ఆష్‌లీ, ధర్మారావుల మధ్య ఇక్కడ కనిపించే మరో పోలిక ఏమిటంటే, ఇద్దరికీ ‘అందరినీ సమానుల్ని’ చేసే పరిణామస్వభావం పట్ల సానుకూల అవగాహన లేదు. అంతవరకూ తను జాగ్రత్తగా ఎంపిక చేసుకున్న కొద్దిమంది మిత్రులతో తనదైన భావనాత్మక ప్రపంచంలో జీవించిన ఆష్‌లీ, యుద్ధం వల్ల తనతో ఎలాంటి సారూప్యత లేని మనుషుల మధ్య గడపవలసి వచ్చినందుకు బాధపడతాడు. ధర్మారావులోనూ అడుగడుగునా శిష్టత-సామాన్యతల వివేచన వ్యక్తమవుతూనే ఉంటుంది.
Category Archive: సంచికలు
తెల్లారిన తర్వాత కూడా రాగిణి అట్లాగే మూలుగుతూ ఉంది. దాసు దగ్గరకు వెళ్ళదామంటే మనస్సొప్పటంలేదు. తనను ఏమన్నా అంటాడేమోనని అభిమానంతోనే ఉండిపోయింది. డాక్టరు వచ్చి చూసిపోయాడు. ఫీజు క్రింద మూడు రూపాయలు చెల్లించుకుంది. నోటు మారిస్తే ఇంకా రెండు రూపాయలే మిగిలినాయి. మందు వ్రాసి ఇచ్చాడు కొనుక్కుని రమ్మనమని. ఆదుర్దాగా బజారు వెళ్ళి కనుక్కుంటే, నాలుగున్నర చెప్పాడు. అలాంటివి మూడు ఇవ్వాలిట కూడాను. అంబిక కంగారుపడిపోయింది. ‘ఎట్లాగు?’ అని గాభరా పడిపోతోంది.
ఒక అరుదైన నాటకం అందిస్తున్నాను. ఈ నాటకంలో చేయి పెట్టినవారందరూ ప్రముఖులే! సావిత్రి, గుమ్మడి, అల్లు రామలింగయ్య వంటి గొప్ప నటులు పాత్రలు పోషించారు. పాకాల రాజమన్నార్ రచించిన ఈ నాటకానికి దాశరథి స్క్రిప్ట్ రైటర్ గాను, మల్లంపల్లి ఉమామహేశ్వరరావు అనౌన్సర్ గానూ పనిచేశారు.
‘పాపని ఎప్పుడూ కోప్పడకూడదు. చాలా చాలా చాలా చాలా చాలా చాలా లడ్డూలు పెట్టాలి.’ అని ఉత్తుత్తి ఉత్తరంలో అమ్మమ్మ మాటగా తన మాటను చెప్పే గడుసుతనం ముచ్చట వేస్తుంది. అలాగే, బేబీ కార్న్‌తో పాటుగా మమ్మీ కార్న్, డాడీ కార్న్ ఉంటే ఫిజ్జు ఇల్లులో హాయిగా ఉంటారన్న ఆలోచన పిల్లలకు కాక ఎవరికి వస్తుంది?
ఈసారి కూడా చాలా తొందరగా చాలా పరిష్కారాలు వచ్చినా, తప్పుల్లేని పరిష్కారాలు మాత్రం అంత తొందరగా రాలేదు. అన్ని సమాధానాలూ సరిగా పంపింది బిహెచ్ విజయాదిత్య ఒక్కరే. ఒక్క తప్పుతో సమాధానం పంపించింది: పం.గో.కృ.రావు. ఇద్దరికీ అభినందనలు!
ఈసారి కూడా చాలా తొందరగా చాలా పరిష్కారాలు వచ్చినా, తప్పుల్లేని పరిష్కారాలు మాత్రం అంత తొందరగా రాలేదు. అన్ని సమాధానాలూ సరిగా పంపింది ఒక్కరే: […]
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం.
విశ్వనాథ గళంలో కిన్నెరసాని పాటలు. సేకరణ: శ్రీనివాస్ పరుచూరి
తెలుగు విశ్వవిద్యాలయాల పరిశోధనల్లో ప్రామాణికత లేమిని ఎత్తి చూపిస్తూ, “జ్ఞానానికి భౌగోళికమైన సరిహద్దులు లేవు. అజ్ఞానానికి మాత్రం వుంటాయి.” అంటూ వెల్చేరు నారాయణ రావు 1988లో తెలుగు పరిశోధన అనే పత్రికలో చేసిన చర్చ నేటికీ తన సంగతత్వాన్ని ఎంతమాత్రమూ కోల్పోలేదు. ఆ చర్చ పరిష్కృత పాఠం; బాలకథారచయితగా సుప్రసిద్ధుడైన డాక్టర్ ౙాయిస్ పుట్టినరోజు సందర్భంగా, ఆయన కథల స్ఫూర్తితో లలిత టి.ఎస్. చెప్పిన అంకెల కథ; ఒక కాలానికి చెందిన వ్యక్తిని, లేదా సంఘటనని, లేదా సామాజిక దృశ్యాన్ని కాలాతీతం చేసే మార్మిక శక్తి కావ్యానికి మాత్రమే ఉన్నదని, చరిత్ర చేయలేని పని కావ్యం చేస్తుందని చెప్తున్నారు భైరవభట్ల కామేశ్వరరావు నాకు నచ్చిన పద్యం ద్వారా; విశ్వనాథ – వేయిపడగలు, మార్గరెట్ మిచల్ – గాన్ విత్ ద విండ్ నవలల లోని పోలికలూ తేడాలూ చూపిస్తూ కల్లూరి భాస్కరం ఇకనుండీ ఈమాటలో కొనసాగించబోయే విశ్లేషణ; ఇంకా ఎన్నో రచనలతో కలిసి ఈ సంచికలో మీకోసం.
🔸 ఇప్పటికీ చాలామంది ఈమాట రచయితల పరిచయాలు ఇంచుమించు ఖాళీగా ఉన్నాయి. దయచేసి తమ వివరాలు పంపమని, అలానే కాలదోషం పట్టిన వివరాలు సరిదిద్దడంలో మాకు సహాయపడమని రచయితలకు మా మనవి. రచయితల గురించి పాఠకులకు తెలియడానికి ఈ పరిచయాలు ఎంతో ఉపయోగపడతాయి. దయచేసి తోడ్పడమని విజ్ఞప్తి.
థియొడోర్ గెయ్‌సెల్ (Theodore Geisel) ప్రపంచప్రసిద్ధి గాంచిన కార్టూనిస్ట్, ఆనిమేటర్, ఆర్టిస్ట్. కానీ ఆయన ఎవరికీ తెలియదు. అదే డాక్టర్ సూస్ అనండి, ఆయన తెలియనివారూ ఉండరు! పిల్లలకోసం కలకాలం నిలిచిపోయే ప్రపంచాన్ని సృష్టించిన సాహిత్య మేరునగం డాక్టర్ ౙాయిస్ (Dr. Seuss) జన్మదిన ( మార్చ్ 02, 1904) సందర్భంగా ఒక తెలుగు గేయం, ఆడియోతో సహా.
ఆగమెమ్నాన్ గ్రీకు పురాణాలలో ప్రముఖుడైన రాజు. ట్రోజన్ యుద్ధంలో గ్రీకు సైన్యాలని ఒకటి చేసిన వీరుడు. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ, హోమర్ చెప్పడం వల్లనే ఆతని పేరు ఇంత కాలం నిలిచున్నదని, ఆగమెమ్నాన్ ముందు ఎంతమంది వీరులు కావ్యానికి ఎక్కకపోవడం వలన కాలగర్భంలో కలిసిపోయారో! అని అంటున్నాడు హోరెస్. హోమర్‌ని సేక్రెడ్ బార్డ్‌గా పేర్కొన్నాడు హోరెస్. సరిగ్గా మన పద్యంలో ఉన్న వాల్మీకి కూడా అదే కదా!
కాని, ఈ దేశపు విద్యను ఆధునికీకరించడానికి అనుసరించవలసిన పద్ధతులు ఏమిటీ అనే విషయం మనం ఇప్పటికీ చర్చించలేదు. అయితే దీనికి ప్రత్యామ్నాయంగా – మనకున్న పాత సంప్రదాయమంతా గొప్పదే, అంచేత గురుకులాల్ని మళ్ళీ పునరుద్ధరించాలని నేను కోరడం లేదు. మన విద్యల్ని ఆధునికీకరించడానికి మనకు నప్పే పద్ధతుల్ని అన్వేషించాలి. గుడ్డిగా అనుకరించనూ కూడదు. మనదంతా గొప్పదని పిచ్చిగా నమ్మనూ కూడదు. చివరిగా ఓ మాట చెప్పనివ్వండి – జ్ఞానానికి భౌగోళికమైన సరిహద్దులు లేవు. అజ్ఞానానికి మాత్రం వుంటాయి.
రావునేదో అర్థంకాని అసహ్యభావం ముంచేసింది. శరీరం యావత్తూ ఏవగింపుతో జలదరించింది. తననీ, తన సంతానాన్నీ చూసుకుంటూ కాలం గడిపేయాల్సిన తల్లిదండ్రులు! అమ్మకి నలభై ఐదేళ్ళు దాటాయి. నాన్నకి యాభై ఏడో ఎనిమిదో ఉంటాయి. ఇద్దరూ వృద్ధాప్యంలో అడుగుపెట్టారు. కొడుకూ కోడలూ, కూతురూ అల్లుడూ, రెండు వేపులా మనవలూ! అమ్మమ్మకీ తాతకీ ఇప్పుడు పిల్లలా? ఇప్పుడు పసిబిడ్డ! ఒక్కసారిగా ఆ ఇద్దరి మీదా రావుకి చీదర ముంచుకొచ్చింది. అసలు ఈ వయస్సులో బిడ్డల్ని కనవచ్చునా?
ఆ మధ్య టైటిల్సు ఆఖర్లో కొత్త కార్డ్ ఒకటి ప్రత్యక్షం అవడం మొదలు పెట్టింది – దర్శకత్వపు పర్యవేక్షణ అని. ఒక లఘు డైరెక్టరుగారి చేతిలో ప్రతిష్టాత్మక చిత్రం పెట్టాల్సిన అవసరం వచ్చినప్పుడు, ఒక గురు డైరెక్టరుగారు అధ్యక్ష పీఠం అధిష్టించి ఈ సత్తరకాయ గారిని సరిదిద్దుతూ ఉంటారు. దర్శకత్వమే అంటేనే పర్యవేక్షించి తప్పొప్పులు ఎత్తి చూపే పని ఐతే, మళ్ళీ ఈ తోక ఎందుకో, ‘ఆడ లేడీస్’ అన్నట్టు.
రివరీ లోంచి బయటపడి వాచ్ వైపు చూస్తే ఇప్పుడందులో ముళ్ళే లేవు. ఇంతలోకే ఎక్కడికి పోయాయి అని ఆశ్చర్యపడ్డాడు. దీన్ని రిపేర్ షాపువాడికి చూపించి ముళ్ళు మాయమయ్యాయంటే వాడు నమ్ముతాడా అసలు? అనుకుంటూ ముందు విడియో మానిటర్ని చూశాడు. ఇంకా సేఫ్టీ విడియో వస్తూనే వుంది. రివైండ్ అండ్ ప్లే లాగా అందులోని వ్యక్తి సీట్ బెల్ట్ పెడుతూ, తీస్తూ, పెడుతూ, తీస్తూనే వున్నాడు. డ్రింక్ కార్ట్ కోసమని వెనక్కు చూస్తే కొన్ని పసుపు పచ్చని ఆక్సిజన్ మాస్కులు వేళ్ళాడుతూ కనిపించాయి.
సబ్దంగళ్ కడందు వా – వైరముత్తు. సంపుటి: కొంజం తేనీర్ నిఱైయ వానం (కాస్త తేనీరు బోలెడంత ఆకాశం), 2003. சப்தங்கள் கடந்து வா […]
బండ నెత్తిమీద పడినంత వేగంతో నడుస్తుంది ‘బండపాటు’లో కథనం. చావు తరువాతి సంఘటనలన్నీ జోరుగా జరిగిపోతాయి. ఎవరి నాటకాలు వాళ్ళు ఆడుతూ లాభం పొందటానికి చేసే ప్రయత్నాలను చాసో తీవ్రంగా ఉద్విగ్నంగా అన్నిటినీమించి వ్యంగ్యంగా ధ్వనింపజేస్తారు. మనిషితనం నశించినవాళ్ళ ప్రవర్తన ఎంత హీనంగా ఉండగలదో మనం ఊహించలేనంత పదునైన వ్యంగ్యంతో వర్ణిస్తూ బాధాకరంగా నెమ్మదిగా ‘కఫన్’ను నడిపిస్తారు ప్రేమ్‌చంద్.
నీ వునికి నాలో
నిరంతరం ప్రవహించినా
కనుచూపుమేరా అదృశ్యంగా
నన్ను స్పృశిస్తూనే వున్నా
నేను నీ అగుపించని రూపుకై
తపిస్తూనే వుంటాను
విశ్వనాథవారి వేయిపడగలు నవలను, మార్గరెట్ మిచల్ నవల గాన్ విత్ ద విండ్ రెండూ ఇంచుమించు ఏక కాలంలో వెలువడినవే కాని, రెండింటి భౌగోళిక తాత్విక నేపథ్యాలు వేరు. ఒకదానిది భారతీయ నేపథ్యం, ఇంకోదానిది అమెరికన్ నేపథ్యం. అలాంటిది, వాటి మధ్య పోలికలు ఒక ఆశ్చర్యమైతే, ఆ పోలికలలో కొన్ని తేడాలూ అంతే ఆశ్చర్యం.
పెళ్ళయిన కొత్తల్లో ఆమె కాళ్ళ పట్టీలు రెండూ ఒకదానికొకటి చిక్కుకోవడం తరచూ జరుగుతూ ఉండేది. నడిజాములో ఆమె కాళ్ళు చిక్కుకుని అవస్త పడుతుంటే ఆ పరిస్థితి చూసి నవ్వుతూ ఉడికించేవాడు. ఆమె బేలగా అయ్యో పట్టీలు చిక్కుకున్నాయి విడిపించండి అని బతిమలాడేది. ఆమె ఆరాటాన్నలా కొనసాగించి చూసి ఆనందపడేవాడు. ఆమె పాదాలను సుతిమెత్తగా తడుముతూ పట్టీల చిక్కు విడిపించేవాడు. ఎంత ఆలస్యం చేస్తే అంతసేపు ఆమె పాదాలతో ఆడుకోవచ్చు అన్నట్టు నెమ్మదిగా చిక్కు విడిపించేవాడు.