కానీ నేస్తం, చేస్తూనే ఉండు
నువు చేస్తున్నాననుకునే ఆకూస్తా
నీకో తృప్తి, నీ పైవాడికీ అదే తృప్తి;
తీరని దప్పిక, తెలిసీ తప్పదిక
నీవారనుకునే వారు, ఎవరో అనుకునే
వారూ అందరూ ఒకరే

పేరు గుర్తులేదు కాని, నా చిన్నతనంలో, చచ్చిపోతున్న ఒక భాషలో చివరి మనిషైన ఒక కొండప్రాంతానికి చెందిన ముసలామె వినేవారెవరూ లేక, ఒక పక్షితో తన భాషలో మాట్లాడిందని ఎక్కడో చదివేను. ఆ వార్త నన్ను కదిలించిన వైనం నేనెప్పటికీ మరిచిపోలేను. తరువాతనుండీ అనేకభాషలలో చివరివారి గురించి ప్రచురించబడే వార్తలు అడపాదడపా చదువుతూనే ఉన్నాను. ఒక భాషయొక్క ప్రతీ చివరి వ్యక్తి – అది స్త్రీ అయినా పురుషుడైనా వారు చేసేది ఇంతే.

లీలాశుకుడు 17వ శతాబ్దపు కవి. యౌవనోద్రేకంలో వేశ్య చింతామణిని తగులుకొని దారి తప్పాడు. ఒక భయంకరమైన తుఫాను రాత్రి నానా అగచాట్లూ పడి ఆమె ఇంటికి పోతే ఆమె కాస్తా ఈ మాంసపుముద్దకోసం మనసుపడి యింత తుఫానునూ లెక్కచేయకుండా వచ్చావే, ఈ మనసుని ఆ భగవంతునిపై నిలుపరాదా అన్నది. అంతే ఆయన తక్షణం విరాగియై భగవన్నామస్మరణలో పడ్డాడు. ఎంతో మధురమైన భక్తికవిత్వం చెప్పాడు.

ఒక ముఖంలో రెండు నాలుకలు
ఒకే నాలుకతో రెండు జీవితాలు.
సిగ్గు చెరుపుకుని
బుద్ది విప్పేసి నగ్నంగా వీధిలో
మురుగు కాలువల్లా పారుతూ
చింది పడుతుంటారు.

తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అనే ఆమె జిజ్ఞాసకు అక్కడి పరిచయాలు ఎంతో తోడ్పడ్డాయి. చదివిన పుస్తకాల వల్ల ప్రపంచాన్ని మార్చటం సాధ్యమే అనే అభిప్రాయం ఏర్పడింది. వామపక్ష రాజకీయాలు అర్థవంతమైనవి అనిపించింది. ప్రపంచమంతా విప్లవాలు జరుగుతున్న సమయమది. ఆ ప్రభావం క్యాంపస్‌లో చాలా ఉంది.

కుగ్రామంలో పుట్టి పెరిగి, పట్నానికి వెళ్ళి, దాన్ని వదలిపెట్టి అడవి దాపుకి వెళ్ళిన కవి మనిషినీ ప్రకృతినీ పునర్దర్శించి వాటి మధ్యనున్నది, ఆదిమానికీ ఆధునికానికీ మధ్యనున్నదీ అయిన ఒకే అనుబంధాన్ని కనుగొని జీవితానికి అర్థమేమిటనే అందర్నీ తొలిచే ప్రశ్నను ఆదరించి చేసిన కవనయజ్ఞఫలాన్ని పఠితలకిస్తూ వినయంగా తల వంచాడు.

‘వందేళ్ల కథకు వందనాలు’ అర్పిస్తూ సమర్పించిన 118 కథనాల్లో కేవలం 12 మంది రచయిత్రులు మాత్రమే దర్శనమిచ్చారు. రచయిత్రి శీలా సుభద్రాదేవిగారిని ఆ విషయం బాధించింది. వ్యక్తిగత ఆసక్తితో కథాసాహిత్య నిర్మాణంలో రచయిత్రుల భాగస్వామ్యం గురించి ఆమె ఆరా తీస్తూ పోతే, ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగు చూశాయి.

శ్రీదేవి కథలలోని పాత్రలన్నీ సజీవ చైతన్యంతో ఉంటాయి. దృఢమైన వ్యక్తిత్వం కలిగివుండి, జీవితంపైన స్పష్టమైన అవగాహన కలిగివుంటాయి. వేసే ప్రతీ అడుగూ తడబడకుండా ఆచితూచి వేస్తాయి. పొరపాటున అడుగు పక్కకు తప్పినా దానికి మరొకరిపై నింద వేయవు. తమ తప్పిదాన్ని తామే తెలుసుకుని మేలుకుంటాయి.

కథకునిగా, నవలా రచయితగా, నాటక కర్తగా, అనువాదకుడిగా భిన్న ప్రక్రియలలో శతాధిక గ్రంథాలను వెలువరించిన ఆవంత్స సోమసుందర్ అభ్యుదయ కవిగా తెలుగు సాహిత్యరంగంపై చెరగని ముద్ర వేశారు. ఈ వ్యాసం ద్వారా సోమసుందర్ రచించిన గేయసంపుటులు, మినీ కవితలను కొద్దిగా పరిచయం చేస్తాను.

ఈ కథకు ఇంత గుర్తింపు ఎలా వచ్చింది అన్న ప్రశ్న కలగవచ్చు. ఒకసారి చదవంగానే పూర్తిగా అర్థమయ్యే కథ కాదు. చదివిన ప్రతిసారి కొత్త కోణాలను, లోతులనూ చూపించే కథ. పాత్రల అంతరంగాలు, మనస్తత్వాలు అర్థం చేసుకోవడంలో మెదడుకు పని కల్పించే కథ. అందుకే గొల్లపూడి మారుతీరావు ఈ కథను నిగూఢత, మార్మికత ఉన్న మిస్టిక్‌ స్టోరీ అన్నారు. కుముదం మృత్యువుతో ముగిసిన ఈ కథ మనస్సులో నిశబ్దతను, విషాదాన్ని నింపుతుంది.

మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. గతనెలలో కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ:

సమాజంలో అభ్యుదయం, ప్రగతి అంటే ఏమిటి? ఒక తరం తన వారసత్వ జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని పదిలపరచుకొని, దానినుండి నేర్చుకొని, సమకాలీన పరిస్థితులతో అన్వయించుకొని ఆపైన ఆ సంపదకు తమ వంతు జ్ఞానాన్ని జోడించి ముందుతరం వారికి ఇవ్వడం. తన సాహిత్యకళావారసత్వ సంపదను నిరర్థకమని, అప్రస్తుతమని విసర్జించే సమాజం కేవలం ఒక నిలువనీటి మురికిగుంట. ఈ పోలిక ప్రస్తుత తెలుగు సాహిత్య సమాజానికి నప్పినంతగా ఇంకే సమాజానికీ నప్పదు. కళాకారులకు, సృజనశీలులకు కులం, మతం, వాదం వంటి బురదను అంటగట్టే సంప్రదాయాన్ని తెలుగువారు ఇప్పటికీ బలంగా నిలుపుకుంటున్నారు. ఇప్పుడు సాహిత్యకారులు కూడా నిర్లజ్జగా ఆ సమూహాల్లో చేరి ముందు నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు పాఠకులు, సాహితీవేత్తలు ఇంకా గతకాలపు రచయితలనే పట్టుకు వేలాడుతున్నారు, వారి రచనలనే ప్రస్తావిస్తున్నారు తప్ప తమవంటి సమకాలీన రచయితలను గుర్తించటం లేదు, చదవటం లేదు అన్న ఆక్రోశం ఒకటి ఇటీవల కొంత తరచుగా వినిపిస్తున్నది. ఈ రచయితల ఆక్రోశం వెనుక ఉన్నది కేవలం అజ్ఞానం, అసమర్థత. వీరిని బావిలో కప్పలుగా పోల్చటం అసమంజసం. కప్పలకు అవి ఉండే బావి గురించి కొంతయినా అవగాహన ఉంటుంది. నిర్బంధంగా ఎవరూ ఏ రచయితనూ ఎవరి చేతా చదివించలేరు. ముందు తరాల రచయితల పేర్లే ఇంకా వినబడుతుండడానికి కారణం తెలుగు పాఠకులలో ఉత్తమసాహిత్యాభిరుచి ఎంతో కొంత ఇంకా మిగిలే ఉండడం; ఆ రచనల్లోని వస్తుపరమైన సార్వజనీనత, రచనాపరంగా వారు చేసిన ప్రయోగాలు, తెచ్చిన విప్లవాలు, ఆయా రచనల ద్వారా వారు నేర్పిన పాఠాల సార్వకాలీనత… ఇలా, ఈ కాలం రచయితలు తమ రచనల నుండి తీసి చూపించలేని ఎన్నో గొప్ప లక్షణాలు ఆ రచయితల రచనల్లో ఉన్నాయి. సమకాలీన రచయితలలో పాఠకులను ఆద్యంతం తన కథనబలంతో చదివించి, కథావస్తువు పట్ల ఆలోచన రేకెత్తించగల రచయితలు బహుకొద్ది మంది. ఒక అజెండాతో మాత్రమే రచనలు చేసే రచయితలు నాసిరకం పాఠకులను, వారు కొట్టే తాలు చప్పట్లను కోరుకుంటారు. మంచి రచయితలు తమ వ్యాసంగాన్ని నిర్విరామంగా మెరుగు పరుచుకుంటూ, మంచి పాఠకులను మెప్పించే ప్రయత్నం చేస్తారు. వారిలో ఆలోచననూ రేకెత్తించగలుగుతారు. తమను గుర్తించటం లేదని ఆక్రోశించే రచయితలది ఏ కోవో చెప్పనక్కర్లేదు. తెలుగు సమాజంలో కుహనా వాదరచయితలకు, వాళ్ళకు జేజేలు పాడే భజంత్రీలకు ఏనాడూ లోటు లేదు, ఉండదు. సమాజంలో బలహీన, నిమ్న, విస్మృత వర్గాల గురించి వ్రాసినంత మాత్రాన అవి సాహిత్య రత్నాలయిపోవు. బ్రాహ్మణులనో, హిందువులనో కేరికేచర్ విలన్లుగా చూపుతూ సైక్లోస్టయిలు కథలు వరుసగా అచ్చోసినంత మాత్రాన అవి అస్తిత్వవాద సాహిత్యపు ఆణిముత్యాలయిపోవు. ఈ ధోరణులు తెలుగు సాహిత్యానికి పట్టిన పుళ్ళు! గాజుముక్కలను చూసి రత్నాలనుకునేంత అవివేకులు కారు తెలుగు పాఠకులు. ఏది మంచి సాహిత్యమో ఏది కాదో, ఏది నిలుపుకోవాలో ఏది పారవేయాలో వారికి బాగా తెలుసు. ఇక, ఇలా ముందు తరాల రచయితల పేర్లే ఇంకా వినపడుతుండడానికి కారణం మైనారిటీ రచయితలను తొక్కివేయడం కోసం అగ్రవర్ణాలు పన్నిన వ్యూహం అని ధ్వనింపచేయబూనడం తెలుగు రచయిత అందుకున్న కొత్త లోతు. తమ రచనాపటిమతో కాక రాజకీయంతో సమాజపు గుర్తింపు కోసం చేస్తున్న యాచన ఇది! తెలుగు సాహిత్యకారులు ఇంతకంటే దిగజారలేరు అనుకున్న వారికి ఇదొక కనువిప్పు. ఇటువంటి వారిని నిగ్గతీసి నిజస్వరూపం చూపి వారిని వెలివేయలేని సాహిత్యసమాజాన్ని సభ్యతతో పరామర్శించవలసిన అవసరం కనపడదు.

మనసు తరచూ మరో ప్రశ్న వేస్తుంది. ఈ ప్రశ్నకు నా మనసిచ్చే జవాబు – ఖర్చులూ ఫలితాల సంగతి నాకు అనవసరం. ఏదో సాధించాలని నేను ప్రయాణం చెయ్యడం లేదు. ప్రయాణమే నా జీవితం కాబట్టి ప్రయాణాలు చేస్తున్నాను. జీవించడానికి నాకు తెలిసిన ఒకే ఒక మార్గం ప్రయాణం…

సాహిత్యం ఇష్టంగా చదివేవాళ్ళందరూ సోషల్ మీడియాలో ఉండాలని లేదు. అక్కడొచ్చే లైకులన్నీ రీడర్స్‌‌వి అనుకోవడం మన భ్రమ. కొత్త తరం పాఠకులను ఆకట్టుకోవాలంటే వారి అనుభూతులకి, వారుంటున్న కాలానికి సరిపడే రచనలు రావాలి. ఓ సామాన్య పాఠకుడిగా నేనైతే సీరియస్ కథనాలతో పాటు జీవితంలో సౌందర్యాన్ని, ప్రేమని, ఉత్సవాన్ని, ఆశావాదాన్ని ప్రకటించే రచనలు కూడా విరివిగా రావాలని కోరుకుంటాను.

మన మొట్టమొదటి శ్వాస పుట్టిన వెంటనే గాలిని లోపలి పీల్చుకోవడంతో మొదలవుతుంది, చిట్టచివరి శ్వాస గాలిని బయటకి వదలడంతో అంతం అవుతుంది. ఈ మధ్య కాలంలో, ప్రతి రోజూ, సగటున, 22,000 సార్లు ఊపిరి పీల్చి వదలుతామని ఒక పనిలేని దివాకీర్తి లెక్క కట్టేడు.

మరుసటి రోజు పెద్దమ్మ ఉత్సాహంగా కనబడింది. కైండ్ అయిన కోడిని, కాకిని, పనిపిల్ల కుంజమ్మను, కొబ్బరికాయల వ్యాపారి అర్జునన్ నాడార్‌ను, భిక్షం అడుక్కోడానికి వచ్చిన పచ్చతలపాగా కట్టుకున్న ఫకీరునూ వేలెత్తి ఆమె వాళ్ళు కైండ్ అన్నట్టు చూపెట్టింది. ఆ రోజు మేఘాలు కమ్ముకుని ఉండటంతో ఎండ కాయలేదు. చల్లటి గాలిలో సన్నటి నీటి చెమ్మ వ్యాపించి ఉంది.

ఒక్కసారిగా ఊళల శబ్దం, ఉలిక్కిపడి నిద్రలేచా. ఎక్కడనుంచి వచ్చాయో తోడేళ్ళు అమీ చుట్టూ. అక్కడ అమ్మ, గొర్రెలు ఏమీ లేవు. అమీ వాటి వైపు చిత్రంగా చూస్తోంది. అమీ తల ఇంకా పెద్దదైంది. కళ్ళు నీలి రంగుతో వెలుగుతున్నాయి. అమీ ముఖంలో సన్నటి జలదరించే నవ్వు. క్రమంగా అది పెరిగిపోతోంది. నవ్వులా లేదు అది, తోడేలు ఊళలా ఉంది. చుట్టూ తోడేళ్ళు అమీతో పాటే ఊళలు పెడుతున్నాయి. వెక్కిళ్ళు మళ్ళీ మొదలయ్యాయి. తోడేళ్ళు నా వైపు తిరిగాయి.

సాయంత్రం వ్యాహ్యాళికి వచ్చిన బింబిసార మహారాజు, ఆ రోజు గుర్రం దాని ఇష్టం వచ్చిన దారిలో తీసుకెళ్ళినపుడు ఊరు చివర శ్మశానం దగ్గిర తేలాడు. కాలుతున్న శవాలు ఏమీ లేవు కానీ తాను వచ్చినట్టు గమనించాడు కాబోలు ఎవరో అరుస్తున్నాడు, దగ్గిరకి రమ్మని. వెళ్ళి చూస్తే రెండు మూడు రోజుల క్రితం కొరత వేయబడిన ఎవరో నేరస్థుడు. ఆ మనిషి చేతులు వెనక్కి విరిచి కట్టివేయబడి ఉన్నాయి.

స్వామిజీ పరిచర్యకోసం ఈ రామస్వామిని ఉండమని చెప్పి ఇతర శిష్యపరమాణువులు తమ పనులమీద వెళ్ళిపోయారు. రామస్వామి ఆస్తిపరుడు; సద్గుణ సంపన్నుడు; అతిధి సత్కారాలు తెలిసినవాడు. అన్నీ ఉన్నయి. శని స్థానం ఎక్కడ? అన్న విషయం మీదనే అభిప్రాయ భేదం ఉంది. నోట్లో శని ఉందని కొందరంటే, కాదు చెవులో ఉంది అని మరికొందరు. రామస్వామికి చెముడు అని చెబితే తెలిసిన విషయం చెప్పటం ఎందుకు?’ అనే పాఠకులుండవచ్చు.

రహస్యాలన్నీ తెలిసినట్టు
కొండలన్నీ ఎక్కినట్టు
త్రోవంతా నడిచినట్టు
వాక్యాలు చదువుతుంటే
అసూయగా ఉంటుంది
ఏ ప్రయాణమూ లేని
అసంతుష్ట జీవితం అడ్డొస్తుంది