వ‌ల‌పు వ‌ల‌

త‌రుముకొచ్చిన తుఫాను
తీరం దాట‌లేదింకా-
న‌డి క‌డ‌లిలోనే
వ‌డి వ‌డిగా సుడులు తిరుగుతోంది.

చివ‌రికొచ్చిన క‌థ‌
కంచికి చేర‌లేదింకా-
తుదిని మొద‌లెట్ట‌లేక
తాక‌రాని తేనెతుట్టెను త‌ట్టి లేపుతోంది.

మ‌ర‌పుకొచ్చిన క‌ల‌
స్మృతిని వ‌ద‌ల‌లేదింకా-
ఉక్కురెక్క‌ల ఊహ‌ల‌తో
గ‌గ‌నానికి ఆవ‌ల‌ గిరికీలు కొడుతోంది.

ఇదొక ముగింపులేని క‌థ‌,
ఇదొక మ‌ర‌పురాని క‌ల‌,
న‌న్ను దొర‌క‌బుచ్చుకున్న‌ది
వ‌దుల్చుకోలేని వ‌ల‌పు వ‌ల‌.