రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

వెంపరాల వారి సాహిత్య యాత్ర

రచన: పరుచూరి శ్రీనివాస్
జనవరి 2016

వెంపరాల సూర్యనారాయణశాస్త్రిగారు గొప్ప పండితుడు. ఆయన రచనలలో, ప్రభావతీ ప్రద్యుమ్నము (1962), మనుచరిత్ర (1968) కావ్యాలకు రాసిన మంచి వ్యాఖ్యలు, శంకర విజయానికి పద్యరూపంలో చేసిన తెలుగు అనువాదం చాలామందికి తెలిసి ఉంటాయి. ఆయన తన సాహితీ యాత్ర పై చేసిన ప్రసంగం ఈ సంచికలో విందాం. ఇది 1979లో విజయవాడ కేంద్రం ద్వారా ప్రసారమయ్యింది.

//eemaata.com/Audio/jan2016/naasaahiteeyaatra-Vemparala.mp3
    
   

5అభిప్రాయాలు

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    ఏల్చూరి మురళీధరరావు January 1, 2016 10:19 am

    శ్రీ పరుచూరి శ్రీనివాస్ గారికి
    నమస్కారములతో,

    ముప్ఫైఅయిదేళ్ళ క్రితం విజయవాడ ఆకాశవాణిలో ఉద్యోగిస్తుండిన తరుణంలో ఢిల్లీలోని ఆర్కైవ్సుకోసం 1979లో నేను రికార్డు చేసిన ఈ అపరపతంజలి కంఠస్వనాన్ని మళ్ళీ ఇన్నాళ్ళకు మీ పుణ్యాన వినటం సాధ్యమయింది. దీనిని వెలికితీసి సూర్యాలోకాన్ని కల్పించిన మీకు కృతజ్ఞతతో ఎన్ని మెప్పుల కుప్పలని చెప్పినా తక్కువే.

    శ్రీ శాస్త్రిగారు సర్వం ఆశుగతిని చెబుతుంటే రికార్డు చేయాలని అనుకొన్నాను కాని, వాగ్ధోరణిలో వ్యర్థపదాలు దొర్లవచ్చునని, ఒక్క క్షణంకూడా వృధ కారాదని వారు దానిని ఆనాడు ముందుగా వ్రాసికొని చదవటం జరిగింది. అందువల్లనే వ్యావహారికంలో కొంత గ్రాంథికత తప్పలేదు. శ్రీవారి గురుదేవులైన పూజ్యపాదులు శ్రీ దర్భా సర్వేశ్వరశాస్త్రివరేణ్యుల చిట్టచివరి తరం శిష్యులు మా గురుదేవులైన శ్రీ తమ్మన వేంకటేశ్వరరావు గారు కావటం వల్ల ఆరోజు నేను వారింట శిష్యరూపునిగా వారి ఆతిథ్యానికి నోచుకోగలిగాను. నాకు చిత్రకవిత్వాభిమానం ఉన్నదని ఆరోజు వారు, “నేనూ ఒక నాగబంధమును వ్రాసితినండీ” అంటూ, అనర్ఘమైన ఈ నాగబంధపద్యాన్ని ధారణవశాన అలవోకగా వినిపించారు:

    శివ పరమేశ పావన యజేయగతిక్రమ దాంతమోహనా
    భవ నగచాప దేవబలపాలన భవ్యశరీరకాంతివై
    భవజితపారదా వరకృపాకృతి ధర్మపరా రమాజశా
    త్రవ గిరిజామనోవనజరంజదహస్కర నాగబంధనా.

    అని. ఆ తర్వాత ఇది నాకు లభ్యపడిన వారి ముద్రితకృతులలో కానరాలేదు. ఎందులో ఉన్నదో ఇంకా అన్వేషింపవలసి ఉన్నది. వారి చాటుకృతులు సైతం అచ్చుకావాలి.
    ఆ ఉచ్చారణను, ఆ పలుకుబడిని వింటుంటేనే వశీకృతపాణినీయులై సూత్రకార వృత్తికార భాష్యకార మునిత్రయచరిత్రను వ్రాసిన ఆ మహానుభావుని శబ్దాధికారం ఎటువంటిదో సువ్యక్తమవుతూ ఉన్నది. ఆ మూర్తిని మళ్ళీ మీరు శబ్దతరంగాల రూపాన కన్నులకు కట్టారు.

    దీనిని అప్పుడే ఆకాశవాణి సరిక్రొత్తగా కొనుగోలుచేసిన స్విట్జర్లాండు నాగ్రా టూ ఛానెల్ స్పూలు రికార్డరుతో తొలి రికార్డింగును చేయటం జరిగింది. ఆరోజే శ్రీ బులుసు వేంకటేశ్వర్లు గారి అనుభవాలను కూడా రికార్డుచేశాను. అప్పటి క్యూషీట్లు, వారి వారి వ్రాతప్రతులు ఇంకా ఉన్నాయో లేవో. ఇవి పూర్తయిన ఒక వారం రోజులకు అప్పికట్లకు వెళ్ళి శ్రీ తుమ్మల సీతారామమూర్తి గారి ఇంట్లో రెండు రోజులుండి వారి అనుభవాలూ, జ్ఞాపకాలను రికార్డు చేశాను. మీ కృషిఫలంగా అవీ వెలుగులోకి రాగలవని ఎదురుచూస్తుంటాను.

    అమేయశ్రద్ధతో శుభ్రపరచి దీనిని పునఃశాశ్వతీకరించిన మీకు ధన్యవాద సాహస్రితో,

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

  2. 2
    Indrani Palaparthy January 4, 2016 10:59 am

    శ్రీనివాస్ గారు:

    చాలా బాగుంది.

    వారి మాటలు వినగలగడం మా అదృష్టం.

    సేకరించి అందించినందుకు ధన్యవాదాలు.

    ఇంద్రాణి.

  3. 3
    G K S Raja January 27, 2016 12:15 am

    అద్భుతం శ్రీనివాస్ గారూ! వారి ప్రసంగంలో ప్రవహించిన ప్రముఖుల ప్రస్తావన సాహిత్యాభిలాష పెంచడము కాకుండా, ఇంతమంది మహామహుల పరిచయాలు చదవడానికైనా ఈ జీవితకాలం సరిపడదు కదా అని చింత కలుగుతోంది. ధన్యవాదాలు.
    రాజా.

  4. 4
    Viswanadha subbarao January 29, 2016 4:47 pm

    హైస్కూల్ లో చిన్నపుడు విన్న మహానుభావుని గొంతు 60 సంవత్సరాల తరవాత మళ్ళి విన్నా జన్మ ధన్యం. థాంక్స్.

  5. 5
    తటవర్తి రాజగోపబాలం ‌‌ April 29, 2023 7:37 pm

    మురళి గారు. నమస్తే.

    సుమారు నలబై ఏళ్ళ క్రితం నేను మహామహులు శ్రీ వెంపరాల సూర్యనారాయణ శాస్త్రిగారిని కాకినాడలో వారింటికి వెళ్లి దర్శనం చేసికొని ఒకగంటసేపు వారి సలహాలను (అప్పుడు నేను Ph.D కోసం చేస్తున్న యస్వి.జోగారావుగారి ప్రసన్న కుసుమాయుధ‌‌‌ కావ్యం గురించి) సూచనలను వినిన మహద్భాగ్యాన్ని పొందినాను.జనని భారతీదేవిని కనులార గాంచిన దివ్యానుభూతి అది.

    ఇప్పుడు మీరు పంపిన ఈ లంకెవలన వారి మాటలలో వారి సాహిత్య స్వీయచరిత్రను వినే భాగ్యం కలిగింది. ఎంత కఠోరపరిశ్రమ, ఎంత తపస్సు చేశారో! ఇట్టి మహానుభావుల అవిశ్రాంతతపఃఫలాలనే నాలాంటి వారం ఆస్వాదిస్తున్నాం. వారల ఋణం తీరేది, తీర్చగలిగేదీ కాదు.

    శతాధిక కృతజ్ఞతలతో
    రాజగోపబాలం 🙏

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • యక్షగానం: భీమసేనవిజయం
  • జనరంజని: సాలూరు రాజేశ్వరరావు
  • సి. ఎస్. ఆర్. ఆంజనేయులు: కొన్ని పాటలు, పద్యాలు
  • వెంపరాల వారి సాహిత్య యాత్ర
  • బాలానందం

ఇటువంటివే…

  1. దువ్వూరి వారి బాలవ్యాకరణావతారం, జానకితో జనాంతికం
  2. సాహస యాత్ర
  3. యాత్ర
  4. మా ఈజిప్ట్ యాత్ర
  5. యాత్ర

జనవరి 2016 సంచికలో ...

  • అక్కరలు
  • అజంతా రెండు కవితలు
  • అట్టు నా ఆదర్శం
  • కోటిగాని కతలు: వీర భద్రుడి తల
  • గేయపినవీరభద్రీయము
  • జనవరి 2016
  • ద్వైతం
  • ధీర
  • ధూర్జటి కవిత్వంలో మాధురీమహిమ: తెనాలి రామకృష్ణుని మధురపూరణ
  • నాకు నచ్చిన పద్యం: లీలామోహనుని ముగ్ధ సౌందర్యం
  • ప్రాకృతకవనము: సేతు బంధ కావ్యము
  • ఫాల్
  • ఫ్యూగ్ (Fugue)
  • బ్రౌన్ పురస్కారం – 2015
  • మనుషులపై మదుపు
  • మా ఆవిడ – మంగళసూత్రం
  • మా మహారాజుతో దూరతీరాలు – పుస్తక పరిచయం
  • రాంగ్ నంబర్!
  • రెండు కవితలు
  • వారఫలాలు
  • వెంపరాల వారి సాహిత్య యాత్ర
  • సంపాదకుని తిరస్కరణ లేఖ
  • సాహిత్యంలో వేశ్యా వృత్తి
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

బ్రౌన్ పురస్కారం – 2015
అజంతా రెండు కవితలు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.