ఏటి ఒడ్డున మేటలు వేసిన ఇసుక తేటగ పారే నీరు పరాచికాలాడే ప్రతిబింబాల వైపు పరీక్షగా చూస్తుంటే హఠాత్తుగా లేచి తటాలున వంగి లావాటి […]
శీర్షికలు కవితలు
గదిలో ఫాన్‌తిరగదు బల్లి నాలుకపై జిగురు ఆరదు పాత రహదారుల మీదే కొత్త రహదారులు వేస్తారు మరణించిన మహామహులు నగరంలో విగ్రహాలై మొలుస్తారు చీమలు […]
నీ క్షణికానందాన్ని ఆమె తొమ్మిది నెలలు మోసింది. వీడైతే దానిని నూరేళ్ళూ మోయవలసినవాడు. ఇంకా నీ బెల్టు చారల్ని, వేళ్ళ ఆనవాళ్ళని కూడా ఎక్కడ […]
తడిచేతుల సముద్రం తడిమి తలబాదుకొంటుంది శిలలపై.. బడితెలేని బడిపంతులు పొడవాటి ఒడ్డు అదిలిస్తోంది చదవలేని కెరటాలను పచార్లు చేసేవారిని విచారం లేని చలిగాలి వీచి,పరామర్శిస్తుంది. […]
నీ గదిలోకి ఎవరూ రారు టేబుల్‌సొరుగును తెరవరు ఆకుపచ్చని ఏకాంతాన్ని అనుభవించు. పొద్దుతిరుగుడు పూలు నిద్దురలో,కలలో సద్దు చేయవు. అరాచక ఆకాశాన్ని విరిగిన చంద్రుని […]
ఒక్క రాత్రిలో పర్వతాలను కదిలించకు మహావృక్షాలను పెకలించకు నిశాగానం విను అరమూసిన కన్నులతో నడిరేయి నల్లని సంగీతాన్ని గ్రోలు నురగల అంతరంగం..అలల సద్దు మెరిసే […]
తీపి పదార్థాలకు నోరూరదు షోకేసు అద్దాలు నిస్వార్థంగా బ్రతుకుతాయి జలపాతంలా దుమికే మౌనం చెక్కనావై పగిలిపోగలదు భూమి గదిలో కునుకుతీసే కబోది లావాసర్పం ఏమీ […]
బోనులో సింహం నిదురిస్తుంది తపస్సు చేసుకొనే విత్తనం కదలదు ఇంకే బురదలో కత్తులు లోతుగా దిగుతాయి కూలే వంతెనలు పాదస్పర్శకోసం పరితపిస్తాయి గుబురాకుల్లో దాగిన […]
ఓలమ్మీ! గాజులు పిన్నీసులు జడ కుచ్చులు లోలాకులు చాదుబొట్టు కొనుకుంతావా?! ఓలి పిల్లా! పొగడరు ముచ్చిబొట్లు సక్కబొట్లు రంగుబొట్లు స్నోముద్దలు సవరాములు చెంపపిన్లు కొనుకుంతావా?! […]
ఉదయపు గాలి తాకిడికి కలల గాలిపటం తెగడంతో చటుక్కున లేచి కూచుంటాం. తెగిన గాలిపటం ఏ మరుపు పొరల చింతగుబురుల్లోనో చిక్కుకొని, మరి కనిపించటం […]
పాపం దానికేమీ తెలీదు. దాన్నేమీ అనకండి. మనం ఛేదించలేని మృత్యు రహస్యాన్ని అది గుప్పిట్లో పెట్టి నిల్చుంది. వేళ్ళలా చుట్టుకున్న వరల వెనకాల్నించి ఎవరు […]
ఎవరైన ద్వారము ఇవాళ తెరువరా? నివారించలేను, సవారి గుర్రముసకిలించె నురగతో!! ఏ వాలు కెరటమో;తెరచాప కదిలెను. చేవ్రాలు చేయలేను! ఎవరైన ద్వారము ఇవాళ తెరువరా? […]
ఒక మధ్యాహ్నం ఎండ కనురెప్పలు కాల్చినట్టు గుండ్రని నవ్వుల గోళీలు రాచుకున్నట్టు ఎర్రని మెట్లపై ఎపుడూ పాకే నీరు పలక పగుల గొట్టే బాలుడు […]
వర్షం వచ్చి నిలువునా నన్ను తడిపి వెలిసిపోయింది. తెప్పరిల్లిన ఆకాశం కింద నీ నవ్వులు కాగితప్పడవలై తేలిపోసాగినయ్ .
రాలేనేమో చిన్నీ రాలేనేమో మళ్ళీ అయినా సరే రాత్రి మాత్రం దీపం ఆర్పేయక నా రాకను నీవు గుర్తించగలవు చిన్నీ పరిమళ యామిని పరవశించి […]
పొడి ఆకులను నడిచే పాదాలను పాకే నీడల గోళ్ళతో తాకుతుంది ఎండ. తిండి వనాల్లో తిరుగాడే జంతువులు అంతా బాహిరమైతే ఆత్మకు చోటెక్కడ? వట్టిపోయిన […]
పాపను పడుకోబెట్టినపుడు తనపై పరుచుకున్న నిద్రని దుప్పటిలా తొలగించివచ్చి ఎప్పటిలా ఆమె తిరిగి పనిలో పడింది. కళ్ళకి అక్కడక్కడా అంటుకొనున్న కలని కాసిని చన్నీళ్ళతో […]
నిండైన దీని జీవితాన్ని ఎవరో అపహరించారు. దీని బలాన్ని, బాహువుల్ని, వేళ్ళని, వైశాల్యాన్ని, నింగిని అటకాయించే నిర్భయత్వాన్ని, ఎవరో నిర్దయగా, నెమ్మదిగా, అందంగా అపహరించారు. […]
ఈ కష్టాల్ని భరిస్తూ ఈ కాంప్లెక్సిటీని ఓర్చుకొంటూ ఎన్నాళ్ళిలా సాగిపోదాం ? సముద్రం నుంచి విడిపోవాలనే పడుచు కెరటాలు ఉవ్వెత్తున లేచి మళ్ళీ ఒక్కసారికి […]
ఇసుకను మోసుకపోయే నది ఎండిపోయింది బండరాళ్ళు బయటపడ్డాయి. శబ్దం ఆగిపోతుంది ఆలోచనకు మొదలు అక్కడే.