అరాత్తు
జీవిత విశేషాలు
ఆర్. శ్రీనివాసన్, తమిళనాడులోని కడలూర్ జిల్లాలో చదువుకున్నారు. అరాత్తు అన్న పేరుతో 2010 నుండి సోషల్ మీడియాలో నేటితరం జీవితానికి అద్దంపట్టే విషయాలను తీసుకుని ప్రయోగాత్మకమైన మైక్రో కథలు, కవితలు రాయడం ద్వారా గుర్తింపు పొందారు. ప్రముఖ రచయితలు చారు నివేదితా, జయమోహన్, మనుష్య పుత్రన్ వంటివారి మెప్పు పొందారు. ఇప్పటివరకు మూడు నవలలు, మూడు కథల సంపుటాలు, ఒక బాలల కథల సంపుటి, వాహనాలకు సంబంధించిన వ్యాస సంపుటి, ఒక కవితా సంపుటి ప్రచురించారు. క్లుప్తంగా, సెటైరికల్‌గా రాయడం ఈయన శైలి. వీరి కథలన్నీ ఆధునిక యువత జీవితవిధానాల చుట్టూనే తిరుగుతాయి.