ఈమాట నవంబర్ 2016 సంచికకు స్వాగతం! 1

🔸 అమెరికన్ ఫోక్ సంగీత ప్రపంచపు దిగ్గజం, వాగ్గేయకారుడు అయిన బాబ్ డిలన్ స్వతహాగా వివాదాస్పదుడు కూడా. ఆ పాటకుడిని ఈ ఏడాది సాహిత్య విభాగపు నోబెల్ బహుమతికి ఎంచుకోవడం కూడా అలాగే వివాదాలకు దారి తీసింది. బాబ్ డిలన్ కేవలం గాయకుడేనా? కవి అవునా, కాదా? అనే ప్రశ్న మళ్ళీ కొత్తగా తెరపైకి వచ్చింది. డిలన్ ఎందుకు కేవలం పాటకాడు కాదో తన అభిప్రాయం చెప్తున్నారు ఈ వ్యాసంలో వేలూరి వేంకటేశ్వరరావు.

🔸 అత్యంత లఘుకావ్యమైనా అమరుకాది శృంగార కావ్యాలతో సమంగా ప్రసిద్ధమైన పుష్పబాణవిలాస కావ్యాన్ని టీకా తాత్పర్యాది సహితంగా తెలుగు చేసి అందిస్తున్నారు తిరుమల కృష్ణదేశికాచార్యులు.

🔸 ఈ సంచిక నుండి సాధారణ కథావ్యాసాది లక్షణాలతో పొసగనివిగా అనిపించే రచనలకు చోటు కల్పిస్తూ స్వగతం అనే ఒక కొత్త కేటగిరీ మొదలు పెడుతున్నాం పూడూరి రాజిరెడ్డి రచనతో. ఈ కొత్త విభాగం ఈమాట రచయితలకు తమ ఆలోచనలు, ఊహలు, అభిప్రాయాలు, మ్యూజింగ్స్ వంటివి ప్రచురించుకునేందుకు ఒక కొత్త వెసులుబాటు నిస్తుంది. రచయితలు వినియోగపరచుకుని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం.

🔸 మొదటి గడి-నుడిని ఉత్సాహంగా ప్రయత్నించి ప్రోత్సహించిన పాఠకులందరికీ మా కృతజ్ఞతలు. ఈ నెల గడినుంచీ నియమాలు కొద్దిగా మారాయి. దయచేసి గమనించగలరు. వీలైనంత త్వరలో ఈమాటలో కొంత కొత్త ఒరవడి తేవడానికి ప్రయత్నిస్తున్నాం. మీ ఆదరణ, ప్రోత్సాహం ఈమాటకు ఎల్లప్పుడూ ఉంటాయనీ ఉండాలనీ కోరుకుంటున్నాం.

తన మాట కోసం 5

ఒకసారి అలానే ఏడిపించడానికి అబ్బాయి పెళ్ళి కుదిరిందా అనడిగితే, అమ్మాయి, ఆఁ, కుదిరింది అనింది మెల్లగా. అబ్బాయి ఖంగు తిన్నాడు. ఎప్పుడన్నాడు. నిన్ననే! చూడిదిగో, ఈ అల్లిక పని ఉన్న దుపట్టా! వాళ్లిచ్చిందే, అని చూపించి వెళ్ళిపోయింది. ఇంటికెలా చేరుకున్నాడో అతగానికి తెలియలేదు, దారి పొడుగునా — ఒక పాపను తోసేసినదీ, ఒక వ్యాపారి చిల్లరంతా కింద పడేసినదీ, కుక్కపై రాయి విసరినదీ, పాలు పారబోసుకున్నదీ, ఒక మడి బామ్మకు ఢీకొట్టి గుడ్డివాడనే బిరుదు సంపాయించుకున్నదీ ఏమీ గుర్తులేదతనికి.

తెగులుకి శిక్ష 19

“ఈయనకి తెలియని విషయం లేదు. తెలుగు, పద్యాలు, పాటలు, యోగా, జ్యోతిషం, హస్త సాముద్రికం, పాద సాముద్రికం, నుదిటి మీద గీతలు చదవడం, వైద్యం, ఇంజినీరింగు, లా అండ్ ఆర్డర్, బస్కీలు తీయడం, కబడ్డీ, వాలీబాల్ అలా మీరేది చెప్పినా అందులో ఈయన నిష్ణాతుడని ఈయన స్వంత అభిప్రాయం. అక్కడతో పోతే బాగుణ్ణు కానీ ప్రజలందరూ ఈయన్ని చూసి, ఈయనకిన్ని కళలెలా వచ్చాయబ్బా అని ఏడ్చుకుంటున్నారనీ, కుళ్ళుకుంటున్నారనీ ఈయననుకుంటూ ఉంటాడు.”

నాకు నచ్చిన పద్యం: పండువెన్నెల పిండివంటలు! 0

మానవుని ఊహకి అంతేముంది. చకోరమనే పక్షి వెన్నెలని మాత్రమే తాగుతుందనీ, ఆ పక్షికి అదే ఆహారమనీ ఒక చిత్రమైన కల్పన చేశాడు. ఎవరు ఎప్పుడు చేశారో తెలియదు కానీ, అది కవుల కవిత్వానికి గొప్ప ముడిసరుకయ్యింది. వెన్నెలను వర్ణించే ప్రతిచోటా చకోరాల ప్రస్తావన తప్పనిసరి. ఆదికవి వాల్మీకితో మొదలుపెట్టి, ఇంచుమించుగా సంస్కృత కవులందరూ వెన్నెల గురించీ వెన్నెలపులుగుల గురించీ రకరకాల కల్పనలు చేసినవారే. మన తెలుగు కవులకి అదే ఒరవడి అయ్యింది.

సమూలాంధ్రపుష్పబాణవిలాసము 1

గ్రంథమును కవి శ్రీకారముతో గూడిన మగణముతో ఆరంభించినాడు. ఇట్టి ఆరంభము కవికిని, కావ్యపఠితల కును శుభప్రదమగుమని ఛందశ్శాస్త్రము. తరువాతి శ్లోకములో చెప్పినట్లుగా శృంగారరసప్రధానమైన కావ్యమును వ్రాయ సంకల్పించుచున్నాడు గనుక కవి గోపికాస్త్రీశృంగారచేష్టాయుతమైన మంగళశ్లోకముతో కావ్యారంభము చేసినాడు. గోపికాసాంగత్యముచే సంతుష్టుడైన శ్రీకృష్ణుడు కావ్యపఠితలను గూడ సంతుష్టులను జేయగలడని కవియొక్క ఆశయము.

ఏండ్రాయిడ్ మనిషి 0

గడప దగ్గర
వేగంగా
తలుపు మీద వరకూ
ఓ వెలుతురు నీడ వూగులాట!
నిలుస్తూ వూగుతూ
నిలకడ లేకుండా-

రెండు కవితలు 2

మెరుపులు
నల్ల చీరకి
​జరీ అంచులా ​
తార్రోడ్డుకి
అటూ ఇటూ పారే
​ఎర్ర ​
మట్టి నీళ్ళూ

ఫ్రాగ్మెంట్స్ 6

సరైన పదం కోసం
చీకట్లో తడుముకొంటూంటే
చేతికి సూర్యుని ముక్క తగిలింది
ఉదయం పద్యమై
విచ్చుకొంది

ఇంక పోతారనగాను 3

గుర్తు పెట్టుకుంటావని
మొట్టికాయలు మొట్టేను
అంతకంటే ఏం లేదు!

ఆకు 2

“పువ్వులాగా పుట్టకుండా
పండులాగా మారకుండా
ఆకులానే పుట్టినందుకు
ఆకు రూపం దాల్చినందుకు
ఎప్పుడైనా బాధ పడ్డావా?”

నా టేస్టులేనితనం 1

అక్కడకు ఎలా వెళ్లాలి? వెళ్లినా అసలు ఎలా అడగాలి? నేను ఏ పనిని కూడా అలా చేసేయలేను. దాని గురించి కొంత ఆలోచించాలి; మథనపడాలి; గింజుకోవాలి; అప్పటికి గానీ సంసిద్ధుణ్ని కాలేను. అందులో భాగమే ఆ మానసికపు కసరత్తంతా!

Yippee! I’m a poet, and I know it 6

డిలన్ పాటకుడా, కవా? 1996నుంచీ ప్రతి సంవత్సరం డిలన్‌ని నోబెల్ బహుమతికి నామినేట్ చెయ్యటం, దానితోపాటు ఈ ప్రశ్న ఉద్భవించటం ఆనవాయితీ అయ్యింది. డిలన్‌ని అడిగినప్పుడు ఏదయితే నేను పాడగలనో దానిని పాట అంటాను; ఏదయితే నేను పాడలేనో దానిని కవిత అంటాను, అన్నాడు.

వెణ్బా (ధవళగీతి) 1

తమిళములో పా అంటే పాట అని చెప్పవచ్చును. ప్రాచీన తమిళ ఛందస్సులో ప్రసిద్ధికెక్కిన ‘పా’ ఛందస్సులు – వెణ్బా, ఆశిరియప్పా, కలిప్పా, వాంజిప్పా, మరుట్పా.ఈ వ్యాసములో వెణ్బాగుఱించి మాత్రమే చర్చిస్తాను. వెణ్ అనగా తెలుపు అని, పా అనగా పాట అని అర్థము, కాబట్టి వెణ్బాను ధవళగీతి అని పిలువవచ్చును.

శ్రీనాథుని ఆంధ్రీకరణ సూత్రం: అర్థపరిశీలన 30

ఏల్చూరి మురళీధరరావు

ఆంధ్ర మహాకవులు సంస్కృతం నుంచి తెలుగులోకి కావ్యాన్ని పరివర్తించేటప్పుడు భాషాంతరీకరణంలో వారు అనుసరించిన శాస్త్రీయమార్గాలేమిటి? వారు చేసిన ప్రాతిపదిక కృషిస్వరూపం ఏమిటి? అందుకు మార్గదర్శకసూత్రాలు ఏమున్నాయి? అని వివరించినవారు లేరు. తెలుగులో ఆ ప్రకారం తన అనువాదసరణిని సవిస్తరంగా పేర్కొన్న ఒకే ఒక్క మహాకవి శ్రీనాథుడని ప్రసిద్ధి.

గడినుడి – 2 2

మొదటి గడి-నుడిని ఉత్సాహంగా ప్రయత్నించి ప్రోత్సహించిన పాఠకులందరికీ మా కృతజ్ఞతలు. ఈ నెల గడినుంచీ నియమాలు కొద్దిగా మారాయి. దయచేసి గమనించగలరు.

హృదయ కమలములను 0

హృదయ కమలములను ముకుళించి రహించిన పూజ
మీ పద సరోజములను నయన పంకజము లలర్చి రమణ యతి రాజ

దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి ప్రసంగం 1

పిచ్చయ్య శాస్త్రిగారు, గుర్రం జాషువాగారు ఇద్దరూ వినుకొండలో స్నేహితులు, కలిసి చదువుకున్నారు. ఇద్దరూ కలసి జంట కవులుగా రచనలు చేయాలనుకున్నారని అయితే వీళ్లిద్దరి పేర్లు కలవక విరమించుకొన్నారనే కథ ఒకటి ఉంది.