ఊర్మిళా పవార్
జీవిత విశేషాలు
మరాఠీ రచయిత్రి ఊర్మిళా పవార్. రచయిత్రిగా, దళిత స్త్రీగా తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, అనుభవాలు తన రచనలలో ప్రతిబింబిస్తుంటాయి. 1970లలో \’మైత్రిని, \’సంవాదిని\’ అనే సాహితీ మిత్రమండలితో కలిసి స్త్రీవాద సాహిత్య నిర్మాణాలు చేశారు. యాభయ్యోదశకం మొదలు నేటి దాకా సాంస్కృతిక నిర్మాణంలో ఉన్న దాదాపు యాబైమందికి పైగా స్త్రీల బతుకు చిత్రాలను మొదట మరాఠీలో, ఆ తర్వాత ఆంగ్లంలో వ్రాసిన \’వి ఆల్ మేడ్ హిస్టరీ\’ మేధావుల విమర్శకుల అభిమానాన్ని పొందింది. ప్రపంచ వ్యాప్తంగా అనేక విశ్వవిద్యాలయాలలో ఆమె ఆత్మకథ మీద చర్చలు, పరిశోధనలు జరుగుతున్నాయి.\’నేను సావిత్రి బాయిపూలే\’ నాటకాన్ని రాసి అందులో నటించిన ఆమె సాహిత్యం అనేక భాషల్లోకి అనువాదమైంది.