‘నాన్నగారూ, మిమ్మల్ని కదలొద్దని చెప్పాను. ఒక చోట కూర్చోండి నేను చెప్పేవరకు’ ఇందాకటి గొంతే. పెద్దవాళ్ళు ఉన్నట్టున్నారు. సాయం చేద్దామని ఉన్నా వాళ్ళకి చేసే ఓపికుండదు. కాళ్ళకి చేతులకి అడ్డంగా అనిపిస్తారు. ప్చ్! సాయంకాలం మా ఇంటికి పిలిచి కూర్చోపెట్టుకోవాలనుకున్నాను. ఇంతలో పెద్దగా ‘నాన్నగారూ!’ అన్న కేక వినిపించింది. పెద్దాయన్ని మరీ అంత ఘట్టిగా కోప్పడుతోంది. ఎంత తండ్రి అయినా పాపం కదూ! కూతురు కేకలకి బిక్కచచ్చిపోయుంటాడు.
అనూరాధ నాదెళ్ళ
- సొంత ఊరు
- విజయవాడ
- ప్రస్తుత నివాసం
- విజయవాడ
- వృత్తి
- వృత్తి కంటే ప్రవృత్తిగానే ప్రేమించే బోధన
జీవిత విశేషాలు
నా గురించి చెప్పాలంటే పుస్తకాలు, పిల్లలు, సంగీతం ఇష్టమైన విషయాలు. పిల్లల మీద ఉన్న ఇష్టం నన్ను ఎమ్మే,బియెడ్ చేయించి టీచర్ని చేసింది. గత ఏడు సంవత్సరాలుగా విజయవాడలో సామాజికంగా, ఆర్థికంగా వెనుకపడిన పిల్లలకోసం సాయంకాలం పాఠాలు చెబుతున్నాను. ఈ ప్రయాణం ఎన్నో పాఠాల్ని నేర్పుతోంది. నాకు ఎంతో సంతోషాన్నిస్తోంది. ప్రతిరోజూ ప్రపంచం కొత్తగా, ఆసక్తికరంగా కనిపిస్తూనే ఉంటుంది. దిగులు పుట్టిస్తూనూ ఉంటుంది.