విహారి
జీవిత విశేషాలు
1941లో తెనాలిలో జన్మించారు. 14 కథాసంపుటాలు, 15 విమర్శనాత్మక వ్యాససంపుటాలు, 6 నవలలు, 5 కవితాసంపుటాలు ప్రచురించారు. 300 కథలకు పరిచయాలు, పరామర్శలు చేశారు. వివిధ పత్రికలలో శీర్షికలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమి పురస్కారంతో సహా అనేక పురస్కారాలు లభించాయి. ఎల్.ఐ.సి.లో జనరల్ మానేజర్గా పదవీవిరమణ చేసి హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు.