైన పేర్లు ఇంగ్లీషు వాళ్ళు ఆ తర్వాత పెట్టినవి కావొచ్చు. కానీ ఆ తరహా సాహిత్యం మనకి కొన్ని వేల ఏళ్లుగా ఉన్నప్పుడు తిరిగీ దానిని గురించి మాట్లాడటమ్ కేవలం ఇంగ్లీషు ప్రభావం వల్లనే జరిగిందని అనడం పరిధిని కుదించి వ్యాఖ్యానించడమే!!. ఇందుకు అలాంటి మాటలు ఇంగ్లీషువాళ్లకి ముందులేవని చెప్పే ఆధారాలు ఏమన్నా ఉండాలి. సాహిత్యం ఉండీ దానికి ఒక ప్రత్యేకమైన పేరు లేకపోతేనే అంతమాత్రానికే అది ఇంగ్లీషు ప్రభావమ్ అని అనేయగలమా?అన్నది ఒక ప్రశ్న.

    మనవాళ్ళు సంధ్యావందనమ్ చేస్తూ చెప్పే సంకల్పమ్ ఏళ్ల వెనకటిది. ఇటీవలది కాదు.అప్పుడు వాళ్ళు “భరతఖండే” అని అన్నారు కద. అంగ ఖండే వంగఖండే కాశ్మీర ఖండే అని సంకల్పం చెప్పలేదు కద? ఇది ధార్మికంగా హిందూ సంస్కృతి ఏకమన్న నమ్మకానికి మంత్రరూపమేనని అనుకోకపోడానికి ఏమి కారణం?? వేమన బ్రౌన్ దొర మెచ్చుకుంటాడని శతకం చెప్పలా! వేమన హిందువులనీ ..ముఖ్యంగా భ్రాహ్మలని వారి ఆచారాలనీ విమర్శించినందుకు మాత్రమే క్రైస్తవుడైన బ్రౌన్ కి ఆ శతకం ఎక్కువ నచ్చింది. ఆయన వేమనని అనువాదం చేయపూనుకోడానికి ఇది ఒక ముఖ్యమైన కారణం.

    రాయవాచకలోకాబోలు ఒకచోట పురుషోత్తమ గజపతిని తిమ్మరుసు సాటి హిందూ రాజుగా ఆయన ధర్మనిరతిని గురించి రాయల దగ్గర మెచ్చుకున్నట్టూ… నరపతులకీ గజపతులకీ వైరం ఉన్నా అది సుల్తానులతో ఉన్న వైరంలా ఉండకుండా ఉండాలని కాంక్షించి అలా రాయలు ప్రవర్తించేలా ప్రేరేపించినట్టు ఒక ప్రస్తావన ఉండటం గమనించ వలసిన అంశమే!! హిందూదేశ ఏకతకి బ్రిటీషు వ్యతిరేకత ఎంత పనిచేసిందో ఈ దేశంలో ఉన్న సంస్కృతీ ఏకత కూడా అంతే పనిచేసిందన్నది అంతే ముఖ్యమైన అంశం అవుతుంది. అందునా రాజుల కన్నా ప్రజల మధ్య ఈ ఏకత వివాహాది విధానాల ద్వారా ఇచ్చిపుచ్చుకోవడాల ద్వారా బలపడింది. భాస్కర్ గారన్నట్టు అంగవంగకళింగదేశాల లోని పిల్లలపట్ల వివాహాలకి లేని అభ్యంతరం మ్ళేచ్చజాతుమ్ళేచేయడం పట్ల ఉండటం భరతఖండంలో ఉన్న ఏకత కి నిదర్శనమే కద.

    ఇకపోతే కాశ్మీరం నించి కేరళ దేశం దాకా పదకొండవ శతాబ్దం లోనే జయదేవుని అష్టపదులకి నకళ్ళు రాయిచుకుని ప్రాంతీయ భాషలలోకి తర్జుమా చేసుకుని ఆనందించినట్టు మనకి సంస్కృత సాహిత్య చరిత్ర చెబుతోంది. నేపాల్ తో సహా! ఇలాంటి సారస్వత ఆదాన ప్రదానమ్ ఇంగ్లీషు వారి రాకతో సంబధం లేకుండానే జరిగింది. మనకి ఉన్న ఒక సమైక్యత ఇంగ్లీషువాళ్ళ వల్లనే వచ్చిందని అనుకోవడం మనకి ఉన్న సంస్కృతీ నేపధ్యాన్ని కాదనడమే ఒకరకంగా !! అలా భావించడం బహుశా ఇటీవలి మార్పేమో !!

    నిన్న విపులంగా రాయడానికి కుదర లేదు. అందుకు మళ్ళీ ఈ మాటలని జోడిస్తున్నాను.

    జయప్రభ.

  7. కోనసీమ కథలు: విలేకరి గురించి g.umakanth అభిప్రాయం:

    05/29/2011 2:45 pm

    Story is not good. Characters presentation is not correct.

  8. ప్రేమ కవితలు గురించి umar అభిప్రాయం:

    05/28/2011 2:50 am

    మీ కవితలు చాలా బాగున్నాయి.

  9. భావ కవిత్వంలో జానపదం, జానపదంలో భావకవిత్వం – 1 గురించి jayaprabha అభిప్రాయం:

    05/27/2011 2:33 pm

    చాలా ఆలస్యంగా చదివాను ఈ వ్యాసాన్ని. నా ముందు అభిప్రాయాలు చెప్పిన వారన్నట్టు ఈ వ్యాసం బలహీనమైన వాదనతోనూ అనవసరమైన ఒక తొందరతోనూ హడావిడిగా ముగిసింది. దానిని అటుంచి వెల్చేరు గురజాడని ఉదాహరణగా తీసుకుని చేసిన వ్యాఖ్య సరి కాదు. మనం ఒక కవిని గురించి సగం సగం మాత్రమే ఉదాహరిస్తే తద్విరుధ్ధమైన మాటలు కూడా అదే అప్పారావు గారి కవిత్వంలో ఉంటాయి. ఉదాహరణకి ఆయన రాసిన తోకచుక్క గేయంలో యువకుని మాటలకి ఆయన వెళ్ళి వచ్చిన చాపకూడుకి [ఇది మధ్య తరగతి భోజనం అని మనకి అప్పారావు గారేమీ పదార్ధాల వివరణని ఇవ్వలేదే? మరి నారాయణ రావుకి ఆ భోజనం మధ్యతరగతిది అని ఎందుకని తోచిందో?] గానూ ఆ గేయం లోని యువకుని భార్య ఒక మాట అంది మరి. ఏమంటే “కలిసి మెసిగిన యంత మాత్రమే కలుగబోదీ ఐకమత్యము మాల మాదిగ కన్యనెవతెనొ మరులు గొనరాదో?” అని ఆమాట. దానికి అర్ధమ్ కేవలం చాపకూటి వల్లనే ఏం మార్పు వస్తుందీ వర్ణాంతర ప్రేమలూ లేదా వివాహాలు జరగనిదే అని. ఇది భావకవుల పరిధిలో నారాయణ రావు చెప్పిన అభిప్రాయాలకి పొసగదు. గురజాడని అంచనా వేయడం ఏమంత సులభం కాదు. దీనిమీద మరింత విపులమైన చర్చ నా పుస్తకమ్ “ప్రతికూలపవనాలు” లో ఉంది. ఆసక్తి ఉన్నవారు దానిని చదవవచ్చు. పైగా గురజాడ భావకవి కాడు. ఆయన కవిత్వంలో వెల్చేరు రాసిన “దేశభక్తి” లేదు సరికదా గురజాడ రాసిన కవిత అయిన “దేశభక్తి” లో ఉన్నది విశ్వమానవ భక్తి. ఇలా ఏదేమైనా చాలా అసమగ్రమైన, అపక్వమైన అభిప్రాయాల మయమ్గా ఉన్న ఈ వ్యాసం నిరుత్సాహాన్నే ఇచ్చింది నాకు.

    మీ ఈమాట మూల సర్వర్ల, వాటి హాకర్ల చేతినించి బయటపడినందుకు సంతోషం. అందుకోసమ్ కష్టపడిన సురేష్ కొలిచాలకీ, ఇంద్రగంటి పద్మకీ నా అభినందనలు.

    జయప్రభ.

  10. ఈమాట మే 2011 సంచికకు స్వాగతం!! గురించి సంపాదకుల నుండి అభిప్రాయం:

    05/27/2011 9:06 am

    ఈమాట పాఠకులకు నమస్కారం,

    గత కొన్నిరోజులుగా ఈమాటలో రచనలన్నిటిలోనూ అక్షరాలబదులుగా ? గుర్తులు నిండివుండడం, ఆ సమస్య కేవలం కొత్త సంచికకే కాక 1998 నుంచి ఈమాట అన్ని సంచికలకూ వ్యాపించిందని మీకు తెలుసును. ఇది ఈమాట హోస్ట్ సర్వర్లలో తలెత్తిన సమస్య. కేవలం ఈమాటకే కాక ఆ సర్వర్లపై ఆధారపడి వున్న ఎన్నో పత్రికలు, బ్లాగులు ఇలా అన్ని వెబ్సైట్లూ ఈ సమస్యలో చిక్కుకున్నై. ఇందుకు కారణం హ్యాకర్ల చేతిలో హోస్ట్ సర్వర్ల భద్రత రాజీకావటం. సురేశ్ కొలిచాల సారథ్యం, పద్మ ఇంద్రగంటి సహకారంతో ఈమాట సాహిత్యాన్నంతా పునరుద్ధరించే ప్రయత్నం నిర్విరామంగా జరుగుతున్నది. ఇంకొక రెండు మూడు రోజుల్లో ఈమాట మళ్ళీ పూర్తిగా ఏ లోపాలూ లేకుండా మీకందించడానికి ప్రయత్నిస్తున్నాము. అలాగే, ఇలాంటి చిక్కులు తలెత్తినప్పుడు మరింత సమర్థవంతంగా ఎదుర్కొనడానికి ప్రణాళికలు కూడా వేస్తున్నాం.

    మీకు కలిగిన ఈ అసౌకర్యానికి క్షమాపణలు. ఈ సమస్య గురించి మాకు తెలుపుతూ ఉత్తరాలు పంపి, మాకు బాసటగా నిల్చిన పాఠకులందరికీ మా కృతజ్ఞతలు. ఈమాటపై మీ ఆదరాభిమానాలు ఎల్లకాలం ఇలానే ఉండాలని మా ఆకాంక్ష.

    ఈమాట సంపాదకుల బృందం.