ఆర్. చూడామణి
జీవిత విశేషాలు
ప్రసిద్ధ తమిళ రచయిత్రి చూడామణి రాఘవన్ 1931లో జన్మించారు. తల్లి కనకవల్లి ప్రోద్బలంతో 1954లో వ్రాయడం మొదలుపెట్టిన ఆమె మొదటి కథ కావేరి 1957లో అచ్చయింది. ఆ యేడే ఆమెకి కలైమగల్ సిల్వర్ జుబిలీ అవార్డ్ దక్కింది. అనారోగ్యం వల్ల చదువు అర్థాంతరంగా ఆపేసిన చూడామణి, ఇంట్లోనే చదువుకుంటూ రచనా జీవనం కొనసాగించారు. ఐదు దశాబ్దాల సాహిత్య ప్రస్థానంలో ఆమె 600 కథలు 19 సంకలనాలుగా ప్రచురించబడినాయి, ఇతర భాషల్లోకి అనువదించబడ్డాయి. సామాన్యమైన జీవితాలలో సంఘటనలను అసామాన్యంగా చిత్రీకరించిన చూడామణి అక్టోబర్ 2010లో మరణించారు. C. S. లక్ష్మి సంకలనం ది ఫేస్ బిహైండ్ ది మాస్క్(1984) చూడామణికి అంకితం ఇవ్వబడింది.