రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

వందేమాతరం

రచన: ఉదయకళ
మార్చి 2008

హిమపాతాలు, మంచుమణుల మాలికలు
ఛాయాచిత్రాలలో మాత్రమే మిగులుతాయేమో
ముత్యాల కూపాలు, పగడాల ద్వీపాలు
భూగోళ చిత్రాలలో మాత్రమే మిగులుతాయేమో
శార్దూలాలు, మత్తేభాలు, హరిణులు, కోకిలలు
కావ్యాలలోని పద్యాలలో మాత్రమే మిగులుతాయేమో
జలచరాలు, భూచరాలు, ఖేచరాలు
అగోచరాలై పోతే మిగిలేది
చిల్లులు పడ్డ ఆకాశం
పెల్లుబికిన సముద్రం
కుంచించుకొన్న భూఖండం
నిర్జీవమవుతున్న నిఖిలం
తల్లీ
వందేమాతరం

నదులు సాగరాలు మలినాకరా లవుతున్నాయి
మహారణ్యాలు మరుభూము లవుతున్నాయి
మహీతలం వేడితో మాడిపోతూ ఉంది
పాడిపంటలు పాడవుతున్నాయి
తల్లీ
సుజలాం సుఫలాం మలయజశీతలాం
సస్యశ్యామలాం మాతరం
వందే మాతరం

కలుషితమైన అంతరిక్షంలో
మసకబారిన వెన్నెలలో
రాగాలకు బదులు రాత్రులు
రోగాల మూలుగులతో మ్రోగిపోతున్నాయి
నేల బీటలువారి చెట్లు ఎండిపోతున్నాయి
తల్లీ
శుభ్రజ్యోత్స్నా పులకితయామినీం
ఫుల్ల కుసుమిత ద్రుమదళ శోభినీం

మేము కలలు గన్న వరాలేనా
ఈ బాధ, వేదన, రోదన
వికసించలేని నవ్వుల పువ్వులు
మూగవోయిన మధుర వాణులు
కష్టభూయిష్ఠమైన జీవితాలు
ఎండమావులలో జలక్రీడలు
తల్లీ
సుహాసినీం సుమధురభాషిణీం
సుఖదాం వరదాం మాతరం
వందే మాతరం

శైలాగ్రంనుండి అగాధం చేరడానికి
ఒక్కడుగు మాత్రమే చాలు
ఆశ పేరాశగా మారి
దురాశగా రూపొంది
నేడు నిరాశ అయిపోయింది

అయిపోయింది
అంతా అయిపోయింది

చివరకు మిగిలేది
అన్ని గ్రహాలవలె
సౌరకుటుంబంలో
మరొక నిర్జీవమైన గ్రహం
మన గృహం
తల్లీ
వందే మాతరం

    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • శ్రావణమాఘాలు
  • హిమబిందు
  • అమ్మ
  • నా అందం ఏమయింది?
  • మరచిపొమ్మంటున్నారు

ఇటువంటివే…

  1. దారి
  2. ఆహా
  3. వేసవి
  4. మూగవోయిన గొంతు
  5. రెండు కవితలు

మార్చి 2008 సంచికలో ...

  • ఆహా
  • ఏది నిజం? – “రషోమాన్” జాపనీస్ సినిమా
  • ఓ చందమామ
  • కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 2: లైబ్‌నిట్జ్ స్వప్నం
  • కల్యాణి రాగం – అనుబంధం
  • కేయాటిక్ సమీకరణం
  • చెట్టు కూలిన వేళ
  • జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 1
  • తెరమరుగవుతున్న తెలుగు నాటకం -2
  • దాలిగుంటలో లీయా
  • నాకు నచ్చిన పద్యం: పారిజాతాపహరణంలో సత్యభామ
  • నిశ్శబ్దం నీకూ నాకూ మధ్య
  • ప్రేమికుల దినం
  • బ్లాగుల గురించి – నా మాట
  • మచ్చ
  • లిటిల్‌సైంటిస్టు
  • వందేమాతరం
  • వినినంతనె వేగ పడక
  • వెచ్చని మనసులు
  • షష్ఠ్యంతములు
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

ప్రేమికుల దినం
ఆహా

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.