గుంటూరు జిల్లా రచయితల సంఘం సాహిత్య పురస్కారాలు 2026 – ఫలితాలు

గుంటూరు జిల్లా రచయితల సంఘం సాహిత్య పురస్కారాల కొరకు 2025 సంవత్సరంలో వెలువరించిన కథా, కవితా సంపుటాలకు ఆహ్వానం పలుకగా 20 కథా సంపుటాలు, 33 కవితా సంపుటాలు వచ్చాయి.

గుంటూరు జిల్లా రచయితల సంఘం సాహిత్య పురస్కారాలు 2026కు స్వర్ణ కిలారి రచించిన కథా సంపుటి ‘గోడవతల’, విజయ్ కోగంటి రచించిన కవితా సంపుటి ‘ఎవరిదీ చూపు’ ఎంపికయ్యాయని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. త్వరలో గుంటూరులో జరగబోయే సభలో వారికి చెరో 5వేల నగదు, జ్ఞాపికలతో పురస్కార ప్రదానం వుంటుంది.

న్యాయనిర్ణేతలుగా కథలకు పెళ్లకూరు జయప్రద, కాట్రగడ్డ దయానంద్, శీలా సుభద్రాదేవి, కవిత్వానికి పాపినేని శివశంకర్, మందరపు హైమవతి, పెరుగు రామకృష్ణ వ్యవహరించారు.

– సి.భవానీదేవి, అధ్యక్షులు
– ఎస్.ఎం. సుభాని, ప్రథాన కార్యదర్శి (9490776184)