నేను, నువ్వు తలో చోటా నడుస్తుంటాం
నీ దారిలో నేనుంటానో లేనో
నా దారిలో, నాలో నీవుంటావు.
ఈ దేహంలో, ఇదే మనసుతో
బ్రతకలేక బ్రతుకుతూ నేను
నైరూప్య లోకంలో నీవు
నేనే నీ వైపు నడిచి వస్తున్న భ్రమలాంటి సత్యం.
కాళ్ళకూరి శైలజ
జీవిత విశేషాలు
డాక్టర్ కాళ్ళకూరి శైలజ తెలుగు సాహిత్యంలో విశేష ప్రతిభ కనబరుస్తున్న కవయిత్రి, కథా రచయిత్రి. 30 ఏళ్లకు పైగా వైద్యసేవలు అందిస్తూ, హోలిస్టిక్ హెల్త్‌ను ప్రచారం చేస్తున్నారు. ఆధునిక జీవనశైలి, మానవ సంబంధాలు, సామాజిక అంశాలపై కథలు, కవితలు రాస్తారు. మంచి ఆదరణ లభించిన కథాసంపుటి \’కొత్త తలుపు\’ కథాసంపుటితో సహా \’నేలపాట\’ (కవితా సంపుటి), \’డావో – సాగిపో… హాయిగా! వంటి గ్రంధాలు రచించారు. నిత్యం సామాజిక స్పృహతో కూడిన రచనలు చేస్తూ, తెలుగు సాహిత్యంలో చురుకైన రచయిత్రిగా కొనసాగుతున్నారు.