రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

ఈమాట జులై 2010 విజయనగర రాయని విశేష సంచికకు స్వాగతం!

సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్య పట్టాభిషక్తుడై ఈ యేటికి ఐదువందల సంవత్సరాలయింది. కృష్ణరాయని కాలంలో తెలుగు వారికి ప్రసాదమైన అపురూప సాహిత్యమూ, దక్షిణాపథ చరిత్రలో ఆ కాలానికి గల విశిష్టతల ప్రభావంతో, ఈ సంచికను శ్రీకృష్ణదేవరాయల ప్రత్యేక సంచికగా ప్రచురిస్తున్నాం. ఈ సంచికలో కథలు, కవితలు, శీర్షికలతో పాటుగా విజయనగర సామ్రాజ్యం గురించిన చారిత్రాత్మక వ్యాసాలు; కీ. శే. వేటూరి సుందరరామమూర్తి రచించిన సంగీత నాటిక ఆడియో ప్రత్యేకంగా ఈమాట పాఠకుల కోసం పొందుపరిచాం. ఈ సంచికలో మీకోసం…

ఆముక్తమాల్యద – కృష్ణదేవరాయల నవ్య రాజనీతి

రచన: సురేశ్ కొలిచాల
మూలం: డేవిడ్ షూల్మన్, వెల్చేరు నారాయణరావు, సంజయ్ సుబ్రహ్మణ్యం
ఈ ఈ నొక్కి చదవండి...

దక్షిణ భారతీయ సాహిత్య చరిత్రలో మొదటిసారిగా రాజు యొక్క వ్యక్తిగత ధర్మాలకు, రాజ్యపాలనా ధర్మాలకు మధ్య భేదాన్ని విస్పష్టం చేసింది ఆముక్తమాల్యద.

పేజీలు: 1 2 3 4 5 అంతా ఒకే పేజీలో 2

పసిఁడిపల్లకి

రచన: తిరుమల కృష్ణదేశికాచార్యులు
ఈ ఈ నొక్కి చదవండి...

బ్రహ్మతేజము మీరు ఫాలభాగమునందుఁ
దిరునామదీప్తులు మెఱయుచుండ,
ఎత్తుబాహులయందు బెత్తెడంచుల జరి
యుత్తరీయపుకాంతి యోలగింప.
వెడదయురమ్ముపై నిడుపైన యజ్ఞసూ
త్రద్వయవిద్యుతుల్ దనరుచుండ,
మల్లెపూడాలుకుం జెల్లెలై విలసిల్లు
తెల్ల దోవతికాంతి యుల్లసిల్ల,

6

అ, న్యాయం

రచన: ఆర్. శర్మ దంతుర్తి

ఫోన్ పెట్టేసిన గీత చాలా సేపు స్థబ్ధుగా కూర్చున్నాక లేచి తనకు తెలిసున్న తెలుగాయనకి చెప్పింది విషయాలన్నీ. ఆయన విని తనకి తెల్సున్న లాయర్ దగ్గిరకి తీసుకెళ్ళేడు. వేరే పాథాలజిస్ట్ చేత రెండో ఒపీనియన్ అడగొచ్చనీ, తాను హెల్ప్ చేస్తాననీ చెప్పేడు.

10

సామాన్యుని స్వగతం: పిల్లలు, మన అభిరుచులు

రచన: వింధ్యవాసిని

మా కిద్దరికీ ఈత రాదు. మా అమ్మాయి ఈదటం నేర్చుకోవాలని మాకు ఇష్టం. అదొక మంచి వ్యాయామమే కాకుండా, జీవితంలో ఎప్పటికయినా పనికొచ్చే అవసరం అని మా ఉద్దేశ్యం.

6

తలుపుల రసీదు

రచన: కలశపూడి శ్రీనివాసరావు

మాలాంటి వాళ్ళంతా గూగుల్ బ్రెయిన్ తో పని చేస్తున్నాం చాలా మట్టుకి. అప్పుడప్పుడు మాత్రమే స్వంత బ్రెయిన్ వాడేది. అది కూడా ఏదో అమ్మాయితో, ప్రేమగా కబుర్లు చెప్పడానికి మాత్రమే.

4

ఎలిపోమను

రచన: కనకప్రసాద్

వొయసులో జేబీల డబ్బులాడిన్నాడు
పద్దు లెక్కించుకుని పదిలముగ వున్నాను.
దసరాకి కుర్రోలు దండుకున్నట్టుగ –
నడమంత్రం కురుపంటె ఇలాగే కావాల.

పేజీలు: 1 2 3 అంతా ఒకే పేజీలో 1

నిలువనీడ

రచన: కొల్లూరి సోమ శంకర్
మూలం: ఈశ్వర్ సుందరేశన్

సెక్రటరీ మెట్లు దిగి తన కొత్త కారు కేసి దర్జాగా నడవడం వాచ్‌మాన్‌ చూసాడు. తన వాదనని మరోసారి వినిపించాలా లేక క్షమించమని బ్రతిమాలాలా?

1

నువ్వు

రచన: రాగద్వీప

నువ్వంటే నాకు చెప్పలేని చిరాకు, అంతులేని కోపం,
ఎందుకు నిన్నింతగా ప్రేమించేలా చేస్తావు నన్ను మరి?

16

విజయనగర చరిత్ర రచన: ఒక సమీక్షా వ్యాసం

రచన: పరుచూరి శ్రీనివాస్
ఈ ఈ నొక్కి చదవండి...

విజయనగర సామ్రాజ్య స్థాపకులైన హరిహరరాయలు, బుక్కరాయలు తెలుగువారు అని వెంకటరమణయ్య చేసిన ప్రతిపాదనని ‘కర్నాటక’ చరిత్రకారులు వ్యతిరేకించారు.

పేజీలు: 1 2 అంతా ఒకే పేజీలో 16

సిరికాకొలను చిన్నది: సంగీత నాటిక

రచన: వేటూరి సుందరరామమూర్తి
ఈ ఈ నొక్కి చదవండి...

ఇది కథో కల్పనో నాకు తెలియదు. కానీ ఇది సజీవశిల్పం. ఈ శిల్పం చెక్కడానికి ఉలి, ఊపిరి, శిలా, వైఖరి మాత్రం నా మాతామహుల వారసత్వం.

12

నాకు నచ్చిన పద్యం: ఆముక్తమాల్యదలో ఒక ఉదయం

రచన: చీమలమర్రి బృందావనరావు

ఆరెకులు బిక్కమొగం వేసుకుని చూస్తుండగా, ఆడవాండ్లు నవ్వబట్టారట. ఖంగుతిన్న ఆరెకులూ, నవ్విన ఆడువారూ పరువంలో వున్నవారైతే ఆ దృశ్యం సొగసు చెప్ప తరమా!

1

నేను పులిని

రచన: గెడ్డాపు లక్ష్మీ ప్రసాద్

ఇక నన్ను శ్రమపడి
అడవుల్లో వెతకొద్దు
నేను కనిపించలేదని నిట్టూర్చొద్దు.

6

నిశ్శబ్దం నీడల్లో – ముకుందరామారావు కవిత్వం

రచన: వేలూరి వేంకటేశ్వర రావు
ఈ ఈ నొక్కి చదవండి...

ముకుంద రామారావు ఆయన ఉద్దేశంలో కవిత్వమంటే ఏమిటో ప్రారంభంలోనే చెప్పారు: “మనస్సు, హృదయం, ఆత్మల సమ్మిశ్రితం బహుశా కవిత్వం” అని. అంతే కాదు. తాను కవిత్వం రాయడానికి ప్రేరణ కూడా చెప్పారు.

9

ఊరి చివర – అఫ్సర్ కవితల సంకలనం

రచన: వేలూరి వేంకటేశ్వర రావు
ఈ ఈ నొక్కి చదవండి...

ఈ ఆఖరి నాలుగు పాదాలూ అచ్చంగా కవిత్వం. చిన్నచిన్న మాటలు అతి జాగ్రత్తగా వాడటం అఫ్సర్ కి తెలుసు. పద్యం ఆఖర్న పాఠకుడి మనస్సుకి ఒక కుదుపు ఇస్తాడు. ఇది అఫ్సర్ ప్రత్యేకత.

పేజీలు: 1 2 3 4 అంతా ఒకే పేజీలో 44

రాజులలో సుల్తాను: విజయనగర రాజాస్థాన వస్త్రధారణపై ఇస్లామీయకరణ ప్రభావం

రచన: మాధవ్ మాౘవరం
మూలం: Phillip B. Wagoner
ఈ ఈ నొక్కి చదవండి...

ఈ కబాయి, కుళ్ళాయిలని విజయనగర రాజులు స్వాగతించి ధరించటం, అప్పటిదాకా ఉన్న నియమాలకు విరుద్ధంగా తీసుకున్న ఒక విప్లవాత్మక చర్యగా చెప్పక తప్పదు.

పేజీలు: 1 2 3 4 5 6 అంతా ఒకే పేజీలో 5

సిరికాకొలను చినదానికి ఆశీస్సు

రచన: బాలాంత్రపు రజనీకాంతరావు
ఈ ఈ నొక్కి చదవండి...

బేలగా ఒక యువ కవి నా కార్యాలయపు గది దగ్గరకు వచ్చి లోపలికి చీటీ పంపాడు. ఆయన ఇంటి పేరు వేటూరి. పేరు సుందరరామమూర్తి.

0

కృష్ణదేవరాయలు

రచన: నేలటూరు వెంకటరమణయ్య
ఈ ఈ నొక్కి చదవండి...

పూర్వ మాంధ్రదేశమున బ్రతిగ్రామమునకును గ్రామముల పూర్వవృత్తములు వర్ణింపబడియుండు కవిలెలందు కృష్ణరాయల యేలుబడిని గూర్చి వివరింపబడియున్నది.

7

శ్రీకృష్ణదేవరాయలు – ఆంధ్రేతర సాహిత్యము

రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు
ఈ ఈ నొక్కి చదవండి...

రాత్రి రాయలు పడకగదికి వెళ్ళి మంచమును తట్టగా అది కూలిపోతుంది. వెంటనే ఒక చిన్న యుద్ధమే జరుగుతుంది.

పేజీలు: 1 2 3 4 అంతా ఒకే పేజీలో 15

శ్రీకృష్ణదేవరాయలు

రచన: గుఱ్ఱం జాషువా
ఈ ఈ నొక్కి చదవండి...

జాషువా కవి 1929 భారతి పత్రికలో కృష్ణదేవరాయనిపై వ్రాసిన పద్యాలు, ఈమాట పాఠకులకోసం.

3

ఎడిటర్లూ, రచయితలూ, ఎడిటింగూ

రచన: వేలూరి వేంకటేశ్వర రావు

ఈ మాట ప్రారంభమైనప్పటినుంచీ, ఇప్పటి వరకూ సంపాదకత్వ బాధ్యతలు (సంపాదక బాధలు అనడం ఉచితమేమో!) నిర్వహిస్తున్నవారందరూ సైంటిస్టులు, ఇంజనీర్లూ. పీర్ రివ్యూ అన్న పదం ఇంత ఘర్షణకి మూలకారణం అవుతుందని వాళ్ళు కలలో కూడా ఊహించలేదు.

4
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.