బాహ్య ప్రపంచపు పోకడల ప్రేరణలతో ఉత్పన్నమవుతోన్న తనకాలపు కవిత్వ ఋతువులను గమనిస్తూ, ఆ గొంతుల్లోని ‘ఆధునికత’ను జాగ్రత్తగా జల్లెడ పట్టిన సునిశిత దృష్టి ఇంద్రగంటిది. వస్తువూ, వాదమూ ఏదైనా, మనోధర్మమే ఏ కళకైనా శోభనిస్తుందనీ, అది ఎంత గొప్పదైతే కళ అంతలా రాణిస్తుందనీ నమ్మిన కవి ఇంద్రగంటి. ఆయన ఈ భావాలను ఎంతలా నమ్మారో, అంతలా పునరుద్ఘాటిస్తూ వచ్చారు.
సెప్టెంబర్ 2019
ఇంద్రగంటి శ్రీకాంత శర్మ (1944-2019):’నా లోపల విశ్వమంత ఆమ్రవృక్షం ఎడతెగని పరాగపవనాన్ని శ్రుతి చేస్తుంటే, గానంగా కరిగిపోయే కోకిలాన్ని, ఏకాంత ఢోలాఖేలనం ఎప్పటికీ ఇష్టం నాకు‘ అంటూ తన ప్రవృత్తిని కవిత్వంలో ప్రకటించుకున్న సాహితీవేత్త ఇంద్రగంటి శ్రీకాంతశర్మ తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రపురంలో జన్మించారు. కవులు, పండితులు అయిన తండ్రి శ్రీ ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రిగారి సాహిత్య వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. కవిత్వమంతా రాజకీయమయమై, నిరసననూ, పోరాటాన్ని ప్రతిపాదించనిదంతా అకవిత్వంగా చూపించబడుతోన్న రోజుల్లో, ఒక సాహిత్య ప్రక్రియను ఈ తీరున అడ్డుగోడల మధ్య బిగించడం నచ్చని ఇంద్రగంటి దానిని బాహాటంగానే విమర్శించారు. బాహ్య ప్రపంచపు పోకడల ప్రేరణలతో ఉత్పన్నమవుతోన్న తనకాలపు కవిత్వ ఋతువులను గమనిస్తూ, ఆ గొంతుల్లోని ‘ఆధునికత’ను జాగ్రత్తగా జల్లెడ పట్టిన సునిశిత దృష్టి ఇంద్రగంటిది. ఆంధ్రజ్యోతి వారపత్రికలో సబ్ ఎడిటర్‌గా ఉద్యోగజీవితం మొదలుపెట్టినా, కొంతకాలం సినిమా రంగంలో పనిచేసినా, ఆలిండియా రేడియోలో చేరినాకనే శ్రీకాంతశర్మ సృజనాత్మకత పూర్తిగా రెక్కలు విప్పుకుంది. ఆయన రచించిన ఎన్నో సంగీత రూపకాలు జాతీయస్థాయిలో బహుమతులు అందుకున్నాయి. ఆయన రచించిన లలితగీతాలు ఈనాటికీ ప్రాచుర్యంలో ఉన్నాయి. తెలుగు నాటకరంగానికి, తెలుగు సాహిత్యరంగానికీ ఆయన చేసిన కృషి చెప్పుకోదగ్గది. అనుభూతి గీతాలు, ఏకాంతకోకిల, నిశ్శబ్దగమ్యం – కవితా సంపుటులు; శిలామురళి, క్షణికం, తూర్పున వాలిన సూర్యుడు – నవలలు; గంగావతరణం, వర్షనందిని, కవి తిలక్‌పై చేసిన శిఖరారోహణం, మాట మౌనం, తలుపు, మరెన్నో సంగీత రూపకాలు రచించారు. యువ నుంచి యువ దాకా అన్న కవిత్వ సంకలానికి సంపాదకత్వం వహించారు. ‘హద్దుల మధ్య జీవితం జబ్బులా వార్ధక్యంలా, బెంగ పుట్టిస్తుంది కాబోలు! అందుకే, మనస్సు ఇంకా ఇంకా వెన్నెల రెక్కలు తొడుక్కుని, ఆకుపచ్చని యౌవన వనాల వైపు పరుగులు తీస్తుంది!‘ అన్న శ్రీకాంత శర్మ, అట్లాంటి యవ్వనోత్సాహంతోనే జీవన పర్యంతమూ తనను తాను మెరుగుపరుచుకుంటూ సాహిత్య సృజనలో కొత్త పుంతలు తొక్కుతూ వచ్చారు. ఇప్పుడిక హంస ఎగిరిపోయింది. ఇది విశ్రాంతి సమయం.
అరుదయిన పుస్తకాన్ని మిత్రుడు చదివి ఇస్తానని పట్టుకెళతాడు. ఇస్తానిస్తాను అన్నవాడు మాట మార్చేస్తాడు. “నేను తీసుకువెళ్ళానా? గుర్తు లేదే!” తర్వాతెప్పుడో ఒక వాన సాయంత్రం వాళ్ళ ఇంట్లో కబుర్లు చెప్పుకుంటూ కూచున్నప్పుడు వాళ్ళ పిల్లాడు పడవ చేయమని తీసుకు వచ్చిన కాగితం ఆ పుస్తకంలోనిదే అని గ్రహించీ కత్తి పడవ చేసి వాడితో ఆడుకుంటావు. ఇంతకూ నువ్వా పుస్తకాన్ని చదవనే లేదు.
విరసం కార్యవర్గ సమావేశం జరుగుతుండగా గెడ్డం ఉన్న ఒక ముసలాయన వస్తాడు. లోపలి వాళ్ళతో వెంటనే మాట్లాడాలని ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఆ కార్యకర్త సాయంకాలం రమ్మని పంపించేస్తాడు. నిరాశతో వెనుదిరిగిన ఆయన్ని, ‘ఇంతకీ మీ పేరేంటి సార్?’ అని అడుగుతాడు. దానికాయన ‘నన్ను కార్ల్ మార్క్స్ అంటారు బాబూ!’ అని చెప్పి వెళ్ళిపోతాడు.
వారం తరువాత నీ పలకరింపులో అనాసక్తి కనిపెట్టేసింది తను. బరువైన మాటలు, నెమ్మది అడుగులు, అసందర్భమైన నవ్వు అన్నీ ఓ కంట కనిపెడుతూనే ఉంది. పక్కనచేరి మోయలేనంత ప్రేమని చూపిస్తుంటే నీలో నీకే ఏదో గిల్టీ ఫీలింగ్. ధైర్యం తెచ్చుకొని కొన్ని రోజులుగా ఇబ్బందిపెడుతున్న విషయాన్ని తనతో చెప్పేశావు–మొన్న నువ్వు కూడా ఇంటికి వెళ్ళావని, మళ్ళీ ‘ఆ అమ్మాయిని’ కలిశావని. తను ఊఁ కొట్టి మౌనంగా ఉంది.
ఆ ఇల్లంతటికీ మిగిలింది
ఆ మూడంతస్తుల మెట్లే.
బారగా తలుపు తీసి
బైట ఆకాశం కేసి
కళ్ళు విప్పార్చి చూసింది
ఆవెఁ.
అనంత ప్రపంచం
అంతమైంది ఇక్కడే.
మేము రిసెప్షన్‌ను దాటుతున్నప్పుడు రిసెప్షన్‌లో ఇందాక కూర్చున్న అబ్బాయి మా వెనకే వచ్చాడు. ‘సర్, మీరు రేపు మానింగ్ కచ్చితంగా వస్తారా?’ మరీ నిలదీసినట్టు అడిగితే ఏం చెప్పాలి? బహుశా నా ముఖంలో డాక్టర్‌కు పూర్తి ఆమోదముద్ర కనబడలేదేమో. అందుకే స్పష్టత కోసం పంపివుంటాడు. నూరు శాతం వస్తామని చెప్పడానికి నోరు రావడం లేదు, అట్లా అని రాము అని చెప్పలేకున్నాను.
ఆ జలతీరపు రెస్టారెంటూ, అక్కడి వాతావరణమూ, స్పీకర్లలో వినిపిస్తోన్న థాయ్ సంగీతమూ నన్ను ఆకట్టుకొన్నాయి. అప్పటికే గంటా రెండుగంటలుగా ఎండంతా నాదే! కాస్సేపు నీడపట్టున ఆగుదామనీ, ఇలాంటి సమయాల్లో నాకు బాగా ఇష్టమైన పెప్సీ తాగుదామనీ అనిపించింది. లోపలికి నడిచాను. వేళగాని వేళ దేశంగాని దేశం నుంచి అలా ఓ మనిషి నడచి రావడం వాళ్ళను ఆశ్చర్యపరిచింది…
సమాజాన్ని, చరిత్రను, చరిత్రగతిని సీరియస్‌గా తీసుకుని రాసిన చంద్రశేఖరరావు కథల గురించి తెలుగు సాహిత్యలోకం చర్చించాల్సినంతగా చర్చించకపోవడం, దాదాపు మౌనంగా ఉండడం, అర్థంకాని కథలనే వ్యాఖ్యల మాటున దాక్కోవడం చంద్రశేఖరరావు కంటే తెలుగు కథకు జరిగిన నష్టంగానే భావించాలి. ఆయన రచనలపై చెప్పుకోదగ్గ వ్యాసాలేవీ ఈనాటికీ రాలేదు.
ఇద్దరు దోస్తులు కలిసి పది-ఇరవై మంది ఆడపిల్లల్లో ఒక అమ్మాయిని ఎంచుకొని, నలభైరెండు రూపాయలు ఇచ్చి కొనుక్కున్నారు. రాత్రి గడిపాక ఒక దోస్తు ఆ అమ్మాయిని అడిగాడు: “నీ పేరేంటి?” అమ్మాయి తన పేరు చెప్పేసరికి వాడు అదిరిపడ్డాడు: “అదేంటి, మాకేమో నీది వేరే మతమని చెప్పారు?” అమ్మాయి బదులిచ్చింది: “అబద్ధమాడారు వాళ్ళు.”
ఇలా రోజులు సాగుతుండగా (నిజానికి ఈ వాక్యం అక్కర్లేదు, కథ చదువుతున్నట్టు పాఠకులను నమ్మించటానికే) యవ్వనంలో శాంతి వయ్యారాలొలికే అందగత్తెగా శోభిల్లింది. తరువాత ఏం జరుగుతుంది? మానభంగమే. అగ్రకులపు కుక్క ఒకడు ఆమెను పట్టపగలు మానభంగం చేశాడు. మానభంగం చెయ్యడం దారుణాల్లోకెల్లా పెద్ద దారుణం కదా? శాంతి రెడ్‌హేండెడ్‌గా పట్టుబడింది.
నాకిప్పటికీ గుర్తు. చిన్నప్పుడోసారి బాగా వర్షం పడింది. ఆ తరవాత గాలి కూడా వచ్చింది. ఆ రాత్రంతా ఆ రాయి పడిపోతుందేమో అని నిద్రలో ఉలికులికిపడి లేస్తూనే ఉన్నాను. పొద్దున్నే లేచి భయంభయంగా చూస్తే ఆ రాయి అలానే ఉన్నది. ఆ రోజు నేను తాగుతున్న చాయ్ చప్పగా అనిపించింది… ఒకసారి భూకంపం వచ్చినప్పుడు మా గుట్టలో ఇళ్ళు కొన్ని కదిలిపోయాయి గాని, ఆ రాయి మాత్రం అలానే ఉంది.
ఇంద్రగంటి శ్రీకాంత శర్మ సాహిత్యం అందించిన ఈ రూపకం మొదట ఆగస్ట్ 25, 1986న ప్రసారం అయి, అదే ఏడు సంగీత విభాగంలో జాతీయస్థాయిలో ప్రథమ బహుమతి గెలుచుకుంది. ఈమాటకు ఈ రూపకం అందించినవారు: పరుచూరి శ్రీనివాస్.
శ్రీకాంతశర్మగారు రచనలతో రూపొందించబడిన చాలా కార్యక్రమాలు ఆకాశవాణి జాతీయస్థాయి పోటీలలో అగ్రస్థానాలు అందుకున్నాయి. వాటిలో ఒక రూపకం ఇది. ఈ రూపకం అందించినవారు: పరుచూరి శ్రీనివాస్.
ఇంద్రగంటి శ్రీకాంత శర్మ కలం నుంచి జాలువారిన మరొక అద్భుత రూపకం ఈ గంగావతరణం. కలగా కృష్ణమోహన్ సంగీతంలో వెలువడిన ఈ రూపకం అప్పుడూ ఇప్పుడూ కూడా శ్రోతలను అలరిస్తూనే వుంది. ఈ రూపకం అందించినవారు: పరుచూరి శ్రీనివాస్.
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.
2016లో శ్రీకాంతశర్మ లలితగీతాలు అన్న పేరుతొ ఒక 35 గీతాల పుస్తకం, దానికి జతగా 15 పాటలున్న ఒక సి.డి. వెలువడింది. ఈ సంకలనం నుండి, తేనెల తేటల మాటలతో అన్న బహు ప్రసిద్ధి గాంచిన దేశభక్తి గీతంతో పాటుగా, మార్కెట్లో లభ్యం కాని మరికొన్ని పాటలు కూడా ఇక్కడ వినవచ్చు.
క్రితం సంచికలోని గడినుడి-34కి మొదటి మూడు రోజుల్లోనే తొమ్మిదిమందినుండి సరైన సమాధానాలు వచ్చాయి. అన్నీ సరైన సమాధానాలతో పంపినవారు: జిబిటి సుందరి, బండారు పద్మ, అనూరాధా శాయి జొన్నలగడ్డ, పాటిబళ్ళ శేషగిరిరావు, చందన శైలజ, స్వాతి శ్రీపాద, సుభద్ర వేదుల, భమిడిపాటి సూర్యలక్ష్మి, వైదేహి అక్కిపెద్ది. విజేతలకందరికీ మా అభినందనలు.
గడి నుడి-33 సమాధానాలు, వివరణ.