తెల్లాపూర్‌లోని ఫూలే అంబేద్కర్ ఇంగ్లీష్ ట్రైనింగ్ సెంటర్లో ఫిబ్రవరి 7- 8 తేదీలలో 50 మంది కొత్త తరం కవుల ‘మిలన్: వర్క్‌షాప్’ జరుగుతుంది. బహుజన కవిత్వానికి సంబంధించిన వివిధ అంశాలపై జి.లక్ష్మీనరసయ్య, సంగిశెట్టి శ్రీనివాస్, ఎం.ఎం వినోదిని, శ్రీనివాస్ గౌడ్, చల్లపల్లి స్వరూపరాణి, కోయి కోటేశ్వరరావు, కవి యాకూబ్, షాజహానా, జూపాక సుభద్ర, జిలుకర శ్రీనివాస్, బండారి రాజ్‌కుమార్, తగుళ్ల గోపాల్, వనపట్ల సుబ్బయ్య, రహీమొద్దీన్, బాలబోయిన సుదర్శన్ మాట్లాడతారు. ప్రశ్నోత్తరాలు జరుగుతాయి. యువకవుల కవితాపఠనం, చర్చ ఉంటుంది. పసునూరి రవీందర్, మెర్సీ మార్గరెట్, స్కైబాబ, పేర్ల రాము, హాథీరామ్ సభావట్ నిర్వాహకులుగా వ్యవహరిస్తారు.