ఒకేపేరు పెట్టుకున్న వ్యక్తులెందరో ఉన్నా, వారందరిలో ఏ రకంగా ఒకే లక్షణాలు కనిపించవో అలాగే, ఈ కథనాలన్నింటికి రామాయణమని పేరు ఉన్నా వాటి లక్షణ స్వభావాలు వేరువేరని చెప్పవచ్చు.
ఎ. కె. రామానుజన్
జీవిత విశేషాలు
అత్తిపటే కృష్ణస్వామి రామానుజన్ (1929-1993)) కవి, భారతీయ సాహిత్యం, భాషాశాస్త్రంలో పండితుడే కాక జానపద రచయిత , అనువాదకులు, నాటక రచయిత కూడా. రామానుజన్ చికాగో విశ్వవిద్యాలయంలో భాషాశాస్త్ర ప్రొఫెసర్ గా పని చేశారు. మాక్ఆర్థర్ ఫెలోషిప్ , సాహిత్య అకాడమీ అవార్డు, పద్మశ్రీ అందుకున్నారు. కన్నడ జనరేటివ్ గ్రామర్ అన్న సిద్ధాంత వ్యాసం రచించారు.
ఆయన విద్యా పరిశోధన ఐదు భాషలలో విస్తరించింది: ఇంగ్లీష్, తమిళం, కన్నడ, తెలుగు, సంస్కృతం. ఆయన రచించిన కవితలు ఆశ్చర్యకరమైన వాస్తవికత, ఆధునికత, కళాత్మకతలుగల మార్మిక రచనలుగా గుర్తుండిపోతాయి. మరణానంతరం, 1999 లో ది కలెక్టెడ్ పోయెమ్స్ రచనకు సాహిత్య అకాడమీ అవార్డు లభించింది .