రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

అనావిష్కృతం

రచన: విన్నకోట రవిశంకర్
నవంబర్ 2014

కాగితం ఆలోచనల ఖైదు
ఆకాశం అంచులదాకా ఎగిరే
ఊహల గువ్వల్ని ఒడిసిపట్టి
అందంగా పదిలపరచే
నల్ల ఊసల పంజరం.

కళ్ళు మూసుకున్నంతసేపు
రెక్కలు రెపరెపలాడిస్తూ
గిరికీలు కొట్టే భావాలు
పెన్ను మూతవిప్పగానే
ఎక్కడికో ఎగిరిపోతాయి.
చూపులతో దారి మళ్ళించి
చేరువ చేద్దామంటే
దరిదాపులకి రాకుండా చెదిరిపోతాయి.
ధ్యానం వీటి పొదరిల్లు.
అంతరంగం ఎన్నో అనావిష్కృత పుష్పాల
విస్మృతవనం.

మనోకాసారంలో పైకి తేలేది
జీవం ఉండీలేనట్టు కనిపించే
పల్చని పచ్చని పొర మాత్రమే.
మూతపడని కళ్ళతో
మిలమిలలాడుతూ తిరిగే
బంగారురంగు చేపలేవో
ఎప్పటికీ అగుపడకుండా
అడుగునే ఉండిపోతాయి.

    
   

4అభిప్రాయాలు

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ November 2, 2014 5:24 am

    మనోకాసారంలో పైకి తేలేది
    జీవం ఉండీలేనట్టు కనిపించే
    పల్చని పచ్చని పొర మాత్రమే.
    మూతపడని కళ్ళతో
    మిలమిలలాడుతూ తిరిగే
    బంగారురంగు చేపలేవో
    ఎప్పటికీ అగుపడకుండా
    అడుగునే ఉండిపోతాయి.

    నిజమే. బావుందండి

  2. 2
    Karthik November 2, 2014 12:18 pm

    Really superb superb Ravi Shankar gaaru

  3. 3
    అవినేని భాస్కర్ November 17, 2014 11:47 pm

    బాగుంది.

  4. 4
    కర్లపాలెం హనుమంత రావు December 12, 2014 3:00 pm

    అనావిష్కృత పుష్పాల విస్మృతవనంగా అంతరంగాన్ని మీరు ఆవిష్కరించిన తీరు ‘న భూతో నభవిష్యతి’ ప్రసాద్ గారూ!

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • క్షమాపణ
  • ఇద్దరు మిత్రుల కొత్త కవితా సంపుటాలు
  • శ్రీశ్రీ కవిత్వంలో కొన్ని సామాన్య జీవనాంశాలు
  • సంగమం
  • e తరమ్‌ (నాటిక )

ఇటువంటివే…

  1. అనావిష్కృతం
  2. పక్షులు
  3. నేను లేను
  4. నిద్ర
  5. అనిత్యం

నవంబర్ 2014 సంచికలో ...

  • అనావిష్కృతం
  • అమెరికా ఇల్లాలి ముచ్చట్లు: ఇండియా ప్రయాణం
  • ఈమాట నవంబర్ 2014 సంచికకు స్వాగతం!
  • కవి కావడం ఎలా? కొన్ని ప్రాక్టికల్ సూచనలు
  • నా గురువు శ్రీ శ్రీపాద కృష్ణమూర్తి
  • నాకు నచ్చిన పద్యం: కార్తీక శివజ్యోత్స్న
  • పునరుత్థానం
  • ప్లూటో గ్రహచారం
  • బంగార్రాజు ముద్దు
  • భగవంతుడో సాక్షి
  • రెండు కవితలు
  • రెండు పద్యాలకు విశేషార్థాలు – దురన్వయాలకు సమన్వయాలు
  • విశాఖ వృక్షయాగం అక్టోబరు 2014
  • వేమనపై కట్టమంచి
  • సాహిత్యావగాహన: మరొక దృక్పథం
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

రెండు కవితలు
పునరుత్థానం

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.