ఒంటరిగా, ప్రశాంతంగా, స్వతంత్రంగా, ఆరోగ్యంగా పల్లెటూరిలో ఉండేవారు తాతయ్య. ఆయన జీవితంలో ఒక్క cataract ఆపరేషన్‌ తప్పించి డాక్టర్లు, మందులు, హాస్పిటళ్ళు ఎరగరు. ఒకరోజు సాయంత్రం ఆవుపాలు పిండటానికి వెళ్ళిన తాతయ్య పదినిమిషాలలో లోపలికి వచ్చారు, ఎడమచేయి నొప్పి పుడుతున్నాదంటూ. పక్కింట్లో ఉన్న తన చిన్నకొడుక్కి కబురంపి, ఒక గంట తర్వాత కొన్ని దశాబ్దాలుగా ఆ ఇంట్లోనే తాను ఊగిన ఉయ్యాలబల్లమీద పడుకుని “శివ శివా” అంటూ కన్నుమూశారు.

పార్టీ అయి అంతా వెళ్ళాక మర్చిపోకుండా మళ్ళీ అడిగింది తనే “పేకాట ఎప్పుడు, ఎందుకు వదిలిపెట్టారు”?

ఎంత సేపూ ఏదో పుస్తకాలమీద ఎక్కువ ధ్యాస. చిన్నప్పుటినుంచీ ఏర్పడిపోయిన అలవాటు. మళ్ళీ మేఘసందేశం తియ్యబోతుంటే , గబుక్కున ఆమెకు మధ్యాహ్నం మూడు గంటలకు టెన్నిస్ లెసన్ ఉన్న సంగతి గుర్తొచ్చింది.

ఆ చలికి భూమ్యాకర్షణ కూడ గడ్డకట్టుకు పోయిందా అన్నట్లు మంచు కూడ కురవటం మానేసింది. అంత చలిలో కంఠంలో ప్రాణం ఉన్న ఏ జీవి కూడ సాహసించి బయటకి రాలేదు. కాని, బయట ఏదో ఉంది. లోపలకి రాడానికి ప్రయత్నిస్తూన్నట్లు ఉంది. కుటీరపు గోడలని గోకుతోంది!

బీచ్ లో అందరూ ఉత్సాహంగా ఆడుకుంటున్నారు. నా కష్టాల కడలి నాతో ఆడుకుంటోంది. అలలతో దోస్తీ చేస్తూ, అమ్మ నాన్న ల కేకల్ని లెక్కచేయక మున్ముందుకు వెళుతున్నారు పిల్లలు. ఇలా లోలోపలికి వెళితే ….. సమస్యలు తీరవూ? ఎన్నడూ లేని కొత్త ఆలోచన నాలో.

“ఒక్క పూట మందు లేకపోతే ప్రాణం పోదులే…రమేష్ గారు చూడండి…అస్సలు మందు ముట్టుకోరట. ఏ దురలవాటూ లేదట. వింధ్యకు అన్ని పనుల్లో చాలా హెల్ప్ చేస్తాడట. చూసి నేర్చుకోండి” అంటూ బయల్దేరదీసింది.

బుల్లి భూషయ్యకి మహరాజవుదామని కోరిక పుట్టింది. ఒకటే ఉబలాటం. ఇదేమీ కొత్తగా పుట్టిన కోరిక కాదు. అన్నయ్య చిన భూషయ్య ఆరేళ్ళకిందట అనుకోకండా మహరాజుగా ఎంపిక అయినప్పటినుంచీ, తను కూడా మహరాజవ్వాలని తహ తహలాడటం మొదలెట్టాడు. తనకేం తక్కువయిందని? చదువులేదా? చక్కని సంసారం లేదా?

ఇద్దరి మనసులూ ఒక్కసారి అవ్యాజమైన ప్రేమ పూరితాలయ్యాయి. ఇంతకుముందూ అదే ప్రేమ ఉంది. ఇప్పటి ప్రేమకంటే వెయ్యి రెట్లు ఉండేది. కానీ ఆ ప్రేమలో కోరిక ఉంది. ఈ క్షణం ఈ ప్రేమలో ఏ కోరికా లేదు. నిర్వాణం పొందిన మనస్సు లో జీవన రహస్యాన్ని తెలిపే యదార్థమైన ప్రేమ ఉంది.

పావుగంట అయింది. రంగంమీదకి కొత్త పాత్ర ప్రవేశించింది. “మామీ” పాప అరిచింది హఠాత్తుగా. చుట్టూ కూర్చున్నవాళ్ళు హుష్ష్ అంటూ తమ అసహనాన్ని వెలిబుచ్చారు. నీలవేణి వాళ్ళకి క్షమాపణలు చెప్పుకుని, ఆపాపని మళ్ళీ నెమ్మదిగా అడిగింది ఆవిడ మీఅమ్మాఅని. అవును మామీయే. తల్లెవరో నిర్ధారణ అయిపోయింది. నీలవేణి ప్రాణం తెరిపిన బడింది. ఆట ముగిసేసరికి ఆపసిదానిబాధ్యత కూడా తీరిపోతుందని.

భర్తలందరూ భిక్షువులుగా మారితే, స్త్రీలందరూ ఇంటి బాధ్యతలు నిర్వహిస్తూ ఉండాలా? సృష్టి విరుద్ధమైన ఈ సన్యాసం వల్ల ఒనగూరే ప్రయోజనం ఏమిటని ఆ బుద్ధుణ్ణే సరా సరి అడుగుతాను. నా నందుణ్ణి నాకివ్వమని అర్థిస్తాను.

“ఊఁ హూఁ. దోషమంటూ ఉంటే అది నాలోనే ఉంది. మిగిలిన వారి నందరినీ ‘ఆజానుబాహుడూ’, ‘అరవింద దళాక్షుడూ’, అంటూ వర్ణించి, నన్ను మాత్రం ‘వక్ర తుండా, మహాకాయ, గుజ్జురూపా అని ఎందుకంటారు? అసలు నేను దేవుణ్ణేనా? కాదు. దేవుళ్ళకి బఫూన్ని.”

ఎప్పుడైతే భిక్షా పాత్ర త్యజించాలనుకుంటున్నాడో, తన ప్రియ సఖిని చేరుకోవాలనుకుంటున్నాడో, మనస్సుని ఇంటి దారి మళ్ళించాడో అప్పుడే నందుని ధైర్యం సన్నగిల్లింది.