వేలూరి గారు నవ్వెయ్య గలరనే ఉద్దేశంతో, వారి అనుమతిలేకుండా వారి కథకి చిన్న పొడిగింపు.
రవి.
“అని అన్నాడు చెన్నయ్య చిరునవ్వు నవ్వుతూ, చినభూషయ్య బుజంతడుతూ!”
డేగా చెన్నయ్యతోపాటే వొచ్చి, అప్పటినుంచీ నోరెత్తకుండా ఈ మాటలన్నీ ఇంటున్న కండసీవమ్మ చెన్నయ్య సలా ఇని కళ్ళు చిట్లిస్తా లేసి నిలబడింది. ఎక్కడో నక్కలు ఊళలేసిన శబ్ధవొచ్చింది (మనలో మాట అది నక్కల ఊళ కాదని, మిస్సైల్ సైలో నించొచ్చే ఈలని, కండమ్మ లేసినా కూర్చున్నా భూమండలంలో ఎక్కడో ఒకదగ్గర కనీసం నలుగురన్నా పెభువు దగ్గరకెల్తారని, కండమ్మ సావాసగాళ్ళకి సావాసగాడొకాయన ఆ మధ్య వొక మందు పారిటీలో రకశ్యంగా చెప్పి, భక్తిగా నవ్వేడు). లేచి నించున్న కండసీవమ్మ, చిన బూసయ్యని, డేగా చెన్నయ్యని వొకసారి భక్తిగా చూసి ఇట్టా సెప్పింది.
మన పెదరాజు చిన బూసయ్యా, చిన రాజు డేగా చెన్నయ్యా ఏది సెప్పినా సక్కగా సెప్తారు, ఏది సేసినా నిస్సర్ధంగా మనకోసవే సేస్తారు. ఐతే ఇప్పుడు సెప్పిన ఇసయంలో మాత్రం సిన్న సిక్కుంది. అసల మనవేందుకు ఆ ఆగ్నేయమూక మీదకి దాడి సెసేవో మరసిపోయ్యారు. మనకి గుగ్గిళ్ళకోసవైతే ఆ మూక మనకి గుగ్గిళ్ళు అమ్మతానే వుండేరు కదా. వాళ్ళమ్మలేదని, మనకు గుగ్గిళ్ళు దొరక్క కాదు కదా మనం ఆ మూకమీదికి పోయింది. ఆ దేశంలో గుగ్గిళ్ల పంటమీద మనోళ్ల పెత్తనం లేదనికదా మనం బాద పడింది. ఆ పెత్తనవే మనోళ్ళకుంటే ఆ లాబాలేయో మనోళ్ళే తింటారని కదా మనవీ పెంటనెత్తికెత్తుకుంది. ఎంతమంది పెజలు సచ్చినా, ఎంత పెజాదనం కరుసయినా మనోళ్లబాగుకోసవే కదా మనవింత కాలం పాటుపడింది. ఇప్పుడు మీరు మల్లా ఆ సావనసాయోల్లమీదకి పోదావంటున్నారు. ఎందుకు, వాల్ల గుగ్గిళ్ళు మనయే కదా. వాళ్ళ రాజు మన్ను ముకుడు మన సెంసానే కదా. ఇంకా మనోళ్లనమీద నన్నా ఎప్పుడన్నా వనుమానం వస్తదేవో గానీ, మన్ను ముకుడు, మన అతివీర, పరమవీర, మహావీర పేమికుడు కదా. మనం కూసో అంటె కూసోని, నిలూ అంటే నిలిసేటోడు కదా. ఆడ యాపారాలన్నీ కోంచేం, కోంచెంగా అన్నీ మనోళ్ళ సేతుల్లోకే కదా వస్తున్నాయ్. ఆడ వాళ్ల నీళ్ళు వాళ్ళకే ఎయ్యో, రెండేలో పెరశెంతు నాబానికి వాళ్ళకే అమ్ముతుంటే నోరు మూసుకోని కోంటున్నారు కదా. రేపు వాళ్ళ బియ్యం, వాళ్ళ ఉప్పు, వాళ్ళకి మన గోడమారుటోడే కదా అమ్మాబొయ్యేది. వాళ్ల పిలగోళ్ళకి సోపులు, వాళ్ళాడోళ్ళకి సోకులూ, వాళ్ళకి సదువులూ, సట్టుబండలూ, వాల్లేసుకోడానికి గుడ్డలూ, వాల్లు తిరగడానికి జటకా బళ్ళు, డబ్బున్నోళ్ళకి సిన్న గుర్రాలూ, పెద్ద గుర్రాలూ, ఒకటేంది, అన్నీ మనోల్లే కదా అమ్మబొయ్యేది. ఆ లాబాలన్నీ మనకే కదా రాబొయ్యేది. ఈ రోజు కాకపోతే, రేపైనా ఆడ గుగ్గిళ్లమీద పెత్తనం కూడా మనోల్లదే కదా అవబొయ్యేది. అందు కని వాల్ల నెత్తిన బాంబెయ్యటం కాదు పరిస్కారం. వాల్ల యాపారవంతా మనోల్ల పెత్తనం కిందకు రావటవే ముక్కెం.
నోట్లోకి ఈగ దూరిన సంగతి కూడా గమనించకుండా ఇంటున్నాడు చెన్నయ్య. చిన బూసయ్య కి ఇట్టాటి ఇసయాలేవీ బుర్రలోకి దూరవు. అందుకని ఈలోపు కళ్ళు తెరుసుకునే వొక సిన్న నిద్రేశాడు. సంగత్తెలిసిన కండమ్మ చెన్నయ్యని చూస్తా మల్లా ఇట్టా మాట్టాడసాగింది.
ఈరోజు మన్ను ముకుడున్నాడు ఈడు మనోడే, ఐతే రేపే ముకుడొస్తాడో ఏందో అని బాద పడబళ్ళే. ఏ ముకుడొచ్చినా, మూడు రంగుల ముకుడో, కాసాయం ముకుడో కదా వస్తారు. ఈళ్ళింతకుముందు వచ్చినోల్లే కదా. మనకు కావాల్సినోల్లే కదా. వొక వేల కోంపతీసి ఎర్ర ముకుడోచ్చినా బయపడబల్లే. మనవాల్రెడీ పసుప్పచ్చోల్ల ఇలాకాలో ఈ ఎర్రోల్లని మేనేజ్ సెయ్యటం నేర్చుకున్నం కదా. ఎవడోచ్చినా పీకేదేంలేదు. ఎవరికి కావాల్సింది, రావాల్సిందీ వాల్లకి పడేస్తాం. మనవే అంత సోర్దపరులం కాదు. “గోబరైజేసన్” కోంచెం జోరుగా నడిపిస్తే పోయే. ఎట్టా మన ఓలుడు బేంకీ, ఐ.ఎమ్.ఎఫ్ఫూ నాలుగు అప్పులుఇచ్చి, తలుపులన్నీ బార్లా తెరిపించేస్తున్నారు కదా. డాలరు నోటుతో పొయ్యెదానికి, బాంబులకి పోయ్యి జోబీలో డబ్బు కరుసు సేసుకోవడవేందుకు తీరి కూసోని. కాకపోతే ఏ ముకవోడైనా ఐదేళ్లకోక సారి, ఎలచ్చన్ల ముందు ఏదో పేదోల్లని పేమిస్తావని అడావుడు చేస్తారు. మన గురించి ఏయో కూతలు కూస్తారు. ఐనా పెభువే చెప్పేడు కదా పేదోల్లని పేమించమని, అందుకనే ఐదేల్లకొకసారి వాల్లతోపాటూ మనం కూడా పేదోల్లని పేమిస్తే సరిపోయే. ఆ నాలుగు రోజులూ, ఆ నాలుక్కూతలు పట్టించుకోక పోతే మల్లా ఇంకో ఐదేల్లూ మన రాజ్జివే. రాజు మనం కాకపోయినా రాజ్జం మందే. ఏవంటారు పెద రాజు గారూ? అని కూరుసుంది కండసీవమ్మ.
వులిక్కి పడి నిదర లేసిన పెద రాజు సిన బూసయ్య, మామూలుగానే సిన రాజు డేగా చెన్నయ్య ముఖారవిందం వైపు చూశాడు. కండ చెప్పింది సబబుగానే వుంది అన్నాడు చెన్నయ్య. ఈ నిద్ర ఆపుకోలేకుండా వచ్చి పడింది, ఏం చెప్పిందో ఏందో ఈ కండమ్మ, ఖర్మ. సరేలే ఏం చెప్పినా మన బుర్రకెట్లాగా ఎక్కదు కదా, అందులోనూ చెన్నయ్య కూడా బాగుందన్నడు అనుకున్న పెద రాజు చిన బూసయ్య, సరే నాక్కూడా అలాగే అనిపించింది, ఆ విధంగానే ముందుకు పోతాం అన్నాడు.
బట్టతల పోవడం/రాకుండా ఉండటం ఎలా అని ఆ మధ్యొక టివీ వారు కార్యక్రమం ఏర్పాటు చేసారు (నాకు బట్టతల లేదు కానీ ఆ కార్యక్రమం నేను చూసేను). అందులో ఆ సలహాలు చెప్పేవాడికి ఉన్నది బట్టతల.
మీ వ్యాసం మీరే సంగ్రహించి చెప్పటం కొంతవరకూ అలాగే ఉంది 😉
నా కవితపై తమ అభిప్రాయం తెలిపిన సాయిలక్ష్మి,పద్మజ గార్లకు ధన్యవాదాలు.
లక్ష్మి గారూ, “ఏటవాలుగా విరిసిన ఇంద్రధనుస్సు ” తుషార కన్నీటి భావ బిందువా అన్న మీ ప్రశ్నచాలా అందమైన స్పందన.ఆ భావన తాలూకు క్రెడిట్ పూర్తిగా మీదే.
“ఒక కవిత కవికి “ఒక్క” కవితే కానీ అది పాఠకులకు అనేక కవితలుగా ఆవిష్కరింప బడుతుంది “,అంటూ ఉండేవారు మా నాన్న గారు. ఇది కవిత్వానికి ఉన్న universality కి,రసజ్ఞులైన పాఠకుల స్పందనా శక్తికి సంబంధించిన విషయమేమో అనిపిస్తుంది. ఒక కవితలో ఉన్న నిర్దేశిత భావాన్ని అంటిపెట్టుకుని ఉండటానికి ఆస్కారం ఉన్న అనేక సంబంధిత భావనల్ని పాఠకులు చూడగలుగుతారు. ఒక సాధారణ అనుభవం,కవి వైయుక్తిక అనుభూతిగా కవిత్వీకరణ చెందినపుడు,అదే అనుభవం పాఠకుల వైయుక్తిక అనుభూతిలోకి ఒక కొత్త కోణం లో transfer అవటం కారణం కావచ్చు కూడా.
మోహనరావుగారు ఉదహరించిన రెండుపాటలూ, ఇతరగీతాలూ (వెన్నెలరేయి ఎంతో చలిచలి వగైరాలు) అన్నీ కళావతి (వలజి)లో అక్కడక్కడా రిషభం తగిలించినవే. దీనికి విద్వాంసులు (తామే సృష్టించినట్టుగా) రకరకాల పేర్లు పెట్టారు. రవిశంకర్ (జనసమ్మోహిని), విలాయత్ ఖాన్ (కలావంతీ లేక శంకర్ కల్యాణ్), బడేగులాం (కున్హేరీ కల్యాణ్), బాలమురళీకృష్ణ (నర్తకి) అన్నారు. ఏ కల్తీలూ లేకుండా స గ2 ప ద2 ని1 అనే కలావతీయే అన్నిటికన్నా నాకిష్టం.
“20. వసంతగాలికి… (కర్ణ?)” అని రాశారు. ప్రశ్నార్థకం కరెక్టే అనుకుటాను. “వసంతగాలికి” అనే పాట బాలమురళీకృష్ణ గారూ, జానకి గారూ కలిసి, “శ్రీకాకుళ ఆంధ్ర మహా విష్ణు కధ” అనే సినిమాలో పాడారని నా గాఢ నమ్మకం.
ప్రసాద్
గుర్రాలు – గుగ్గిళ్ళు, మరో సారి… గురించి రవికిరణ్ తిమ్మిరెడ్డి గారి అభిప్రాయం:
05/02/2008 1:58 pm

3వ కాలిఫోర్నియా సాహితీ సదస్సు – ఒక పరిచయం గురించి Srini Chimata గారి అభిప్రాయం:
05/02/2008 1:52 pm
బ్రహ్మానందం గారు,
వ్యాసం చాలా బాగుంది. తెలుగు సాహిత్యమ్ పట్ల మీకున్న తపనకు నా జోహార్లు.
శ్రీనివాసరావు చిమట
http://www.ChimataMusic.com
గ్రంథచౌర్యం గురించి … గురించి Gulti reader గారి అభిప్రాయం:
05/02/2008 8:55 am
బట్టతల పోవడం/రాకుండా ఉండటం ఎలా అని ఆ మధ్యొక టివీ వారు కార్యక్రమం ఏర్పాటు చేసారు (నాకు బట్టతల లేదు కానీ ఆ కార్యక్రమం నేను చూసేను). అందులో ఆ సలహాలు చెప్పేవాడికి ఉన్నది బట్టతల.
మీ వ్యాసం మీరే సంగ్రహించి చెప్పటం కొంతవరకూ అలాగే ఉంది 😉
నిశ్శబ్దం నీకూ నాకూ మధ్య గురించి Vaidehi Sasidhar గారి అభిప్రాయం:
05/02/2008 6:52 am
నా కవితపై తమ అభిప్రాయం తెలిపిన సాయిలక్ష్మి,పద్మజ గార్లకు ధన్యవాదాలు.
లక్ష్మి గారూ, “ఏటవాలుగా విరిసిన ఇంద్రధనుస్సు ” తుషార కన్నీటి భావ బిందువా అన్న మీ ప్రశ్నచాలా అందమైన స్పందన.ఆ భావన తాలూకు క్రెడిట్ పూర్తిగా మీదే.
“ఒక కవిత కవికి “ఒక్క” కవితే కానీ అది పాఠకులకు అనేక కవితలుగా ఆవిష్కరింప బడుతుంది “,అంటూ ఉండేవారు మా నాన్న గారు. ఇది కవిత్వానికి ఉన్న universality కి,రసజ్ఞులైన పాఠకుల స్పందనా శక్తికి సంబంధించిన విషయమేమో అనిపిస్తుంది. ఒక కవితలో ఉన్న నిర్దేశిత భావాన్ని అంటిపెట్టుకుని ఉండటానికి ఆస్కారం ఉన్న అనేక సంబంధిత భావనల్ని పాఠకులు చూడగలుగుతారు. ఒక సాధారణ అనుభవం,కవి వైయుక్తిక అనుభూతిగా కవిత్వీకరణ చెందినపుడు,అదే అనుభవం పాఠకుల వైయుక్తిక అనుభూతిలోకి ఒక కొత్త కోణం లో transfer అవటం కారణం కావచ్చు కూడా.
అభిప్రాయాలు తెలిపి ప్రోత్సహించిన పాఠకులందరికీ కృతజ్ఞతలు.
వైదేహి శశిధర్.
రాగలహరి: చక్రవాకం, మలయమారుతం, కళావతి గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న గారి అభిప్రాయం:
05/02/2008 5:16 am
జెయుబివి:
మీరు చెప్పిన రెండు కరెక్షన్సు సరైనవే!
లక్ష్మన్న
రాగలహరి: చక్రవాకం, మలయమారుతం, కళావతి గురించి Rohiniprasad గారి అభిప్రాయం:
05/01/2008 11:48 am
మోహనరావుగారు ఉదహరించిన రెండుపాటలూ, ఇతరగీతాలూ (వెన్నెలరేయి ఎంతో చలిచలి వగైరాలు) అన్నీ కళావతి (వలజి)లో అక్కడక్కడా రిషభం తగిలించినవే. దీనికి విద్వాంసులు (తామే సృష్టించినట్టుగా) రకరకాల పేర్లు పెట్టారు. రవిశంకర్ (జనసమ్మోహిని), విలాయత్ ఖాన్ (కలావంతీ లేక శంకర్ కల్యాణ్), బడేగులాం (కున్హేరీ కల్యాణ్), బాలమురళీకృష్ణ (నర్తకి) అన్నారు. ఏ కల్తీలూ లేకుండా స గ2 ప ద2 ని1 అనే కలావతీయే అన్నిటికన్నా నాకిష్టం.
రాగలహరి: చక్రవాకం, మలయమారుతం, కళావతి గురించి జె.యు.బి.వి. ప్రసాద్ గారి అభిప్రాయం:
05/01/2008 11:06 am
10. స్వరములు ఏడైన… (రాగమాలికలోని ఒకచరణం)
ఈ పాట “తూర్పూ పడమర” సినిమాలోదని గుర్తు.
ప్రసాద్
రాగలహరి: చక్రవాకం, మలయమారుతం, కళావతి గురించి జె.యు.బి.వి. ప్రసాద్ గారి అభిప్రాయం:
05/01/2008 10:59 am
“20. వసంతగాలికి… (కర్ణ?)” అని రాశారు. ప్రశ్నార్థకం కరెక్టే అనుకుటాను. “వసంతగాలికి” అనే పాట బాలమురళీకృష్ణ గారూ, జానకి గారూ కలిసి, “శ్రీకాకుళ ఆంధ్ర మహా విష్ణు కధ” అనే సినిమాలో పాడారని నా గాఢ నమ్మకం.
ప్రసాద్
రాగలహరి: చక్రవాకం, మలయమారుతం, కళావతి గురించి mOhana గారి అభిప్రాయం:
05/01/2008 9:59 am
నాకు కళావతి రాగంలో నచ్చిన రెండు పాటలు –
1) హాయ్ రే వో దిన్ క్యో న ఆయే – అనురాధ – లత – రవిశంకర్
2) కోయీ సాగర్ దిల్ కో బహలాతా నహీ – దిల్ దియా దర్ద్ లియా – రఫీ – నౌషాద్
రెంటినీ యూట్యూబులో వినవచ్చును.
– మోహన
ఎవరో! గురించి siva గారి అభిప్రాయం:
05/01/2008 6:34 am
ఓకె, ఇంతకీ సువర్ణ కనబడింద లేదా, తను నిన్ను చూసి ఎందుకు పారిపోయింది..