ఈ సంచికలో మరొక ముఖ్యమైన విశేషం, శంఖవరం పాణిని గారు ఈ సంచికనుంచీ ఈమాట సంపాదక వర్గంలో భాగస్వామి అయ్యారు. పాణిని వృత్తి రీత్యా బయోకెమిస్ట్. ఎమరీ యూనివర్సిటీ మెడికల్ స్కూల్ లో ప్రొఫెసర్. ప్రవృత్తి రీత్యా, తెలుగు సాహిత్యం, సంగీతం, — రెండింటిలోనూ ద్రష్టే అని చెప్పచ్చు. యాహూ గ్రూపు “రచ్చబండ” మోడరేటర్లలో ఒకరుగా, అంతకు ముందు తెలుసా (తెలుగు సాహిత్యం) గ్రూపు లో క్రియాశీలక సభ్యులుగా, “ghantasAla.info” వ్యవస్థాపకులలలో ఒకరిగా ఇంటర్నెట్టులో చిరపరిచితులు. పాణినిగారు ఈమాటలో భాగస్వామి కావడం మాకెంతో సంతోషం కలిగిస్తోంది,వారికి ఈమాట స్వాగతం పలుకుతోంది.

ఉస్తాద్ అమీర్ ఖాన్ మనదేశంలో స్వాతంత్ర్యానంతరకాలంలో హిందుస్తానీ సంగీత ప్రపంచంలో సుప్రసిద్ధుడుగా వెలిగిన గాయకుడు. అగ్ర గాయకుడైన బడేగులాం అలీఖాన్ కు దాదాపు సమ ఉజ్జీగా ఆయన పేరు పొందాడు. ఆయన సంగీతాన్ని పరిచయం చేసే ప్రయత్నమే ఈ వ్యాసం.

తానా వారు వెల్చేరు నారాయణరావుగారికి Lifetime Achievement Award ఇస్తున్న సందర్భంలో, తెలుగునాడి సంపాదకులు జంపాల చౌదరి గారి ప్రేరణ పై జులై 2007 తెలుగునాడి సంచికకి రాసిన సంక్షిప్త వ్యాసం ఈ వ్యాసానికి మూలం.

మొన్న మొన్నటి దాకా, మన పక్కింటి వాడి ధర్మవా అని, తెలుగుని ప్రాచీన భాషగా గుర్తించాలని నానా రకాలవాళ్ళూ, నానా రకాల వాదాలు, వివాదాలు, నినాదాలూ అల్లేశారు, వల్లించేశారు. అదికొంత సద్దుమణిగిందనుకుంటే, దానికి తోడుగా ఇప్పుడొక సరికొత్త నినాదం తెలుగునాట తయారయ్యింది.

– తెలుగు భాష అంతర్జాతీయ భాషగా గుర్తించాలి – అని.

“చిన్నప్పట్నుంచీ చిలకాగోరింకల్లా పెరిగారు. అనుకున్నసంబంధం…మనముందు పెరిగిన కుర్రాడూ మంచి వాడూ అనుకుంటే… చివరి నిమిషంలో ఇలాంటి పేచీపెట్టాడు…”

కురుసభకు రాయబారానికి పోయేముందు కృష్ణుడు పాండవుల అభిప్రాయాన్ని తెలుసుకుంటాడు. ఆ సందర్భంలో తన అభిప్రాయాన్ని పై విధంగా చెప్పింది ద్రౌపది.

శంకరుడు లఘు స్తోత్రములనుండి బృహద్గ్రంథముల వరకు సుమారు నాలుగు వందల రచనలను సృష్టించెను. నేను అందులోని కొన్ని ప్రార్థనా స్తోత్రములను ఆధారము చేసికొని ఈ వ్యాసమును వ్రాయుచున్నాను.

ఈ సుందరం మావయ్య ఓ విచిత్రమైన మనిషి! అవతల వాళ్ళని పొగిడి తన పనులుచేయించుకొనే దిట్ట అని కలిసిన మర్నాడే అర్థమైపోయింది. మాయింటికి భోజనానికి పిలిచాకా వాళ్ళింటికి బదులు భోజానానికి పిలిస్తే వెళ్ళినపుడు, మా అవిడ వండిన వంకాయ కూర అద్భుతం అనీ, అలాంటి కూర తన జన్మలో తినలేదంటూ అప్పటికప్పుడు మా అవిడ చేత వాళ్ళింట్లో పోపు పెట్టించిన ఘటికుడు సుందరం మావయ్య.

విదేశాంధ్ర ప్రచురణల సంస్థాపకులు, ఇంగ్లీషు ప్రొఫెసర్ గూటాల కృష్ణమూర్తి గారు సూర్యకుమారి గారి పై ఒక ప్రత్యేక గ్రంధం ప్రచురించబోతున్నారు. ఇదివరలో, ఆయన శ్రీశ్రీ గారి మహాప్రస్థానం పుస్తకం, శ్రీశ్రీ స్వయంగా చదివిన గేయాల టేపు మనకి అందించారు. ఈ పుస్తకం ఇండియాలో నవంబర్ 2007 లోనూ, ఇంగ్లండులో ఫిబ్రవరి 2008 లోనూ విడుదల కాబోతోంది.

ఆలోచనల్లో ఒకరిగురించి ఒకరికి సందేహాలు.. ఇంతలోనే కరంటు పోయింది. ఫ్యాను కదలడం తగ్గిపోయేకొద్దీ నిశ్శబ్దం పెద్దదవుతోంది. ఇద్దరూ అసహనంగా కదిలారు. ఆమెకి అర్థమయింది, అతడు నిద్రపోలేదని, అతడికీ అర్థమయింది, ఆమె కూడా నిద్రపోలేదని..

కథలు, కవితలు, వ్యాసాలతో ఈమాట మే 2007 సంచిక విడుదల! ఈ సంచికలో ప్రత్యేక ఆకర్షణ, స్వర్గీయ సంపద్రాఘవాచార్యులు గారు శ్రీశ్రీ సాహిత్యాన్ని లోతుగా, […]

కవులు, కథకులూ, వ్యాస రచయితలూ, చాలా సున్నితమైన వాళ్ళు. విమర్శలు సునిశితంగాను, సూటిగాను,పెళుసుగా లేకుండానూ చెయ్యడం అవసరం. ఈమాట అభిప్రాయవేదికలో వ్యక్తిగత దూషణకి తావు లేదు. ఓక్కొక్క సారి, పొరపాటున దూకుడుగా అనాలోచితంగా రాసిన వాక్యాలు కత్తిరించకండా ప్రచురించడం జరిగింది. అందుకు నా క్షమాపణలు. ఇక ముందు కత్తిరించవలసిన పరిస్థితి రాకుండా సహకరించమని నా మనవి.

ఊపిరి అందడంల్యా. యమకల్లో నొప్పి. కాలు వూడి రాకంటే ఊపిరి బిగిసి సస్తాననిపిస్తాంది. బాగన్నా యిరక్కపాయనే. నాకు మొగదాడు కుట్టకపోతేనేమి, సెప్పినమాట యినపోతినా నేను!?

హయగ్రీవశాస్త్రి ఇప్పుడు అనాధశవం. హనుమంతుకి పురాణం శాస్తుర్లు గారు ఎప్పుడో పురాణంలో పిట్ట కథలా చెప్పింది గుర్తుకొచ్చింది. అనాధ ప్రేత సంస్కారాత్ కోటియజ్ఞ ఫలం లభేత్, అని.

సంపత్ గారి వ్యాసం 1952 భారతి మాస పత్రికలో వచ్చింది. అంతకుముందు శ్రీశ్రీ కవిత్వం పై వచ్చిన వ్యాసాలన్నీ, “అభినందన ధోరణిలో జరిగిన గుణ సంకీర్తనలే.” శ్రీశ్రీ కవిత్వాన్ని లోతుగా పరిశీలించి విమర్శించే ప్రయత్నం ఇంతకు (1952 కు) పూర్వం జరగలేదు. ఆ రకంగ చూస్తే, సంపత్ గారి వ్యాసం seminal work అని చెప్పచ్చు.