నెచ్చెలి-2024 కథా కవితా పురస్కారాల పోటీలు

నెచ్చెలి 5వ వార్షికోత్సవం (జూలై 10, 2024) సందర్భంగా నిర్వహిస్తున్న ద్వితీయ కథా, కవితా పురస్కార పోటీలకు రచనలకు ఆహ్వానం!

  • మొదటి బహుమతి పొందిన కథకు శ్రీమతి కె. వరలక్ష్మి ఉత్తమ కథా పురస్కారం.
  • మొదటి బహుమతి పొందిన కవితకు డా. కె. గీత ఉత్తమ కవితా పురస్కారం.

బహుమతులు

కథలకు:

మొదటి బహుమతి (ఉత్తమ కథా పురస్కారం)- రూ.3000/-
ద్వితీయ బహుమతి – రూ.2000/-
తృతీయ బహుమతి – రూ.1000/-
ప్రత్యేక బహుమతి– రూ.500/-

కవితలకు:

మొదటి బహుమతి (ఉత్తమ కవితా పురస్కారం)- రూ.1500/-
ద్వితీయ బహుమతి – రూ.1000/-
తృతీయ బహుమతి – రూ.750/-
ప్రత్యేక బహుమతి – రూ.250/-

సాధారణ ప్రచురణకు 20 కథలు, 20 కవితలు స్వీకరించబడతాయి.

ఎంపిక చేసిన కథలు, కవితలు ‘నెచ్చెలి’లో జూలై నెల నుండి నెలనెలా ప్రచురింప బడతాయి.

నిబంధనలు

  1. ఇతివృత్తం: స్త్రీలకి సంబంధించిన అంశం ఏదైనా.
  2. రచనతో బాటూ ఎక్కడా ప్రచురణ కాలేదనీ, పరిశీలనకు పంపలేదని హామీపత్రం జతచెయ్యాలి. హామీపత్రం లేని కథలు, కవితలు స్వీకరించబడవు.
  3. కథలు వర్డ్ ఫైల్‌లో పది పేజీలకు మించకుండా, కవితలు వర్డ్ ఫైల్‌లో 2 పేజీలకు మించకుండా తప్పనిసరిగా యూనికోడ్‌లో ఉండాలి. పీడీఎఫ్ కూడా జత చెయ్యాలి.
  4. ఒక్కొక్కరు ఒక్క కథ (లేదా) ఒక కవిత – ఏదైనా ఒక్కటి మాత్రమే పంపాలి.
  5. రచనతో బాటూ చిన్న పారాగ్రాఫులో యూనికోడ్‌లో రచయిత(త్రి) పరిచయం, ఫోటో, ఈ-మెయిలు, ఫోను నంబరు జతపరచాలి.
  6. ఈ-మెయిలు మీద ‘నెచ్చెలి- కథ-కవితల పోటీ-2024కి’ అని రాసి editor@neccheli.com కు పంపాలి.
  7. నెచ్చెలిలో నచ్చిన మూడు రచనల మీద గానీ, నెచ్చెలి యూట్యూబ్ వీడియోల మీద గానీ విశ్లేషణాత్మక వ్యాఖ్యలు పత్రికలో (లేదా) యూట్యూబులో తప్పనిసరిగా పోస్టు చెయ్యాలి. పోస్టు చేసిన వ్యాఖ్యల వివరాలు ఈ-మెయిలుకి జతపరచాలి.
  8. రచనలు చేరవలసిన ఆఖరుతేదీ: మే10, 2024. గడువుతేదీ తర్వాత అందినవి పరిశీలింపబడవు.
  9. బహుమతుల విషయంలో న్యాయనిర్ణేతలదే తుది నిర్ణయం. ఈ విషయంలో ఉత్తర ప్రత్త్యుత్తరాలకు తావులేదు.

పోటీ ఫలితాలు ‘నెచ్చెలి’ 5వ జన్మదిన సంచికలో జూలై 10, 2024న వెలువడతాయి.

రచనలు మాకు చేరవలసిన ఆఖరు తేదీ మే 10, 2024.

నిర్వాహకులు: డా. కె. గీత
సంస్థాపక సంపాదకులు
నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక