మారిషస్ వంటి బహుభాషీయ దేశంలో భాషా సంపర్కంవల్ల ఇక్కడి తెలుగు భాషలో అనేక మార్పులు వస్తున్నాయి. భాషలో మార్పులు రావటం సహజం. కాని, వివిధ భాషల సంపర్కంవల్ల మారిషస్ దేశంలో తెలుగు భాషా వ్యవహర్తల భాషణంలో, లేఖనంలో ఎన్నో దోషాలు వస్తున్నాయి. సాధారణంగా ఒకభాషలో శిక్షణ పొందేవాళ్ళకు ఆ భాషాప్రయోగం ఎటువంటి సమయ సందర్భాలలో చేయాలో తెలిసి ఉంటుంది కానీ ఆ భాషా ప్రయోగం ఏ విధంగా చేయాలో స్పష్టంగా తెలియదు.
Category Archive: వ్యాసాలు
ఈనాటి కథను తలచుకొంటే ఆనాటి ఒరవడి కొనసాగడం లేదేమోనన్న ఆందోళన. బెంగ. నిజమేనా? మంచి కథలు రావడంలేదా? కొత్త కథకులు కలం పట్టడంలేదా? గత ఏడెనిమిదేళ్ళుగా, స్థూలంగా 2010 తర్వాత- కాలక్షేపం కోసమో పేరు కోసమో పోటీల కోసమో రాసేవాళ్ళని పక్కన పెట్టి- కథలు రాస్తోన్నవాళ్ళను చూసినట్టయితే ఆ నిర్వేదమూ నిస్పృహ అనవసరం అన్న భావన కలుగుతుంది. కొత్త కథకులు, యువ కథకులు వస్తున్నారు. మంచి కథలు రాస్తున్నారు అన్న ఆశ కలుగుతుంది.
కంఠవశమయే గుణం కవిత్వం యొక్క అతిముఖ్యమైన లక్షణాలలో ఒకటి. సాపేక్షంగా చెప్పాలంటే ఛందోబద్ధమైన కవిత్వానికి కంఠవశమయే గుణం ఎక్కువగా వుంటుంది. ఆ కవి గొప్పవాడు కావచ్చు, కాకపోవచ్చు. ఆ పద్యం గొప్ప పద్యం అవొచ్చు, అవకపోవచ్చు. ఛందోభంగం కాకుండా వ్రాయబడితే చాలు కంఠవశమవుతుంది.
“నువ్వు స్వర్ణకమలం సినిమా చూశావు కదా? అందులో శ్రీలక్ష్మి వినాయకుని పటానికి హారతి పడుతూ- శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం అంటూ ఆంజనేయ దండకం చదువుతుంది గుర్తుందా? అది గుర్తుకు వచ్చి నవ్వుతున్నాను.”
“అదేమిటి, నేను చదివింది ఆంజనేయ దండకం కాదుగా? శుక్లాంబరధరం వినాయకుడి స్తోత్రమే కదా!”
ఎడిటింగ్ పని మొట్టమొదటిగా ‘శ్రీరస్తు’ రాసి కాగితం మీద కలం పెట్టినప్పుడే మొదలవుతుంది. (రాతకోతలని కావాలనే జంటకట్టారేమో ఆ పనులని!) కాగితం మీద జరిగే ప్రతీ ఒక కొట్టివేత, ఒక రచయిత కూర్పరి భూమికను భరించి చేస్తున్న పనే. క్లుప్తతకీ ప్రభావానికీ మధ్య సమన్వయం కలిపించడమే కూర్పరి పని.
ఈ పాటలను ఎలా పాడాలి, ఎవరైనా పాడియున్నారా అనే విషయము నాకు తెలియదు. కాని ఇట్టి పాటలను అందఱు పాడే విధముగా ఒక స్థాయి కన్న తక్కువగా ఒక half octaveలో ఇమిడేటట్లు పాడుకొంటారు. అందు వలన సంగీతములో తరిఫీదు ఉన్నవారు, మంచి శారీరము ఉన్నవారు మాత్రమే వీటిని పాడుటకు అర్హులు అని భావించరాదు.
మాజిక్ రియలిజంను – మాంత్రిక వాస్తవికత – నిర్దుష్టంగా నిర్వచించడం సాధ్యంకాదు. వేర్వేరు రచయితల మాజిక్ రియలిజం పద్ధతుల మధ్య చాలా తేడాలు కనబడతాయి. చంద్రశేఖరరావు కూడా తనదైన చిత్రమైన మాంత్రిక వాస్తవికతను క్రమంగా సృజించుకోగలిగారు. ఆ తర్వాత ఆయన రాసిన కథలన్నింటిలోనూ అదే మౌర్నింగ్ వాతావరణం, గుడ్డసంచి భుజానికి తగిలించుకుని తిరిగే మోహనసుందరం, పూర్ణమాణిక్యం, మోహిని, పార్వతిలాంటి అవే పాత్రలూ, అదే విషాదభరిత కథనమూ…
“హైదరాబాదు జర్నలిస్టు కాలనీలో (ఇప్పుడది అపోలో హాస్పిటల్ దగ్గర వుంది.) చిన్న ఇల్లు కట్టుకున్నాను. దానికి సీతమ్మ గడప అని పేరుపెట్టుకున్నాను. బావుందా?” అని అడిగారు. “చాలా బావుంది. మొత్తానికి విశాఖ వాసన వుంది. గడపలు, వలసలు అక్కడివే కదా…” అన్నాను. ఆనందించారు. కాని పాపం ఆ ఇల్లు నిలుపుకోలేకపోయారు.
చాలామందికి పెయింటింగ్ అంటే కేన్వాస్ మీద ఆయిల్ కలర్స్‌తోనో ఆక్రిలిక్ రంగులతోనో వెలుగునీడలు చూపెట్టడంతోనే చిత్రంలోని ఆకారంలో చైతన్యం వస్తుంది. ఇది రేఖలతో సాధ్యం కాదనుకుంటారు; రేఖలు ‘కళ’ కిందికి రావనీ గీతలు, రేఖలనే స్ట్రోక్‌లతో నిండిన ఆకారాలను వట్టి ‘ఇలస్ట్రేషన్’ అనుకుంటారు. నిజానికి చిత్రకళకి అలాటి నియమం ఏదీ లేదు.
హాస్యమనేది ప్రధానంగా బాధని వ్యక్తీకరించే వక్రీకరించే ఒక కటకం. దూరంగా ఎక్కడో దేని మీదో ప్రతిబింబించే హాస్యాన్ని వెనక్కి వెత్తుకుంటూ వెడితే దాని మూలం బాధ అని తేలుతుంది. ఈ బాధకి కారణలు కోకొల్లలు – శారీరిక/మానసిక లోపాలు, రుగ్మతలు, వైకల్యాలు, భయాలు, కోపాలు- ఇవన్నీ హాస్యానికి ముడిసరుకులే.
శ్రీరామ భూపాలు డా – సీతతో
జేరి చనెఁ గాననములో
వారితోఁ దా వెళ్ళెఁగా – వదలకను
వారిజాక్షుని నీడగా
ఘోర కాంతారములలోఁ – గూర్మితో
దూరముల గడచె నతఁడున్
చారుహాటకరూపుఁ డా – సౌమిత్రి
వీరవిక్రముఁడు గాదా…
అమూర్తత సినారె కవిత్వంలో ప్రధాన లక్షణం. నిర్దిష్ట సంఘటనలకి, ఉద్యమాలకి ఉవ్వెత్తున ఎగసిపడిన సందర్భాలు అరుదు. నిర్దిష్టతను గుర్తించి స్పందించాల్సిన సందర్భాల్లోనూ ఆయన అమూర్త వ్యక్తీకరణనే ఆశ్రయించాడు. భావ సంయమనం పాటించాడు. ఆయనది పెద్దమనిషి తరహా కవిత్వం. ఆయన కవుల్లో లౌక్యుడు. లౌక్యుల్లో కవి.
“యాత్రలకు ధనమూ సమయమూ అవరోధాలు కావు. భాష, భద్రత, రక్షణ అధిగమించలేని సమస్యలు కానే కావు.” నిస్సందేహంగా!! పాతికేళ్ళ క్రితం ఓ ఢిల్లీ పెద్దాయన వందేవంద రూపాయల్లో తాను హిమాలయాల్లో రెండురోజులపాటు చేసిన ముప్పై కిలోమీటర్ల ట్రెక్ గురించి రాశాడు. అది మనసులో నిలిచిపోయింది. ‘నేనూ అలా చెయ్యాలి!’ అన్న ఆకాంక్షగా పరిణమించింది.
హాస్యం అశ్లీలం, సంసార పక్షం అని ఉండదు, పండితే పొట్ట చెక్కలు చేస్తుంది, చెడితే, అసందర్భంగా, అసంబద్ధంగానే ఉంటుంది. సభ్య సమాజం బాహాటంగా చర్చించుకునే విషయాలు కాని వాటికి కూడా తగిన సందర్భం సృష్టించి వాటి నుండి నవ్వులను వెలికి తీయగలిగితే, హాస్యానికి అశ్లీల దోషం ఎంత మాత్రమూ అంటదు.
మరి మన మహనీయ చిత్ర శిల్ప కళాఖండాలు రెండవ ఎక్కం అప్పగించినంత సులువుగా ప్రజల కళ్ళకి కట్టడం అసాధ్యమా? కానేకాదు. సాంస్కృతిక, కళా రంగాల విశేషాలూ జనం కళ్ళలో, నోళ్ళలో నిత్యం ఉండాలంటే శ్రోతలు, పాఠకులు, సందర్శకులు, ప్రేక్షకులు, భక్తులూ అనే మనం కొంత దురభిమానం, చౌకబారు ఆనందం అనే ‘ఎంటర్‌టైన్‌మెంట్’ను కొంచం త్యాగం చేసే ప్రయత్నం చేసుకోవాల్సిందే.
పద్యములకు పేరులను లాక్షణికులు ఎలా పెట్టారో? ఒకే పద్యానికి ఎన్నో పేరులు, ఒకే పేరుతో ఎన్నో పద్యాలు! వృత్తపు పేరును బట్టి గణనిర్ణయము సాధ్యమా? క్రొత్త వృత్తములకైనా ఇలా చేయవచ్చు గదా? ఇంతవఱకు నేను సుమారు 150కి పైన ఇట్టి సార్థకనామ గణాక్షర వృత్తములను కల్పించినాను. అందులో అరవై వృత్తములను ఇక్కడ మీకు పరిచయము చేస్తున్నాను.
మనుషులుగా మనం సంగీతం వినటం, చిత్రశిల్పాలు చూడటం, మంచి పుస్తకాలు చదవటం – ఒక సంస్కారం, సంస్కృతీ అని మనకు మనమే చెప్పుకోనిదే కళ గురించి మాట్లాడుకోవటం నిరర్థకం. ఇందుకే నోటికి వేమన, సుమతీ శతకాలు గడగడా వచ్చినట్టే కంటికి చిత్ర శిల్ప కళాఖండాలను చకచకా అప్పగించేట్టు చూడటం, చూపించటం అత్యవసర ప్రాథమిక చర్య, చికిత్స.
మిగతా భాషలతో పోలిస్తే తెలుగు సినిమాలు హాస్యానికిచ్చిన ప్రాధాన్యత మరెక్కడా కనపడదు. ఆ మధ్య ఇండియా టుడే పత్రిక ప్రతి పరిశ్రమని సర్వే చేసి ఇప్పటి వరకూ మీ భాషలో వచ్చిన అతి గొప్ప చిత్రం ఏమిటని అడిగితే, తెలుగులో మాయాబజార్ సినిమాకి ఎక్కువ ఓట్లు పడ్డాయి (మల్లీశ్వరి, శంకరాభరణం, మేఘ సందేశం, తదితరాలు ఉండగానే).
తమ భావజాలాన్ని వ్యతిరేకించేవారిపై రకరకాల ముద్రలు వేయడంతో సహా; విభజనపూర్వకమైన సాంప్రదాయిక భాష, వ్యక్తీకరణ సహస్రాధిక ప్రమాణంలో బలం పుంజుకోవడం నేటి మన దైనందిన అనుభవం. ఉదాహరణల కోసం గాలించవలసిన అవసరమే లేదు. వేయిపడగల సాంప్రదాయిక సమాజ పునరుత్థానానికి ఇది మరో ప్రత్యక్షసాక్ష్యం.
మెయిన్ స్ట్రీమ్ తెలుగు సాహిత్యంలో ఉన్నట్టే యాత్రాసాహిత్యంలోనూ అనేకానేక ధోరణులు ఉన్నాయి. అక్కడ పాపులర్ సాహిత్యం ఉన్నట్టే ఇక్కడా కాస్తంత సమాచారం దట్టించిన కాలక్షేపం ట్రావెలాగ్స్ ఉన్నాయి. అక్కడ సమాజ హితం కోసం తపించే సాహిత్యమున్నట్టే ఇక్కడా అనుభూతీ అనుభవాలూ మానవ సంబంధాలూ ప్రధానంగా సాగే యాత్రా రచనలు ఉన్నాయి.