చిట్టత్తూరు మునిగోపాల్


సొంత ఊరు:
తిమ్మసముద్రం (శ్రీకాళహస్తి సమీపం, ఉమ్మడి చిత్తూరు జిల్లా)
ప్రస్తుత నివాసం:
కుప్పం, చిత్తూరు జిల్లా
వృత్తి:
జర్నలిజం
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

పుట్టింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి చిత్తూరు జిల్లా (ప్రస్తుతం: తిరుపతి జిల్లా), చదివింది శ్రీకాళహస్తి. ప్రస్తుత నివాసం చిత్తూరు జిల్లా కుప్పం. ఒక ప్రముఖ దినపత్రికలో విలేకరిత్వం. సాహిత్యమంటే మక్కువ ఎక్కువ. కథలు రాయడం ఈమధ్య మూడునాలుగేళ్లనుంచే. ఆంధ్రజ్యోతి, వార్త దినపత్రికల ఆదివారం ప్రత్యేక అనుబంధాలు, సారంగ, ఈమాట, నెచ్చెలి, సంచిక, కౌముది, గోతెలుగు. కామ్ వంటి ప్రముఖ వెబ్ పత్రికల్లో ఇప్పటిదాకా సుమారు 15 కథలదాకా ప్రచురితం.


 

రొండేళ్లగా నా బుర్రలో తిరగతా వుండాడు గూనోడు. వోణ్ణి కతగా మార్చాలని ఆరేడు నెల్లగా తపన పడతా వుండా. కుదరడం ల్యా. … అయినా నా పిచ్చిగానీ, వోడి బతుకులో కై గట్టాల్సినంత కతేడ వుండాది… దోసిడు కన్నీళ్ళు దప్ప!

“నీ పెళ్ళాం గురిచ్చి తెలుసునన్నావుగా సారూ.”
“ఎందుకు తెలీదు?”
“సరే ఒక ప్రశ్న అడగతా వుండాను చెప్పు. నీ పెళ్ళానికి ఇష్టమైన రంగేంది? ఈ ప్రశ్నకు జవాబు చెప్తే నిన్ను వొదిలేస్తాను.”

“ఈసారి ఆ మస్తానమ్మతో కానీ, ఈ లండీకొడుకుతో గానీ కనబడు చెప్తాను. చెవడాలు ఊడదీస్తా.” చేతిలోని కట్టిపుల్లను దూరంగా విసిరేసి. నేలమీద ఉంచిన బకెట్ ను తిరిగి చేతిలోకి తీసుకుంది తులశమ్మ.