పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16635

  1. నిర్వికల్ప సంగీతం (1987): సహృదయుని సాహితీ ప్రస్థాన ప్రారంభం గురించి Vasu (Srinivasa Nyayapati) అభిప్రాయం:

    05/02/2017 10:54 am

    I thank all.

    -Vasu-

  2. నిర్వికల్ప సంగీతం (1987): సహృదయుని సాహితీ ప్రస్థాన ప్రారంభం గురించి Lokesh అభిప్రాయం:

    05/02/2017 8:54 am

    అద్భుతమైన కవిత్వం. ధన్యవాదాలు.

  3. ఒక పాట – రెండు బాణీలు గురించి SeelaSubhadradevi అభిప్రాయం:

    05/02/2017 8:38 am

    మీ ఒకే పాట రెండు బాణీలు విన్నాను. మొదటిది నా దగ్గర మరో గాయని పాడిన మరో బాణీలో కూడా ఉంది. ఐదవ పాట మరో గాయని శ్రీరంగం గోపాలరత్నంగారు రాగమాలికలో పాడిన పాట. రెండవ పాట ఎందువలనో ఓపెన్ కాలేదు. ఇంత మంచి పోస్ట్ పెట్టినందుకు మీకు ధన్యవాదాలు, పరుచూరి శ్రీనివాస్ గారు.

  4. అదీ నేనే… గురించి T V Sharma అభిప్రాయం:

    05/02/2017 4:44 am

    ఇదొక narcsisstic poem..

  5. సరస్సు నవ్వు గురించి T V Sharma అభిప్రాయం:

    05/02/2017 4:27 am

    సరస్సు నవ్వు ఒకానొక నిచ్చల నిచ్చింత స్వప్న కిలికించితాలకి తార్కాణం.
    సరస్సు నిలవనీటికీ ప్రవాహరాహిత్యానికీ నిదర్శనం. నిచ్చలత్వాన్ని నిద్రతో పోల్చడం కవితాత్మకమైనా ఈ కవిత అందించే శూన్య తాదామ్యత ఎవరికీ సుబోధకం కాదు సుమా!

    సరస్సు ప్రవహించదు, సముద్రమూ ప్రవహించదు.. కానీ సముద్రానికీ సరస్సుకీ అసలు పోలికెక్కడుందీ? సరస్సులోనే గిలకొట్టేవాళ్ళు సముద్రాన్ని తలచడం సాధ్యం కాదు గాక కాదు. అందుకే మీ మీ మనఃసరస్సులలోనే మనోవాంచితాలను సాధించుకోండి సలక్షణంగా!

  6. నాకు నచ్చిన పద్యం: అశ్వంగా మారిన అప్సరస గురించి ఇమ్మడిశెట్టి ఉమాకాంత రావు అభిప్రాయం:

    05/02/2017 3:30 am

    భైరవభట్ల కామేశ్వర రావు గార్కి,

    ప్రణామములు.

    చరిగొండ ధర్మన్న గారి చిత్రభారతం లోని మీకు నచ్చిన పద్య వివరణ బాగుంది అంటే చాలా చిన్న మాటే. అసలు సాంబ్రాణి తేజి అనడమే చాలా గొప్ప కవి ఊహ. ఇప్పటి కవులకు ఇది అందే అవకాశమే లేదనడం అతిశయోక్తి కాదు.

    తర్వాత, చతురంబోధిపరీత భూవలయ రక్షాదక్ష చామీకర పద్యంప్రారంభ పాదం సత్య హరిచ్చంద్ర పద్య నాటకంలో కనిపిస్తున్నది. చరిగొండ ధర్మన్న ప్రభావం బలిజేపల్లిపై కూడా ఉందన్న సత్యాన్ని ఎరుక పరుస్తున్నది కదా!

    పద్యాల సొబగులను వివరిస్తున్నందుకు ధన్యవాదములు.

  7. నిర్వికల్ప సంగీతం (1987): సహృదయుని సాహితీ ప్రస్థాన ప్రారంభం గురించి సుందరం అభిప్రాయం:

    05/02/2017 1:29 am

    “ఒక నిర్ధూమ సజీవాగ్ని శైలహస్తాల్లో
    నా కవిత్వాన్నుంచి బెరుగ్గా ఎదుట నిల్చున్నాను
    చిన్ని గడ్డిపోచ
    వసంత స్పర్శ తననెట్లా తలమున్కలు చేసిందీ
    వచ్చీరాని భాషలో చెప్తే ఎవరికర్థమవుతుంది
    ఒక్క దండకారణ్య సాలవృక్ష సమూహాలకు తప్ప”
    ఎంత ‘ఎదిగినా’ ఇంతకంటే “ఒదిగి” వుండటం మరొకరికి సాధ్యమా!
    ఒక్క భద్రుడి గారికి తప్ప

    “మహానగరాల్లో తను ఏకాకేమో గానీ ఆ శరభవరం పక్కనున్న అడవిలో ఆ జాతర్ల గుంపులో భద్రుడు ఎప్పుడూ ఏకాకి కాడు. అక్కడెక్కడ తనని మనం వదలిపెట్టినా చక్కగా గోధూళివేళకి ఇల్లు చేరుకోగలడు.”
    మీ ఇద్దరి సాహితీ సాన్నిహిత్యానికి ఇంక వేరే ఋజువులెందుకు?

  8. అదీ నేనే… గురించి Suparna mahi అభిప్రాయం:

    05/02/2017 1:24 am

    చాల చక్కని పోయెమ్. అభినందనలు.

  9. నిర్వికల్ప సంగీతం (1987): సహృదయుని సాహితీ ప్రస్థాన ప్రారంభం గురించి renuka ayola అభిప్రాయం:

    05/02/2017 12:26 am

    ఆద్భుతమైన సమీక్ష వీరభద్రుడి గారి కవిత్వంలా ….

  10. నిర్వికల్ప సంగీతం (1987): సహృదయుని సాహితీ ప్రస్థాన ప్రారంభం గురించి Swathi Yakasiri అభిప్రాయం:

    05/01/2017 11:27 pm

    వారి కవిత్వానికి తగిన అద్భుతమైన సమీక్ష!