దాశరథి
జీవిత విశేషాలు
దాశరథిగా పేరు గాంచిన దాశరథి కృష్ణమాచార్యులు (1925 – 1987) తెలంగాణకు చెందిన కవి, రచయిత. నిజాం ప్రభువును ఎదిరిస్తూ రచనలు చేశారు. తెలంగాణ విముక్తి కోసం కృషి చేశారు. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని గర్వంగా ప్రకటించి తెలంగాణ ఉద్యమానికీ ప్రేరణనందించిన కవి దాశరథి. పలు సినిమాలకు గేయరచయితగా పనిచేశాడు. ప్రతి సంవత్సరం దాశరథి జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో సాహిత్యరంగంలో కృషిచేసినవారికి తెలంగాణా ప్రభుత్వం దాశరథి సాహితీ పురస్కారం అందజేస్తోంది.
జీవిత విశేషాలు