గోవిందరాజు చక్రధర్


సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
హైదరాబాద్
వృత్తి:
పాత్రికేయులు
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

సీనియర్ జర్నలిస్ట్, రచయిత గోవిందరాజు చక్రధర్. ప్లూరల్ పేజెస్ (Plural Pages) ‘మన మంచి పుస్తకం’ అన్న యూట్యూబ్ ఛానెల్లో తరచూ పుస్తకాలను పరిచయం చేస్తుంటారు. ఈనాడు పత్రికలో పనిచేశారు.


 

అది ఆరవయ్యో దశకం. నేను టీనేజర్ని, పిల్ల విద్యార్థినాయకుణ్ణి ప్లస్ కార్యకర్తని. నేను కృష్ణశాస్త్రి కవితలకీ బొలీవియన్ జంగిల్ వార్‌కీ టెట్ అఫెన్సివ్‌కీ బాపూ చిత్తప్రసాద్ బొమ్మలకీ పుట్టిన బిడ్డని. బయాఫ్రాలో చనిపోయిన బిడ్డల ఏడుపు నుంచీ మా పేటలో జూట్ కార్మికుల మురికి బ్రతుకులనుంచీ జామిని రాయ్, లాత్రెక్, ఇల్యా రెపిన్ పెయింటింగ్‌ల నుండీ పుట్టాను.