పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16635

  1. అదీ నేనే… గురించి స్వాతి యాకసిరి అభిప్రాయం:

    05/03/2017 6:43 pm

    T V Sharma గారు,
    narcsisstic poetry గురించి నాకు సరియైన అవగాహన లేదు. మీ కామెంట్ కి ధన్యవాదాలు!

  2. అదీ నేనే… గురించి స్వాతి యాకసిరి అభిప్రాయం:

    05/03/2017 6:41 pm

    సుపర్ణ మహి థాంక్ యూ సో మచ్!

  3. గడి-నుడి 6 సమాధానాలు గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    05/03/2017 2:18 pm

    రవిచంద్ర
    పుల్ల + కూర = పుల్ల కూర అనేది కలిసిన పదమే కావొచ్చు కానీ తెలుగు సంస్కృత సంధులలో ఎందులోకి వస్తుందో? అందువల్ల పుల్లగూర అనే పదం రావడానికి అవకాశం లేదు. “పుల్లకూర” అనేదే సరైనది. ఓ విధంగా చెప్పాలంటే ఈ కింద ఉదాహరణ వాడుకోవచ్చు

    సరళాదేశ సంధి: ద్రుత ప్రకృతికము మీది పరుషములకు సరళములగు.
    ఉదా: పూచెను+కలువలు=పూచెనుగలువలు

    ఈ ఉదాహరణలో పులిసెను + కూర = పులిసెనుగూర :-). అంతేగానీ పుల్లగూర అనడం కుదరదు.

    ఇక్కడ చూడండి.

    https://te.wikipedia.org/wiki/%E0%B0%B8%E0%B0%82%E0%B0%A7%E0%B0%BF

  4. గడి-నుడి 6 సమాధానాలు గురించి Ravichandra Enaganti అభిప్రాయం:

    05/03/2017 8:15 am

    పొరుగింటి పుల్లకూర రుచి
    పొరుగింటి పుల్లగూర రుచి
    ఈ రెండూ సరైనవేనా లేకా మొదటిదే సరైందా?

  5. సగమే పూర్తయిన ఓ కవిత గురించి VVLNSPRASAD అభిప్రాయం:

    05/03/2017 6:33 am

    hello విజయ్, బుంగ మూతి బుజ్జి తల్లి, గుచ్చు కొని గుచ్చు కో కుండా ఉండే నీవు కురిపించినమౌనమొ, మాటలో కన్నీరో నవ్వులో అలికిడి చేస్తున్న “సగమే పూర్తయిన ఓ కవిత” ADBHUTHAHA——PRASAD

  6. నాకు నచ్చిన పద్యం: అశ్వంగా మారిన అప్సరస గురించి kalluri bhaskaram అభిప్రాయం:

    05/02/2017 11:22 pm

    ‘చతురంబోధిపరీత భూవలయమున్’ అనే మాటలతో ప్రారంభమయ్యే నన్నయగారి పద్యం, మహాభారతం, ఆదిపర్వం, తృతీయాశ్వాసంలో ఉంది. పూర్తి పద్యం ఇదీ:

    చతురంబోధిపరీత భూవలయమున్ సద్వీప సారణ్య స
    క్షితిభృత్కంబగుదాని భూరిభుజశక్తిం జేసి పాలించుచున్
    గ్రతువుల్ నూరొనరించి కీర్తి వెలయంగా దిక్కులన్ నిర్జితా
    హితుడై యా నహుషుండు దా బడసె దేవేంద్రత్వమున్ బేర్మితోన్

  7. సరస్సు నవ్వు గురించి పుట్టపర్తి నాగపద్మిని అభిప్రాయం:

    05/02/2017 6:17 pm

    పరమాద్భుత భావచిత్రం !!!

  8. సరస్సు నవ్వు గురించి అశితకేశ్‍ అభిప్రాయం:

    05/02/2017 4:12 pm

    పద్యం బాగుంది. అంతరంగంలోని మాట ఎప్పటికీ చెప్పలేం.చెప్పలేక నవ్వుకోడమో ఏడ్చుకోడమో చేస్తాం. కవులు కూడా అదే చేస్తారేమో. ఈ వ్యాఖ్య రాసేప్పుడు పైన‍ శర్మ గారి కామెంటు చదివాను. కవితలో లేని సముద్రాలెందుకు ఇక్కడ? రచనలో వున్నవి వదిలేసి, లేనివి తెచ్చిపెట్టడం మంచి విమర్శ కాదేమో.

  9. నాకు నచ్చిన పద్యం: అశ్వంగా మారిన అప్సరస గురించి విజయ సారధి అభిప్రాయం:

    05/02/2017 1:26 pm

    భైరవభట్ల కామేశ్వర రావు, ధన్యవాదాలండీ.. ఇంతకు మునుపు ఎప్పుడు వినని ఇటువంటి కావ్యాలని.. వాటిలో పద్యాలనీ వివరిస్తూ మాకు పద్య సాహిత్యం మీద ఆసక్తి పెంచుతున్నారు.. మీరు చేస్తున్న సేవ ఎనలేనిది.

  10. ఛాయామాయావి: మార్కస్ బార్ట్‌లీ గురించి విజయ్ కోగంటి అభిప్రాయం:

    05/02/2017 10:54 am

    సోదాహరణంగా వుండి అనేక విషయాలను తెలియచేసింది. అభినందనలు.