రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

నవంబర్ 1999 — తొలి జన్మదిన ప్రత్యేక సంచిక!

సాధారణంగా తెలుగు వాళ్ళకి సాహిత్య చర్చల్లో కూడా అసలు విషయాల గురించి కాక వ్యక్తుల వ్యక్తిగత విషయాల మీదే ఆసక్తి ఎక్కువ. ఈ పత్రిక నడుపుతున్నవారి పేర్లు public గా announce చెయ్యటం వల్ల బహుశ focus ని పత్రిక మీద నుంచి మా మీదికి తిప్పుకోవటం తప్ప ఎవరికీ ఏమీ ప్రయోజనం ఉండదని ఇంతకాలం ఈవిషయంలో ఎంతో వెనకాడేం. ఐతే కొందరు రచయిత(త్రు)లు యీ సమాచారం లేని కారణంగా తమ రచనలు పంపటానికి వెనకాడుతున్నారని కర్ణాకర్ణిగా విన్న”ఈమాట” శ్రేయోభిలాషులు కొందరు మా చెవిని వెయ్యటంతో “ఈమాట” జన్మ దినోత్సాహ సందర్భంగా అలాటి వారి సందేహాలు తీర్చటానికి ఆ వివరాలు ఇక్కడ ఇస్తున్నాం. ఇప్పటి వరకు “ఈమాట” ను ప్రోత్సహిస్తున్న వారు ఇంకా ఉత్సాహంగా ఆ పని చేస్తారని, ముందు వెనకలు చూస్తున్న వారు వారి సందేహాలు తీరి ముందుకే వచ్చి ఈ team effort లో పాల్గొంటారనీ మా ఆకాంక్ష.

కె. వి. ఎస్‌. రామారావు ముఖ్య సంపాదకుడు
విష్ణుభొట్ల లక్ష్మన్న సంపాదకుడు
కొంపెల్ల భాస్కర్‌ సంపాదకుడు
కొలిచాల సురేశ్‌ సంపాదకుడు

1998 మే జూన్‌ నెలల్లో కనకప్రసాద్‌, లక్ష్మన్న, భాస్కర్‌, నేనూ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సస్‌,ఆస్టిన్‌ ఆవరణలో ప్రశాంతంగా ఉండే ఓ చర్చ్‌ పార్కింగ్‌ లాట్‌లో కలిసి లంచ్‌ చేస్తూ సాహిత్య విషయాలు ముచ్చటించుకునే వాళ్ళం (కనకప్రసాద్‌ ఇప్పుడు ఆస్టిన్‌ నుంచి మరో చోటుకు వెళ్ళినప్పటికి అతను చూపించిన ఆ చోటు అప్పుడప్పుడు మేం కలుసుకోవటానికి యింకా బాగానే పనికొస్తోంది అతనిక్కడ లేని లోటుని గుర్తుచేస్తూ!) ఓ రోజు మాటల సందర్భంలో ఇక్కడ తెలుగులో రాసే రచయితలకు తమ రచనలు ప్రచురించటానికి ఇండియాలోని పత్రికలు తప్ప మరో చెప్పుకోదగ్గ మార్గాలు లేకపోవటం గురించిన చర్చ వచ్చింది. మర్నాడు ఎందుకో ఆ విషయం ఆలోచిస్తుంటే తట్టింది ఓ ఎలెక్ట్రానిక్‌ పత్రిక మొదలెడితే ఎలా ఉంటుందన్న ఆలోచన. సురేశ్‌, లక్ష్మన్న, భాస్కర్‌ పనిలో పాలుపంచుకోవటానికి ఉత్సాహం చూపించారు.మా ఇంట్లో కలిసి రెండు మూడు వీకెండ్స్‌ ఈ విషయం చర్చించాం.ముందుగా కొందరు పరిచితులైన అనుభవజ్ఞుల అభిప్రాయాల కోసం వారిని సంప్రదించాం. దాదాపుగా అందరూ ఉత్సాహం చూపించారు; జాగ్రత్తలు చెప్పి ముందుకు సాగండని ప్రోత్సహించారు. వారందరికీ మా కృతజ్ఞతలు! 1998 అక్టోబర్‌లో తొలి సంచిక వెలువడింది gif files వాడుతూ. శ్రీ చోడవరపు ప్రసాద్‌ embedded fonts వాడితే చాలా బాగుంటుందనీ అందుకు కావల్సిన సాంకేతిక విషయాలు తను చూస్తానని ముందుకొచ్చారు. ఐతే పత్రిక సంచికల్ని తయారుచెయ్యటం కూడ చిన్నపని కాదు. ఈ సాంకేతిక కార్య నిర్వహణం అంతా తను చూస్తానని శ్రీ కొలిచాల సురేశ్‌ అప్పట్నుంచి ఆ పని చేస్తున్నారు. (ప్రస్తుతం అతను ఇండియాలో ఉన్నందువల్ల ఈ సంచికను మిగిలిన వాళ్ళం సమీకరించాం.) శ్రీ ప్రసాద్‌ “లేఖ” సర్వర్‌ మీద ఈ పత్రికను ఉంచటానికి శ్రీ జువ్వాడి రమణ అనుమతి పొందారు. ఇవీ ఇప్పటి వరకు “ఈమాట” పరిణామ దశలు.

ఈ సంవత్సర కాలంలోనూ మేం ఎన్నడూ ఊహించని స్థాయిలో పాఠకులు ఈ పత్రికను ఆదరించారు. రచయిత(త్రు)లు మాత్రం ఇంకా కొంచెం మందకొడిగా ఉంటున్నారు. “ఈమాట” ఇలా బాలారిష్టాలు దాటటం వారి సందేహాల్ని తొలగించి రాయటానికి ప్రోత్సహిస్తుందని ఆశిస్తాం.

ఈ webzine మూడు ఆశయాల్తో ప్రారంభించాం.

మొదటిది భారతదేశం బయట ఉంటున్న తెలుగు వారి జీవన విధానాల్ని,అనుభవాల్ని ప్రతిబింబించే రచనలకి, వాటి రచయిత(త్రు)లకి ఒక వేదిక కల్పించటం.
రెండోది ఈ వేదిక రాజకీయ, కుల, మత, వర్గ ధోరణులకి, వ్యాపార కలాపాలకి దూరంగా ఉండేట్టు చూడటం.
మూడోది Internet technology ని వీలైనన్ని విధాల ఉపయోగించుకుంటూ ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ తేలిక మార్గంలో అందేట్టు చూడటం.

ఈ ఏడాది కాలంలో “ఈమాట” పరిణామం గమనిస్తే ఈ మూడు ఆశయాల్లోను కొంతవరకు కృతకృత్యులమయ్యామనే అనిపిస్తుంది. ఐతే ఇందుకు మేము నిమిత్తమాత్రులమని మా నమ్మకం. సాంకేతిక సమస్యలు పరిష్కరించిన వారు, రచయిత(త్రు)లు, పాఠకులు, తానా, వంగూరి ఫౌండేషన్‌ ఇందరు శ్రేయోభిలాషుల కృషి ఫలితం ఇది.

ముందుముందు “ఈమాట” ఇంకా ఎక్కువమంది రచయిత(త్రు)లు, పాఠకులతో విస్తరిస్తుందనీ, ఇందుకు అందరూ తమ సొంత బాధ్యతగా చేతనైన సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం.

తెలుగు సినిమా పాటల్లో కొన్ని రచనా విశేషాలు

రచన: విన్నకోట రవిశంకర్

కొన్నిపాటల్లో నేను గమనించిన విశేషాలను ఈ వ్యాసంలో ప్రస్తావిస్తాను. ఇందులో క్లాసిక్సునే కాకుండా, అన్ని రకాల పాటల్నీ తీసుకుంటాను. దీని ఉద్దేశ్యం, కొన్ని రచనా వైచిత్రుల్ని గుర్తించటమే గాని, ఉత్తమ రచనల్ని ఎన్నిక చెయ్యాలని కాదు. అందువల్ల కొన్ని మంచి రచనల గురించి చెప్తూనే, ఇతరత్రా విషయాల గురించి కూడా కొంత ముచ్చటిస్తాను.

పేజీలు: 1 2 అంతా ఒకే పేజీలో 15

తెలుగు సినిమా పాట

రచన: ఇలపావులూరి

సంగీతమూ సాహిత్యమూ సమపాళ్ళలో మేళవించబడ్డ ఈ పాట అనే ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమయ్యిందో తేల్చి చెప్పడం కష్టమే. అనగనగా, చారిత్రకంగా ఫలానా తేదీ అని […]

8

ఘంటసాల – బాలసుబ్రహ్మణ్యం

రచన: విష్ణుభొట్ల లక్ష్మన్న

“సినిమా ” కి ఎంత ప్రజాదరణ లభించిందో, “సినిమా పాట ” కి అంతకన్నా ఎక్కువ ఆదరణ లభించిందంటే అతిశయోక్తికాదు. గత 50 సంవత్సరాల […]

30

సంకల్పం

రచన: కలశపూడి శ్రీనివాసరావు

ఇప్పుడు కాకపోతే, మరెప్పుడు ? మనం కాకపోతే మరెవ్వరు ? అమెరికా దేశంలో, మిచిగన్‌రాష్ట్రంలో, గేంజెస్‌అన్న ఊరులో ఉన్న వివేకానంద మొనాష్టరీలో ఆగష్టు నెల […]

2

హీరోత్వం శుంఠాయతనం

రచన: మాటల మల్లన్న

హన్నన్నా అట్టె అట్టె! రెXంత మాటన్నారు రెXంత మాటన్నారు ఈ బైస్కోపులో ముచ్చటగా ముగ్గురే హీరోయినీమణుల్ని కట్టబెట్టనంత మాత్రాన హీరో గారి హీరోగం మరీ […]

0

ఎటర్నిటీ

రచన: ఇలపావులూరి

ఆకాశం భూమిని తాకేచోట మేఘాలు కెరటాల్ని సోకేచోట దిగులు సంధ్యను కళ్ళలో దాచుకొని, హేమంతపు చీకట్లను గుండెల్లో నింపుకొని, విషాదపు కొండ అంచు మీద […]

1

అయ్యబాబోయ్‌ లక్షరూపాయలే!!

రచన: వేలూరి వేంకటేశ్వర రావు

ఏ నాటిదో చాలా పాత సినిమా. పాతాళభైరవేమో; బాగా గుర్తు లేదు. అందులో, “ఓరీ రాక్షసుడా! నీకు ఏం కావాలో కోరుకో” అని అనంగానే,ఆ […]

0

నిరసన (గల్పిక)

రచన: ఎస్‌. నారాయణస్వామి

విశ్వవిద్యాలయ ప్రాంగణం కోలాహలంగా ఉంది. ప్రాంగణానికి నడిబొడ్డులా ఉన్నdiag మైదానంలో విద్యార్థులు గుంపులుగా కూడి ఉన్నారు. అక్కడ నిరసన వ్రతం జరుగుతోంది. ఈ మధ్యనే […]

1

గంధర్వులెవరు?

రచన: భాస్కర్ కొంపెల్ల

మన పురాణాల్లో భూతలవాసులు కొందరు దేవతల్తో కలిసిమెలిసి తిరుగుతూంటారు. ఇంద్రుడి దగ్గరికెళ్ళడం, రంభాఊర్వశుల నాట్యాలు చూడ్డం, ఇంద్రుడితో అర్ధసింహాసనాలు పంచుకోవడం జరిగిపోతూంటాయి. ఇదంతా అభూతకల్పన […]

4

సముద్రం

రచన: తురుమెళ్ళ మాధవ్‌కుమార్‌

సముద్రం హోరుమంటూ శబ్దంచేస్తోంది. సంధ్యాకాలం అవడంతో పక్షులన్నీ హడావుడిగా గూటికి చేరుకోవడానికన్నట్లు బారులు తీరి ఆకాశంలో వెళ్ళిపోతున్నాయి. రాత్రి అవడానికి సమయం దగ్గరపడటంతో నక్షత్రాలు […]

1

దృక్కోణము

రచన: విస్సావజ్ఝల ప్రభాకర్‌

లోకంలో అనుభవానికీ, అనుభవజ్ఞులకు ఉన్న విలువ వేరే చెప్పవలసిన పనిలేదు. అయితే,”అనుభవాన్ని” నిర్ణయించడానికి ప్రాతిపదిక ఏది? కొలవడానికి “కొలబద్ద” ఏమిటి? సాధారణంగా ఒక వ్యక్తి, […]

0

శాంతి

రచన: కె. వి. ఎస్. రామారావు

కథ చదివిన డాక్టర్‌కాంతా రావు మనసంతా వికలమై పోయింది. హృదయ విదారకమైన కథ. మనసును పిండి చేసే కథ. వరాల అక్షింతలు వేస్తామని వచ్చిన […]

0

కోరిక

రచన: విన్నకోట రవిశంకర్

ఒక మార్పు కోసం ఎప్పుడైనా నాకు చనిపోవాలని ఉంటుంది. అంతుపట్టని ఒక చీకటిలో అంతమైపోవాలని ఉంటుంది. జలజలకురిసే వానలో ఒక చినుకులాగా, గల గల […]

3

యోర్హే లూయీ బోర్హేస్‌కవితలు:మేఘాలు

రచన: పెమ్మరాజు వేణుగోపాల రావు
మూలం: Jorge Luis Borges

ప్రశాంతమైన పర్వతాలు సంచరిస్తున్నాయి గాలిలో శోకభరితమైన ఆ పర్వతశ్రేణులు విచారగ్రస్తమైన కంబళి వంటి నీడతో పగటిని కప్పేస్తున్నాయి. అవే మేఘాలు అరుదయిన వింతవింత రూపాలు […]

0

నా పల్లెటూరు

రచన: నీలంరాజు నరసింహారావు

(నీలంరాజు నరసింహారావు గారు వ్యవసాయంలోనూ కవితా వ్యాసంగంలోనూ కూడా బాగా కృషి చేసిన వారు. అద్దంకి దగ్గర్లో ఉన్న కలవకూరు గ్రామం స్వగ్రామం; అక్కడే […]

0

Self Realization

రచన: హరి మద్దూరి

“మనసున మల్లెల మాలలూగెనే… ” టేపురికార్డర్‌లో పాట అబ్బ! కృష్ణ శాస్త్రిలా నేనూ కవిత్వం రాయగలిగితే! రమేష్‌కృష్ణన్‌ జూనియర్‌వింబుల్డన్‌ గెలిచాడుట. ఆహా! నేనూ ప్రఖ్యాత […]

0

దివ్య దీపావళి

రచన: భాస్కర్ కొంపెల్ల

జవ్వనాన్ని జువ్వ చెయ్యండి పువ్వుల్లా బ్రతికే పూలరంగళ్ళూ ఈనెగా మీ ఆననివ్వండి శూన్య శంకువుల్లాంటి మీ గుండెల్లో చైతన్యాన్ని పోసి దట్టింపులన్నీ పూర్తి చెయ్యండి […]

1

ఈరాతలు అమెరికాలో తెలుగు కథానిక

రచన: సుజ్ఞేయశ్రీ

(శ్రీ “సుజ్ఞేయశ్రీ” గారు ఇండియాలో తెలుగు సాహిత్య విమర్శకుడిగా చాలా అనుభవం ఉన్నవారు. ఐనా కొన్ని కారణాల వల్ల అజ్ఞాతంగా ఉండాలని కోరుతున్నారు. చాలా […]

0

ఆర్నెలల్లో అవధాని కావటం ఎలా?

రచన: కె. వి. ఎస్. రామారావు

(ఈ వ్యాసం మూడు భాగాల్లో మూడు “ఈమాట” సంచికల్లో ప్రచురించబోతున్నాం. ఇది తొలి భాగం.) 1. పరిచయం. మూడు రకాల ప్రయోజనాల కోసం ఈ […]

2

( ర ) సాలూరు రాజే “స్వర ” రావు నివాళి

రచన: విష్ణుభొట్ల లక్ష్మన్న
ఈ ఈ నొక్కి చదవండి...

( గత మంగళవారం , అక్టోబర్‌ 26, 1999, ఉదయం కన్నుమూసిన సుస్వరాల రాజేశ్వర రావుకి నివాళిగా ” ఈ మాట ” కోసం […]

13
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.