పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16635

  1. సాహిత్యచరిత్రలో అపూర్వమైన పర్యాయకావ్యం: గణపవరపు వేంకటకవి ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలాసము – 2. గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:

    07/15/2015 11:45 am

    మాన్యతములు శ్రీమాన్ ఎన్.ఎస్.మూర్తి గారికి
    నమస్కారములతో,

    వాత్సల్యౌదార్యాలు ఉట్టిపడుతున్న మీ ప్రోత్సాహకవాక్యంతో ప్రాణం లేచివచ్చినట్లయింది. మీకు ఆదృత్యాభిమానాలకు ధన్యవాదపరశ్శతం.

    యుష్మన్నిరంతరాశీరభ్యర్థి,
    ఏల్చూరి మురళీధరరావు

  2. ఆచార్య సుబ్బరామయ్య మీనాక్షిసుందరం గురించి వాసుదేవ రావు ఎరికలపూడి అభిప్రాయం:

    07/14/2015 5:44 pm

    ధన్యవాదాలు సాంబశివరావు గారూ! నేను 1968-70ల అప్లయిడ్ మాథ్ విద్యార్థిని. మీరు ఫిజిక్స్ విద్యార్థిగా ఉన్న రోజుల్లో మాథమాటికల్ ఫిజిక్స్ గా ఉన్న శాఖ 64 -66లలొ అనుకుంటాను అప్లయిడ్ మాథ్ గా మారి ఫిజిక్స్ నుంచి విడిపోయింది.

    వాసుదేవ రావు ఎరికలపూడి

  3. ఆచార్య సుబ్బరామయ్య మీనాక్షిసుందరం గురించి Kolli Sambasivarao . అభిప్రాయం:

    07/14/2015 4:08 pm

    1956-59 లో నేను ఫిసిక్స్ చదివాను. మీనాక్షిసుందరం గారు వార్దెన్. మారుతిరావు గారిని పనికిరావన్నది వెంకటరాయుడు గారే. క్లాసులొ తరచుగా మారుతిరావు గారిమీద విరుచుకుపడే వారు.

  4. తోపులో పిల్లలు గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:

    07/14/2015 8:56 am

    ఇంద్రాణి:

    నాకు కవితల గురించి ఎక్కువ తెలియదు. కానీ, “ఈమాట” లో మీ కవితలు చదువుతూ ఉంటాను. చదివినప్పుడల్లా ఏదో ఒక మంచి దృశ్యం కళ్ళకి కనపడినట్టు ఉంటాయి మీ కవితలు.

    అభినందనలతో,

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  5. ప్రధాన సంఖ్యలలో కవలలు గురించి Rao Vemuri అభిప్రాయం:

    07/13/2015 8:17 pm

    నేను రాసిన ప్రధాన (అభాజ్య) సంఖ్యల మీద వ్యాసం చదివి, తప్పులు ఎత్తి చూపిన వారందరికీ మరొకసారి నా ధన్యవాదాలు. నేను విద్యార్హిగా ఉన్న రోజులలో నా గురువుగారు “pay attention to the harshest reviews of your paper” అనేవారు. అందరు సూచించిన మార్పులు, చేర్పులు చేసి ఈ వ్యాసాన్ని తిరగ రాయవచ్చు. రాస్తాను. కాని ప్రస్తుతానికి కొట్టొచ్చినట్లు కనిపించే రెండు మూడు తప్పులని సరిదిద్ది సంప్రదించవలసిన మూలాలకి ఒక అంశాన్ని చేర్చుతున్నాను.

    1. ప్రధాన సంఖ్యలు అన్నీ బేసి సంఖ్యలు కావు. అలా రాయడం నా తొందరపాటే. “ప్రధాన సంఖ్యలు (2 ని మినహాయించి) అన్నీ బేసి సంఖ్యలే” అని ఉండాలి.

    2. sexy కి “లైంగిక” అన్న అనువాదం బాగు లేదని నేనే ఒప్పుకున్నాను. యదుకులభూషణ్ గారు దాని లేటిన్ మూలాన్ని సూచించిన తరువాత sexy primes ని “షష్ఠ్యంతరములు” అని తెలిగిస్తున్నాను.

    3. నేను వాడిన “కచిక ప్రధాన సంఖ్యలు” కి ప్రత్యామ్నాయాలు ఒకరిద్దరు సూచించేరు. ఈ “కచికలు” (palindromes) అన్న మాటని మొట్టమొదట 1985 లో గణితశాస్త్ర ఆచార్యులు శ్రీ ఉపాధ్యాయుల వేంకట సత్యనారాయణ గారు రాసిన ఒక వ్యాసంలో వాడేరు. ఆ వ్యాసాన్ని 1985 లో నా సంపాదకత్వంలో వెలువడిన తానా వారి సువనీర్ లో ప్రచురించేను. ఆ వ్యాసాన్ని ఈ జాబుకి జత చేసి పంపుతున్నాను.

    ఎవ్వరూ చదవరేమో అని భయపడుతూ తెలుగులో రాసిన ఇటువంటి వ్యాసాన్ని చదివి, సహృదయంతో స్పందించి, సలహాలు ఇచ్చిన వారందరికీ మరొకసారి ధన్యవాదాలు.

    – వేమూరి

  6. ప్రధాన సంఖ్యలలో కవలలు గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:

    07/13/2015 12:57 pm

    ఈ వ్యాసం పై వచ్చిన అభిప్రాయలపై వ్యాసకర్తగా వేమూరి వారి స్పందన తెలుకోవాలని నాకూ ఉంది. ఈలోగా, నా పరిశీలనలని అందరితో పంచుకోవాలని ఈ అభిప్రాయం రాస్తున్నా!

    1. పాప్యులర్ వ్యాసాలు రాయటంలో కొన్ని చిక్కులు ఉన్నాయని అనిపిస్తుంది నాకు. చెప్పే విషయం ఎంతవరకు చెప్పాలి, ఎక్కడ చెప్పడం ఆపెయ్యాలి అన్నది వ్యాసకర్త వితరణకి వొదిలెయ్యటం మంచిది. ఎందుకంటే, చెప్పే విషయంలోని లోతులు అందరి పాఠకులకీ అవగాహనకు రాకపోవచ్చు. పైగా కొందరికి విసుగు కూడా కలిగించవచ్చు. ఎంతో సమయం వెచ్చించి రచన చెసే రచయిత (త్రు) లకి అన్ని విషయాలు విశదీకరించే సమయం, ఓపిక, శక్తి ఉండకపోవచ్చు. స్థూలంగా, చెప్పే విషయంలోని వివరణ రచయిత (త్రు) లకి విడిచిపెట్టటం మంచిది అనిపిస్తుంది నాకు. సమర్ధులైన సమీక్షకులు రచన స్థాయిని పెంచటానికి ఎలాగూ తప్పకుండా ఉపయోగపడతారు కదా!

    2. ఈమాటలో వచ్చే రచనలు పాఠ్యపుస్తాకాల్లోని పాఠాలలాగ ప్రామాణికాలు కావు. కానక్కర లేదు! ఈమాటలో వచ్చే వ్యాసాలు, నా దృష్టిలో, పరిచయ వ్యాసాలు మాత్రమే! పాఠకుల అభిరుచి, ఇష్టం మొదలైన వాటిని బట్టి ఒక రచన చదివిన తరవాత పాఠకులే ఎమి చెయ్యాలనుకుంటారో నిర్ణయించుకుంటారు. నేను ‘ఈమాట ‘ లో సంగీతంపై పరిచయం వ్యాసాలు రాసినప్పుడు (ఎంతో మంది విజ్ఞులైన ఈమాట పాఠకులకి సంగీతంలో నాకన్నా ఎక్కువ పరిచయం ఉన్నది అన్న విషయం నాకు తెలుసు) చెప్పే విషయాన్ని పరిచయం చేసి ఊరుకోటం జరిగింది.

    3. తెలుగులో రాసేవారే తక్కువ. అందులో, ఈ వ్యాసంలో పరిచయం చేయబడ్డ విషయాల వంటి వస్తువులని తీసుకొని రాయబడ్ద వ్యాసాలని (‘ఈమాట ‘ పత్రికేకాకుండా మరెక్కడైనా ప్రచురించబడ్డ తెలుగు వ్యాసాలను) వేళ్ళమీద లెక్కించవచ్చు! అందువల్ల, ఇటువంటి వ్యాసాల్లో ఉన్న పొరపాట్లు (నాకు తెలిసినంతలో ఈ పొరపాట్లు ఘోరమైనవి కావు, పైగా, ఇవి రచయిత చెప్పదల్చుకున్న ముఖ్య విషయాన్ని పక్క దారి పట్టించే పొరపాట్లు కావు) ఎత్తి చూపేముందు జాగ్రత్తపడటం అవసరం. ఎందుకంటే, ఇటువంటి స్పందనలు రచయితకి నిరుత్సాహాన్నే కలిగించి, ముందు ముందు ఇటువంటి రచనలు రచించటానికి ప్రేరకాలు కాజాలవు.

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  7. ప్రధాన సంఖ్యలలో కవలలు గురించి K. Hanumantharao అభిప్రాయం:

    07/13/2015 9:08 am

    వేమూరి గారి వ్యాసం ప్రధాన సంఖ్యల గురించి తెలుసుకోవాలనే కుతూహలాన్ని రెట్టింపు చేసేదిగా ఉన్నా కొన్నిచోట్ల అసంతృప్తి కలిగించింది.

    “కాని ఎక్కడ చూసినా ఈ సగటు విలువ కంటె ఎక్కువ, తక్కువలు కనిపిస్తూనే ఉంటాయి…. కనుక ప్రధాన సంఖ్యల గురించి ఏది చెప్పినా ఆషామాషీగా చెబితే కుదరదు; కొంచెం తెలివితేటలతో చెప్పాలి.”

    ఇక్కడేదో ముఖ్యమైన విషయమున్నట్లుంది కాని అదేమిటో తెలియడం లేదు. సగటు కుటుంబ ఆదాయం N డాలర్లు అయితే, దాదాపు ఏ కుటుంబ ఆదాయాన్ని చూసినా అది సగటు కన్నా ఎక్కువ గానో తక్కువ గానో, కొన్ని సార్లు విపరీతమైన తేడాతో కూడా కనిపిస్తుంది గదా. ఆ సగటుకీ ఈ సగటుకీ తేడా ఏమిటి?

    ముఖ్య విషయాన్ని ప్రస్తావించిన రెండు పేరాలలోనూ ఇంగ్లీషులో చెప్పింది సరిగానే వున్నా తెలుగులో చెప్పింది కచ్చితంగా లేకపోవడాన తప్పుగా అర్థమొచ్చేటట్లుంది. (కామేశ్వరరావు గారి వ్యాఖ్య గందరగోళాన్ని తగ్గించడంలో సహాయపడింది.)

    “ఎంత దూరం వెళ్లినా ఆ ఖాళీ విలువ ఒక అవధి దాటకుండా పరిమితంగానే ఉంటుంది కాని ఎప్పటికీ అనంతం కాదు. ఇంకా నిర్ధిష్టంగా చెప్పాలంటే, ఆ పాతపు విలువ 70,000,000 దాటదు.”

    ఖాళీ పరిమితంగా ఉండే జంటలు అనంతంగా కనిపిస్తాయి కాని, ఖాళీ ఎప్పుడూ ఓ అవధిని దాటదనడం తప్పు.

    “ప్రధాన సంఖ్యల మధ్య వచ్చే ఖాళీకి ఒక కనిష్ఠ ఊర్ధ్వ అవధి (least upper bound) ఉందిట. అది 70,000,000 కంటె ఖచ్చితంగా తక్కువేనట.”

    జంటల మధ్య ఖాళీకి ఊర్ధ్వ అవధి లేదు. మీరు ఎంత ఖాళీ ఇచ్చినా అంతకన్నా ఎక్కువ ఖాళీ ఉన్న జంట సంఖ్యలున్నాయని (gap can be arbitrarily large) సులభంగా చూపెట్టవచ్చు. అక్కడ ఇచ్చిన సమీకరణం చెప్పేది greatest lower bound (infimum) <70M, అని not least upper bound.

    ఈటాంగ్ జాంగ్ ఎలా నిరూపించాడన్నది చాలా ముఖ్యం కాని వేమూరి వ్యాసం అందు గురించి కాస్తయినా చెప్పలేదు. Erica Klarreich “Unheralded Mathematician Bridges the Prime Gap” లో అసలెలా నిరూపించాడో కొంతవరకైనా వివరించి ఆసక్తి పెంచింది. ఈ విషయంపై వచ్చిన పాపులర్ సైన్సు వ్యాసాల్లో కెల్లా అది చాలా మెరుగైనది. వేమూరి ఆవిడే రాసిన మరో వ్యాసాన్ని ప్రస్తావించారు కాని అది N కన్నా చిన్నవైన ప్రధాన సంఖ్యల మధ్య ఖాళీ ఎంత పెద్దదిగా ఉండవచ్చు అనే దాని మీద.

    పరిమితమైన ఖాళీతో అనంతమైన జంటలు లేకపోతే ఆశ్చర్యపడాలి కాని ఉంటే కాదు, అంటూ వివరించిన ప్రొఫెసర్ Jordan Ellenberg (UW at Madison) వ్యాసం “The Beauty of Bounded Gaps” చదవదగ్గది.

    కొడవళ్ళ హనుమంతరావు

  8. పుల్లెల శ్రీరామచంద్రుడు గురించి రాజన్ అభిప్రాయం:

    07/13/2015 6:41 am

    పుల్లెల శ్రీరామచంద్రుడు గారి రచనలన్నింటినీ kinige.com ద్వారా తెలుగువారందరికీ అందుబాటులోకి తీసుకురావాలన్నది మా కోరిక.

    ఇప్పటికే, మహాభారతసారసంగ్రహము, భరతముని ప్రణీతం నాట్యశాస్త్రమ్, శ్రీమద్రామాయణామృతతరంగిణిలో మనోభావ లహరీ విలాసాలు, kinige.comలో eBooks మరియు print booksగా తీసుకువచ్చాం. 24000 శ్లోకాలకు అర్థతాత్పర్యాలుతో వారు మనకు అందించిన వాల్మీకి రామాయణంతో పాటు వారి మిగిలిన రచనలను కూడా త్వరలోనే అందరికీ మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం.

  9. కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 4: బూల్ ఆలోచనా సూత్రాలు గురించి shivakrishna dasi అభిప్రాయం:

    07/13/2015 6:26 am

    చాల ధన్యవాదములు మంచి వ్యాసం అందచెసినందులకు. చాల ఉత్సాహన్ని కలిగించెవిదంగ మధురంగ మరియు ఆసక్తిని రెకెత్తించెవిదంగ పొందుపరిచారు. ఇలాంతి వ్యాసాలు విధ్యార్థులకు చాల ప్రేరాణను కలిగిస్తాయి.

  10. జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 4 గురించి nagamurali అభిప్రాయం:

    07/13/2015 1:28 am

    Srinivas gaaru,

    Please email to me: vadavalli _ nm at yahoo.com
    I will send you the email id of Martin.

    Regards,
    Naga Murali