సాంకేతిక విప్లవం సమాజంలోని ఎన్నో రంగాలను చెప్పుకోదగ్గ రీతిలో ప్రభావితం చేసింది. సాహిత్యం దీనికి మినహాయింపేం కాదు. ప్రత్యేకించి కోవిడ్ సమయంలో, ప్రపంచవ్యాప్తంగా ఇ-రీడింగ్ మునుపెన్నడూ చూడనంత స్థాయిలో పెరిగింది. ఇప్పుడు కోవిడ్ తగ్గుముఖం పట్టి, ప్రపంచం యథారీతిన కొనసాగుతున్నట్టు కనిపించినా, అప్పటి ఇ-అలవాట్లు ఇప్పుడు మరింత తీవ్రంగా, మరింత బలంగా కొత్త కొత్త ముఖాలతో కనపడుతూ ఉన్నాయి. కోవిడ్ ఈ ఇ-అవసరాలను మరింత స్పష్టంగా, ఒకింత ముందుగా చెప్పిందన్న మాటే తప్ప, ఇవన్నీ ఈ రోజు…
సృష్టిలోని జీవులన్నీ ఇంద్రియ ధర్మాలైన చూపు, స్పర్శ, వినికిడి, రుచి, వాసనల ద్వారా తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకుంటాయి. జీవించడానికి అవసరమైన ప్రాథమిక, సహజ జ్ఞానం ఈ ఇంద్రియానుభవపు జ్ఞాపకాల వల్ల వాటికి ఏర్పడుతుంది. రాను రానూ మేధ అభివృద్ధి చెందుతూ వచ్చింది. దానితోపాటే సామాజిక జీవనం, సంభాషణ. జీవపరిణామక్రమంలో మనుషుల స్థాయికి వచ్చేసరికి ఆలోచన, వాక్కు అత్యంత బలమైన పరికరాలుగా రూపు దిద్దుకున్నాయి. ఇంద్రియానుభూతి వల్ల ఏర్పడే సహజ జ్ఞాన స్థాయిని దాటి,…
ప్రతీ ప్రాంతీయ సమాజమూ తమ భాష, కళలు, సంస్కృతుల మనుగడ, కొనసాగింపుల కోసం తపన పడుతుంది. ప్రత్యేకించి ఒక కళ కనుమరుగవుతోందన్న భయం ఉన్నప్పుడు దానిని కాపాడుకోవడం కోసం కొంత ప్రయత్నమూ కనిపిస్తుంది. ఇతర భారతీయ భాషలతో పోలిస్తే, తెలుగులో సాహిత్యానికి ఆదరణ తక్కువవుతోందన్న ఆందోళన ఒకటి నేటి వాతావరణంలో ఉంది. కానీ గమనిస్తే ఇలా ఆందోళన పడిన ప్రతీ తరం వెనక కొత్త తరం రచయితలు, కవులు పుడుతున్నారు, సాహిత్య సృజనను కొనసాగిస్తున్నారు. ఇన్ని కోట్లమంది…
రచయితల బృందాలే మనకు మిగిలిన పాఠక బృందాలు కూడానా అన్న అనుమానం కలిగించే సంధికాలంలో నిలదొక్కుకోవడానికి తెలుగు సాహిత్యం ప్రస్తుతం అవస్థపడుతోంది. బహుశా అందుకే రచయితలు కూడా పాఠక బృందాల కోసం, రచయితలుగా తామే గుంపులో చేరాలో కూడా ముందుగానే నిశ్చయించుకుంటున్నారు. ఈ సాంఘిక సాహిత్య సంప్రదాయాలని ఎంత వంటబట్టించుకున్నా, రచన మనగలిగేది దాని నాణ్యత వల్ల మాత్రమే. పుస్తక ప్రచురణ అరచేతిలో ఉసిరికాయలా మారిపోయాక, అచ్చులో పేరు చూసుకోవడమనేది ఈనాడు ఆర్థికంగా పుష్టిగా ఉన్న అందరికీ…
డిసెంబరు, జనవరి నెలల్లో హైదరాబాదు, విజయవాడలలో జరిగే పుస్తక మహోత్సవాలు ఏటేటా మరింత బలపడి సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామం. వేల పుస్తకాలు ఒకేచోట అందుబాటులో ఉండే ఈ ప్రదర్శనలకు విచ్చేస్తున్న వారి సంఖ్యా అదే తీరున ఉంటోంది. సామాజిక మాధ్యమాలు, ప్రచురణ రంగంలో వచ్చిన మార్పుల పుణ్యమా అని రచయితల సంఖ్య పెరిగింది. రచయితలకూ పాఠకులకూ మధ్య దూరం తగ్గింది. ఈ స్నేహభావాలన్నీ పుస్తక ప్రదర్శనల్లో కనిపించడమే గాక, సాహితీప్రియులు పెద్ద సంఖ్యలో పుస్తకప్రదర్శనకు…
ప్రపంచం గత యాభయ్యేళ్ళలోనే మనం ఎన్నడూ ఊహించనంతగా మారింది. ఆ మార్పులకు తగ్గట్టు ప్రపంచమంతా తనను తాను దిద్దుకుంటోంది కానీ తెలుగునాట పిల్లల పెంపకం మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుంది. ఒక కుటుంబంగానో సమాజంగానో ఇన్నేళ్ళుగా మనం ప్రతిపాదించుకున్న విలువలకీ సంప్రదాయాలకీ గండికొడుతూ కొత్త నీరు మన వైపు ఉధృతంగా దూకుతున్నప్పుడు, దానిని అడ్డుకోలేక, తమవని చెప్పబడుతున్న ఏ విలువలనూ బలంగా నిలుపుకోలేక ఈ కాలపు పిల్లలు నలిబిలి అవుతున్నారు. ప్రత్యేకించి బాల్యం నుండి కౌమారంలోకి…
కలలూ కుతూహలమూ రెండూ పచ్చగా చిగుర్లేసే కాలం ఏ మనిషి జీవితంలోనైనా బాల్యమేనేమో. మనిషిగా శారీరకంగాను, మానసికంగానూ దృఢంగా ఎదగడానికి పౌష్టికాహారం, వ్యాయామం, మంచి సమాజం అవసరమైనట్టే మంచి సాహిత్యమూ అవసరమే. వీటిని కనీస అవసరాలుగా గుర్తుపట్టాలి. ప్రస్తుత తెలుగు సమాజంలో ఎదిగే పిల్లలకు వీటిలో ఏవి ఏరీతిన దక్కుతున్నాయన్నది ప్రశ్నార్థకమే. మొదటినుండీ మన సమాజంలో పిల్లలకు గౌరవనీయమైన స్థానం లేదు. ఒదిగి ఉండటాన్ని అభినందించినట్టు ప్రశ్నించడాన్ని అభినందించడం; అమాయకత్వాన్ని అక్కున చేర్చుకున్నట్టు, పరిశోధకతనూ కుతూహలాన్నీ చప్పట్లు…
ఆంగ్లోపన్యాసకులుగా ఉద్యోగజీవితాన్ని కొనసాగించిన సూరపరాజు రాధాకృష్ణమూర్తి ప్రాచ్య పాశ్చాత్య తత్వరీతులను మథించి విశ్వసాహిత్యాన్ని ప్రాచ్య దృష్టితో, ఆత్మతో పరిశీలించి, భారతీయ సాహిత్యంతో అనుసంధానించి విశ్లేషించి తెలుగు పాఠకలోకానికి ఒక కొత్త దృక్కోణాన్ని పరిచయం చేసిన విమర్శకులు. షేక్స్‌పియర్, ఎలియట్, బోద్‌లేర్, హాప్కిన్స్, దాన్తె, కాఫ్కా తదితరుల రచనలపై వారి విమర్శ, విశ్లేషణ భారతీయ చింతనతో ముడిపెట్టి చేసిన వ్యాఖ్యానం ఇరుభాషల సాహిత్యంతో సుదీర్ఘకాలంగా మమేకమైనందువల్ల దక్కిన సాధికారత వలన మాత్రమే కాక, ఉపనిషత్తులనీ గీతనీ నిశితంగా చూసిన…
"What is freedom of expression? Without the freedom to offend, it ceases to exist." - Salman Rushdie. ద్వేషం అనే విత్తనం మొలకెత్తితే అది ఎప్పటికీ చావదని, కలుపుమొక్కల్లా విస్తరిస్తూనే ఉంటుందని చాటడానికి రచయిత సల్మాన్ రుష్దీపై ఇటీవల జరిగిన హత్యాప్రయత్నం ఒక ఉదాహరణ. తమ స్వార్థం కోసం, గుర్తింపు కోసం, న్యూనతలను కప్పిపుచ్చుకోవడం కోసం, కొన్ని ప్రభుత్వాలు, మతసంస్థలు సమాజంలో ద్వేషాన్ని పెంచిపోషిస్తూనే ఉన్నాయి. ఆ విద్వేషానికి స్వ-పర భేదం లేదని,…
సృజన స్వేచ్ఛని కోరుకుంటుంది. ఆలోచనలోనూ, వ్యక్తీకరణలోనూ హద్దురాళ్ళు లేని ప్రపంచాన్ని స్వప్నించే సృజనకారులు ఒక మామూలు ఊహకి తమదైన అస్తిత్వాన్ని అద్ది, దానికి నవ్యతనూ ప్రాణశక్తినీ అందజేస్తారు. తరతరాలుగా సృజన బ్రతుకుతున్నది ఈ స్వేచ్చా ఊహల పునాదుల పైనే. ఆలోచనలో కొత్తదనం మాటెలా ఉన్నా, వ్యక్తీకరణలో కొత్తదనాన్ని చూపించగలిగితే, విషయాన్ని నిమిషాల మీద దేశాలను దాటించి వైరల్ చేసేందుకు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎన్నో వేదికలు. ఇన్‍స్టంట్ అటెన్షన్, ఓవర్ నైట్ సెలబ్రిటీ హోదా కొందరు సృజనకారుల…
నువ్వెందుకు రాస్తున్నావు? రాయడం అన్న ప్రక్రియలో ఎంతో కొంత దూరం ప్రయాణించిన అందరికీ ఏదో ఒక సమయంలో ఎదురయే ప్రశ్నే ఇది. ఒకానొకప్పుడు, ఔత్సాహిక రచయితలకు, ఈ ప్రశ్నకు జవాబుగా తమ అభిమాన రచయిత పేరు ఉండేది. వాళ్ళ సిద్ధాంతాలు, ఆదర్శాలు, వాళ్ళు చూపించిన జీవన విధానం, కలల ప్రపంచం పాఠకులకు, సాటి రచయితలకు ఆదర్శప్రాయంగానూ, అందుకోవాలనిపించేవిగానూ ఉండేవి. ఇంచుమించు అందరు రచయితలూ జీవితానుభవాలను భద్రం చేసుకోవాలనో, రాతని ఒక ఆయుధంగా వాడుకుని దేన్నైనా సాధించాలనుకునో, రాయడమొక…
తెలుగులో ప్రపంచస్థాయి సాహిత్యం రావట్లేదని, సాహిత్య విమర్శ లేదని, రచయితలు ఎక్కువగా చదవరని, నేర్చుకోరని, విమర్శను ఏ రకంగానూ తీసుకోలేరని, కూపస్థమండూకాల్లా ఉంటారనీ వింటూంటాం. రచయితలు దురాచారాల్ని చీల్చి చెండాడాలని, పీడితపక్షాన నిలబడి గళమెత్తాలని, సాహిత్యం సమాజపు అభ్యుదయం కోసమేననీ రొడ్డకొట్టుడు ఉపన్యాసాలు, పిలుపునివ్వడాలు కూడా వింటూంటాం. (అలా అని మనకు సాహిత్యప్రశంస లేదనుకునేరు! తెలుగు సాహిత్య సమాజాల్లో ఏ పుస్తకావిష్కరణకు వెళ్ళినా బాజాభజంత్రీలతో పనిలేనంత పొగడ్తల వెల్లువ. సాహిత్యకారుల వ్యక్తిగత సంబంధాలు, వృత్తిఉద్యోగాలు, వాళ్ళ వ్యక్తిత్వాలతో…
డబ్బు సంపాదించకపోతే సెల్ఫ్ రెస్పెక్ట్ రాదంటుంది మాలతీచందూర్ నవల్లోని నాయిక ఒకతె. ఇంటి శుభ్రత గురించీ ఆడపిల్లల చదువు ఆవశ్యకత గురించీ రంగనాయకమ్మ తనదైన సూటిగొంతుకతో చదువుకున్న కమల నవల్లోనూ మిగతావాటిలోనూ మాట్లాడుతుంది. రాబడితో నిమిత్తం లేకుండా ఆహారానికీ అలవాట్లకీ సంబంధించిన మంచి విషయాలను, ఉన్నంతలో ఇంటినీ జీవితాన్నీ ఉత్సాహభరితంగానూ ఆరోగ్యవంతంగానూ నిలుపుకునే మార్గాలను చర్చించారు ఒకతరం స్త్రీవాద రచయిత్రులందరూ. ఒక ఆరోగ్యవంతమైన సమాజానికి ఆరోగ్యవంతమైన మనుషులూ మనసులూ ఆలోచనలూ కుటుంబాలూ కావాలని వాళ్ళు గుర్తుపట్టారు. జీవితానికింకాస్త…
ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశాలన్నింటిలోనూ వార్తాపత్రికలకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అవి ప్రభుత్వాన్ని నిలదీసి విమర్శించే అక్షరదళాలు. అధికార దుర్వినియోగాన్ని ప్రశ్నించే ప్రజాగళాలు. అందుకే దృశ్యమాధ్యమాలు ఎంత ప్రాచుర్యంలోకి వచ్చినా వార్తాపత్రికల ప్రాధాన్యం ఒకింత తగ్గిందేమో తప్ప పూర్తిగా సమసిపోలేదు. నిజానికి విజువల్ మీడియా కూడా తమ కథనాలకోసం పత్రికా విలేకరుల వార్తలపైన, వారి పరిశోధనాత్మక పాత్రికేయత మీదే ఆధారపడుతుంది. అందువల్ల వార్తాపత్రికలు తమ ఉనికినీ ప్రాభవాన్ని పోగొట్టుకోవడమన్న మాట లేదు. సమస్యల్లా, మిగతా మీడియాతో పోటీపడే క్రమంలో…
రచనలు ఎందుకు పత్రికలకు పంపాలి? ఎప్పుడు అచ్చేస్తారో, ఎందుకు వేస్తారో, వేస్తారో వెయ్యరో కూడా చెప్పని పత్రికల దగ్గర పడిగాపులు పడే కన్నా, అనుకున్నదే తడవు ప్రచురించుకొనే వెసులుబాటిచ్చే సొంత వేదికలు, క్షణాల్లో స్పందనని కళ్ళ ముందుంచే సోషల్ మీడియా ఖాతాలే మెరుగని రాసే గుణమున్న అందరికీ అనిపించడంలో చిత్రమేమీ లేదు. అయితే, సాహిత్యవ్యాసంగం మిగతా కళలలాగా ఎవరి స్థాయి వారికి ప్రత్యక్షంగా తెలియనీయదు. ఇది నా అనుభవం, నా ఇష్టమొచ్చినట్టు రాసుకుంటాను అన్న ధోరణి సాహిత్యవ్యాసంగపు…
ఒక భాషకు చెందిన సాహిత్యం, ప్రత్యేకించి ఒక కాలానికి చెందిన సాహిత్యం కొన్ని సారూప్యాలను కలిగి ఉండటం గమనిస్తాం. అది కొన్ని విభజనలకు లోబడే రీతిలో కొన్ని ధోరణులను ప్రస్ఫుటంగా వ్యక్తపరుస్తూ ఉంటుంది. ఈ ధోరణులను దాటి రాసే అరుదైన సాహిత్యకారులు ఉంటే ఉండవచ్చు గాక. కాని, సమకాలీన సామాజిక ధోరణులు, సమకాలీన ప్రసిద్ధ సాహిత్యకారుల దృక్పథాలు, చాపకిందనీరులా ఒక భాష సాహిత్యాన్ని ప్రభావితం చేస్తాయనడం అతిశయోక్తి కాదు. నిలవనీరులా సాహిత్యమిలా పాతబడే సందర్భాల్లో అనువాదసాహిత్యపు అవసరం…
కాలాతీతమైన సాహిత్యం అని అనడం కొన్ని సందర్భాల్లో కొన్ని రచనలకు సంబంధించి మంచి విశేషణమే కాని, అలా కాని సాహిత్యాన్ని కొట్టిపారేయడానికి లేదు. కాలానుగుణమైన సాహిత్యం కూడా ఒక సామాజిక అవసరం. సమకాలీన సమాజపు పోకడలను నిశితంగా గమనించి చాప కింద నీరులా పాకే దుష్ప్రభావాలను ఎత్తి చూపుతూ సాహిత్య సృజన చేయడం కొన్నిసార్లు ప్రథమ చికిత్స లాంటి అవసరం. ఎనభైల దశకంలో తెలుగునాట స్త్రీవాద సాహిత్యం చేసింది దాదాపు అలాంటి పనే. స్త్రీ చేతన కోసం…
మన సమాజంలో ఒక ఆనవాయితీ ఉంది. ‘పెద్ద’వారు, ‘గొప్ప’వారు, బడా ‘బాబు’ల వంటివారు మామూలు ప్రజలు కొనవలసి వచ్చేవి చాలా చాలా కొనరు. అవి వారికి ‘కాంప్లిమెంటరీ’గా వస్తాయి, వారిని ప్రసన్నం చేసుకోగోరిన వారినుంచి. వారూ అలా తాయిలాలు ఆశిస్తారు, సాధిస్తారు. అయితే కాంప్లిమెంటరీగా ఏదైనా ఇప్పించుకున్నంత మాత్రాననే పెద్దవారు గొప్పవారు ఎవరూ కారు. పెద్దరికం, గౌరవం వచ్చి వారి మీద పడిపోవు. డబ్బులు పెట్టి కొనుక్కోవడం వారనుకున్నట్టు నామోషీ కాదు. కాని, ఆ అపోహ మాత్రం…
చీమ తల కన్నా చిన్నదేదీ అంటే, అది తినే ఆహారం అని సామెత. తెలుగులో వెలువడుతున్న పుస్తకాలలోని సాహితీనాణ్యత కన్నా కనాకష్టంగా ఉన్నదేదీ అంటే, జవాబు ఆ పుస్తకాల ముందుమాటలు అని. పుస్తకం నుంచి కాపీ పేస్టు ఉటంకింపులు, వాటి మీద కాసిని ప్రశంసలతో, ఈ రచయిత ఇలాంటి రచనలు మరెన్నో చెయ్యాలనే ఆశీర్వాదపు ఆకాంక్షతో ముగించడం - తెలుగునాట ముందుమాట కేవలం ఒక కాండెసెండింగ్ టెంప్లెట్‌. అడిగో అడిగించుకునో, కొండొకచో నవతరం పట్ల ఇది తమ…
ప్రసిద్ధ సాహిత్యకారుల జయంతులు వర్ధంతులూ పేరిట ఉండుండీ కొంత చప్పుడు చెయ్యడం ద్వారా, తెలుగుజాతి, భాష మీద తనకింకా ప్రేమ ఉందని చాటుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే ఈ చప్పుళ్ళు చేసే తెలుగుజాతి పరిధి మాత్రం చాలా చిన్నది. ఏనాడో రాసేసి చేతులు దులిపేసుకున్నవాళ్ళు, ప్రస్తుతం విరివిగా రాస్తున్నవాళ్ళు, రేపో మాపో తమ ప్రచురణలతో ముందుకు రాబోతున్నవాళ్ళు, పత్రికల, సభల నిర్వహకులు - తెలుగుసాహిత్య వర్తమాన చిత్రంలో ఎటు తిరిగినా కనపడేది ఈ నలుగురే. ఏతావాతా రచయితలే…