రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

రాయాలని ఉంది!

రచన: పింగళి నరసింహ రావు
జులై 1999

రాయాలని ఉంది..
మనిషి ఆశలనూ, భావాలనూ,
చెరిగి పోని జీవిత సత్యాలనూ
నింపుకున్న ఒక శాశ్వతమైన కవిత రాయాలని ఉంది..

మనిషి ఉనికిలోని అంతరార్థాన్ని చాటి
మనిషి మనస్సు పని చేసే తీరును విశద పరిచే
ఒక సంపూర్ణమైన కవిత రాయాలని ఉంది..

ఆది మానవుడి నుండి వ్యోమగామి దాకా
మనిషి హృదయం లో ఉప్పొంగే
మృదు భావాలను మెత్తగా చాటే
ఒక ఆర్ద్రమైన కవిత రాయాలని ఉంది..

నందన వనం లో ఎగిరే
రంగురంగుల సీతాకోకచిలుకలా నైతేనేం
కీకారణ్యం లో వేగంగా
ఉరికే చిరుత పులిలా నైతేనేం
మనిషి మనస్సులో సదా పరుగులెత్తే
కోరికల గురించి రాయాలని ఉంది..

ఉరిమే శ్రావణ మేఘంలా నైతేనేం
దూది పింజలా చెదిరే తెల్లటి మబ్బులా నైతేనేం
మనిషి మదిలో సదా మెదిలే
ప్రేమ భావం గురించి రాయాలని ఉంది..

హేమంతం లో గాలిని నింపే పొగమంచులా నైతేనేం
గడ్డి రేకుల మీద నిలిచిన హిమ బిందువులా నైతేనేం
మనిషి మనసున నిండిన ఆర్ద్రత గురించి రాయాలని ఉంది..

బొరియ లోంచి మళ్ళీ మళ్ళీ తల బయటకు పెట్టి చూసే
చిట్టెలుకలా నైతేనేం
ఎగిరెగిరి పడే మహా సముద్రపు కెరటంలా నైతేనేం
ఏదో చేయాలని మనిషి పడే ఆరాటం గురించి
వివరంగా రాయాలని తపనగా ఉంది..

విశాలమైన పచ్చిక బయలులో ఏదో కదిలినట్లనిపించి
బెదురు చూపులు చూసే జింక పిల్లలా నైతేనేం
గుడి గంటలకే భయపడి
గోపురం మీద నుండి ఎగిరి పోయే పిట్టలలా నైతేనేం
అనంత జీవిత యాత్రలో అడుగడుగునా మనిషి అనుభవించే
అభద్రత గురించి రాయాలని ఉంది..

ఎడారిలో అనంతంగా సాగే ఒంటె లాగా నైతేనేం
సముద్రం మధ్య కెరటాలు కోసేస్తున్నా
వందల యేళ్ళగా నిలిచిన రాయి లాగా నైతేనేం
ఎన్ని కష్టాలనైనా తట్టుకుని నిలిచే
మనిషి గుండె లోని పట్టుదల గురించి
ఎలాగైనా రాయాలని ఉంది..

ప్రతి కుహూరవం లోనూ కొత్త రాగాలొలికించే
కోయిలమ్మ తీయని పిలుపులా నైతేనేం
ప్రతి మేఘనాదానికీ వంద కొత్త భంగిమలు కనిపెట్టే
వయారి మయూరపు వాడి నృత్యంలా నైతేనేం
అనుక్షణం కొత్త కొత్త తీరాలను అన్వేషించే
మనిషి సృజనాత్మకతను గురించి
ఎవరూ రాయనిదేదో రాయాలని ఉంది..

ఎవరూ ఇప్పటిదాకా మాటలలో పెట్టనిది,
ఐనా అనుక్షణం హృదయాలలో మెదిలేది,
ఇదీ అంటూ ఒక రూపం లేనిది,
ఆఇనా ప్రతి మనిషినీ ప్రేరేపించేది,
ఈ ప్రపంచాన్ని నడిపించేది,
మనిషి మనుగడకు కారణమైనది
మనిషి గురించిన
ఆ శాశ్వత సత్యాన్ని
వివరంగా రాయాలని ఉంది..

రాయాలని ఉంది..

    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • రాయాలని ఉంది!
  • అమెరికా సంక్రాంతి

ఇటువంటివే…

  1. రాత్రంతా వర్షం కురుస్తూనే ఉంది
  2. ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది?
  3. నేనొక పాత్రని
  4. అవ్యయం
  5. CAROWIN RIDES

జులై 1999 సంచికలో ...

  • తెలుగు భాషలో అంకెలు, సంఖ్యలు – 3
  • 1998
  • “ఫూ …”
  • CAROWIN RIDES
  • అడుగుతున్నది మిమ్మల్నే! చెప్పండి సార్‌
  • అమెరి గల్పిక ఆదా
  • ఇస్మాయిల్‌ గారి కవితా తత్వం
  • ఈ శతాబ్దపు రచనా శతం
  • కావలెను
  • కృష్ణ ప్రేమ
  • జవాబు ఫలితం
  • జీవితానికి ఎన్ని రంగులో!!!
  • జులై 1999
  • ప్రేక్షకుడు
  • మైదానానికి చెలియలి కట్ట
  • రాయాలని ఉంది!
  • రెండు ఆకాశాలు
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

జవాబు ఫలితం
కావలెను

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.