సరిగమల సరాగాలు🎶

స్వాతంత్ర్యం తెచ్చి పెట్టిన సమర గీతాలు!

స్వదేశీ ఉద్యమంలో కేవలం భౌతికమైన ఆయుధాలే కాదు, సంగీత సాహిత్యాలూ, కలం అనే అత్యంత శక్తివంతమైన అదృశ్య ఆయుధాలు కూడా ఎంతగానో పోరాడాయి. బ్రిటీష్ వారి బానిస సంకెళ్ళనుంచి విముక్తి చేసి, స్వేచ్ఛాస్వాతంత్ర్యాల వైపు మనల్ని నడిపించటంలో ఆనాటి దేశభక్తి గీతాలు ఓ కీలకపాత్ర పోషించాయి. నాటినుంచి నేటివరకూ, ప్రతి భారతీయుడి హృదయంలో దేశభక్తిని రగిలిస్తూ, అచంచలమైన స్ఫూర్తిని నింపుతున్న ఆ అమర గీతాల ప్రయాణం ఒక్కసారి గుర్తు చేసుకుందాం! స్వాతంత్ర్య సమర యోధులుగా వెలిగిన ఆ మహనీయు గేయకర్తలకు, వారి అద్భుతమైన స్వరకల్పనలకు మనసారా జోహార్లు అర్పిస్తూ, విప్లవాత్మకమైన ఆ పాటల మధుర స్మృతులను మీ ముందుకు తీసుకువస్తున్నాము!