ప్రేరణ

నన్ను మోసుకు తిరగమని
నామీద కుట్రగా
ఎక్కడిదో ఎవరిదో
ఒక పక్షి
నామీద వచ్చి వాలుతుంది

కాసింత కనికరానికి
దాని వలపు సూచనలతో
మరింత దగ్గరవుతుంది

ఎంత ఏకాకిగా వచ్చినా
నయంకాని వ్యాధిలా అంటుకుపోతుంది
ప్రసవ వేదన తీరేవరకూలా
చంపుతూనే ఉంటుంది

నేను తాను అయ్యాక
ఎక్కడకి ఎగిరిపోతుందో ఏమో!


వై. ముకుంద రామారావు

రచయిత వై. ముకుంద రామారావు గురించి:

9 స్వీయ కవిత్వ సంకలనాలు, 14 అనువాద గ్రంథాలు, ఆంగ్లం కన్నడంలో నా కవిత్వ అనువాద పుస్తకాలు, మరో 5 ఇతరాలు వచ్చాయి. తెలుగు విశ్వవిద్యాలయం నుండి కీర్తి పురస్కారం-సాహితీ పురస్కారం, తాపీ ధర్మారావు పురస్కారం, అజో-విభో-కందాళం ఫౌండేషన్ వారి ప్రతిభామూర్తి జీవితకాల సాధన పురస్కారం మొదలైన అవార్డులు వచ్చాయి. ఆంగ్లం, పోలిష్, హిందీ, ఉర్దూ, బెంగాలీ, కన్నడం, తమిళం, మలయాళం, ఒడియా, సంతాలీ, మరాఠీల్లోకి ఎన్నో కవితల అనువాదాలు వచ్చాయి.

 ...