రంపపుకోత రక్కసిరొదలో
వొక చిమ్మెట సన్నటి సొంపుసొద
ముదురు బూడిదరంగు దిక్కుల్లేని బయలు
మయాన నల్లటి రెల్లుదుబ్బు
ఎదురు చూడని వీపు
పెగలని సెలవి అరపూవు నగవు
కలక అలికిన కొలికి తావు
దాగి రేగిన చెన్ను
నెలపొడుపు ముంగిట్లో
మసకల పొద్దు
వెదురు బొంగురు గొంతు తీపిసడి సోకి
రిక్కిన వీనుల నూగు
తూగు! ఆ దిక్కులేని కొసల బయలు
వీగక సాగే గాడ్పుసుడుల
నిడుపు సూది మొనపై
మోపిన బొడ్డుతో
ఇల పన్నిన ఉచ్చుబడి
మెత్తని మైకపు
నీ చుట్టకుదురూయల
