ఖరీద్దారి ఫ్లోర్‌లో –
రంగుల కాంతులేవో కురుస్తున్నా
ముఖాలు తెలియని
అపరిచిత షేక్ హ్యాండ్‌లే
పాట కొదగని మ్యూజిక్ బీట్స్
శరీరాల మీద దరువులేస్తుంటది
దాసరాజు రామారావు
జీవిత విశేషాలు
దాసరాజు రామారావుగారికి శ్రీశ్రీ మహాప్రస్థానం, ఉన్నవ మాలపల్లి సాహిత్య అవసరం, అక్షరం విలువ నేర్పినయి. 45 ఏళ్ల సాహిత్య ప్రయాణంలో గోరుకొయ్యలు, పట్టుకుచ్చుల పువ్వు, విరమించని వాక్యం కవిత్వ సంపుటాలు వెలువడ్డాయి. ఉమ్మిడిశెట్టి, సమైక్య సాహితి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అవార్డులు అందుకున్నారు.
దాసరాజు రామారావు రచనలు
అగ్గిపెట్టెల్లోంచి ఎగిరిపోయి
బంతాకులు నెమరేస్తూ
కలల్ని వెదజల్లుతున్న బంగారిపురుగులు
హరివిల్లు లోంచి రంగులను తెచ్చి
పూలతోట కద్దుతున్న సీతాకోకలు
రాజుగారి వేషం తడిపి
బికారిగాడి దేహం తడిపి
ఒక ముద్దగా
ఒక్క తీరైన పులకరింతగా-
చిందిన చెమట చుక్క
శరీరాన్ని ముల్లె గట్టుకొని నిట్టనిలువునా మోస్తూ నడుస్తున్నానా నా ముందరి దారి ఒక మహావాక్యమై… సుదీర్ఘ చరణ ప్రవాహ చేతనోహల సమ్మేళనోత్సవ సంరంభం- ఈ […]