అవ్యక్తాద్యత ఏతద్వ్యక్తం జాతమశేషమ్
యద్ధత్తే తదజస్రం యత్రాంతేలయమేతి
It is That
the formless
the inexpressible
the primordial vibration
the true form of Guru
కావ్యకంఠ గణపతిముని
జీవిత విశేషాలు
కావ్యకంఠ గణపతిమునిగా ప్రసిద్ధుడైన అయల సోమయాజుల గణపతిశాస్త్రి (1878-1936) తెలుగువాడే అయినా, తెలుగువాళ్ళకి ఈయన గురించి పెద్దగా తెలియదు. ఆయన తన జీవితకాలంలో సింహభాగం తమిళదేశంలోనూ, కన్నడదేశంలోనూ, కొంకణ ప్రాంతాలలోనూ ఎక్కువగా గడిపాడు. ఆయన రచనలన్నీ సంస్కృతంలోనే జరిగి, వాటిలో కొన్ని మాత్రమే తెలుగులో వచ్చాయి. 1900 సంవత్సరంలో, నవద్వీపంలో జరిగిన విద్వత్పరీక్షలలో పాల్గొని, అక్కడి వారందరినీ తన కవిత్వంతో, పాండిత్యంతో మెప్పించి కావ్యకంఠ బిరుదు పొందాడు. ఉమాసహస్రం, రమణగీత, ఇంద్రాణీ సప్తశతి, సద్దర్శనం మొదలైన కావ్యాలని రచించాడు.
కావ్యకంఠ గణపతిముని రచనలు
గణపతిముని విదేశీయుల పాలనలో కృశించిపోయిన భారతసమాజం మళ్ళీ పూర్వవైభవాన్ని సంతరించుకోవాలనే అకుంఠితమైన శ్రద్ధతో, వేదనతో తన తపఃజీవితాన్ని గడిపాడు. స్వతంత్రోద్యమంలో కొన్నాళ్ళు చురుగ్గా పాల్గొని, మద్రాస్ కాంగ్రెస్ సభలలో సభ్యుడిగా పాల్గొన్నాడు. గాంధీజీ హిందీ భాషోద్యమంతోనూ, హరిజనోద్యమంతోనూ ఆయనకి మౌలికమైన విభేదాలు రావడంతో, కాంగ్రెస్ నుంచీ తప్పుకోవాల్సి వచ్చింది.
ఆకాశమందలి యవిభక్త నాద
మాకారమైయెప్పు నక్షరమునకు
ఆనాదముగణేశు నాదిమమూర్తి
ధ్యానముచేయుట దానిని వినుట
శర్వుని పట్టిగా సత్యనాదమును
సర్వము తెలిసిన సజ్జనులనిరి