తెలతెలవారుతూ –
కోడి కూతతో పోటీపడే
పాలవాడి సైకిలి బెల్లూ –
పనిపిల్ల చేతిలో
గిన్నెల భూపాల రాగాలూ –
గుమ్మం ముందు
ఉదయించిన వార్తలూ –
వరండాలో కాఫీ చప్పరిస్తున్న
వార్తాపత్రికలూ –
మంత్రపుష్పాలతో దేహం కప్పుకున్న
దేముడి పటాలూ –
వెలుతురు కళ్ళు పొడిచినా
ముసుగు తీయని బద్దకాలూ –
మత్తెక్కిన నిద్రని కుదిపేసే
వంటింటి వాసనలూ –
ఇవన్నీ ఒకప్పుడు
దేహాన్ని ఆవరించుకున్న అనుభవాలు!
రోజంతా పలకరించే ఆత్మ బంధువులు!!
ఇప్పుడు –
కొత్తగా చొరబడిన రంగుల గారడీ
మా పె(ప)దాలు తను తీసుకొని,
దాని చెవులు మాకిచ్చి –
తన గొంతుతో
మా మాటలు నొక్కేసి –
ముఖాన కృత్రిమత పూసి
మా నవ్వులకీ, రోదనలకీ, విరామాలకీ –
సమయాన్ని కేటాయించింది.
ఇప్పుడు తీరికలేని పక్షుల్లా
మౌనంగా తలూపే క్షణాల్లా
లోతుగా గొంతుకోసుకుపోయిన
మృత జీవుల ఘోష మాది.
ఈ దేహాలకి ఆప్యాయతల లేపనాలు ఎవరు పూస్తారో?
మౌన సమాధిపై మాటల గుచ్ఛం ఎవరుంచుతారో?
అనుభూతుల నిన్నకి పునర్జన్మ ఎవరందిస్తారో?
కోడి కూతతో పోటీపడే
పాలవాడి సైకిలి బెల్లూ –
పనిపిల్ల చేతిలో
గిన్నెల భూపాల రాగాలూ –
గుమ్మం ముందు
ఉదయించిన వార్తలూ –
వరండాలో కాఫీ చప్పరిస్తున్న
వార్తాపత్రికలూ –
మంత్రపుష్పాలతో దేహం కప్పుకున్న
దేముడి పటాలూ –
వెలుతురు కళ్ళు పొడిచినా
ముసుగు తీయని బద్దకాలూ –
మత్తెక్కిన నిద్రని కుదిపేసే
వంటింటి వాసనలూ –
ఇవన్నీ ఒకప్పుడు
దేహాన్ని ఆవరించుకున్న అనుభవాలు!
రోజంతా పలకరించే ఆత్మ బంధువులు!!
ఇప్పుడు –
కొత్తగా చొరబడిన రంగుల గారడీ
మా పె(ప)దాలు తను తీసుకొని,
దాని చెవులు మాకిచ్చి –
తన గొంతుతో
మా మాటలు నొక్కేసి –
ముఖాన కృత్రిమత పూసి
మా నవ్వులకీ, రోదనలకీ, విరామాలకీ –
సమయాన్ని కేటాయించింది.
ఇప్పుడు తీరికలేని పక్షుల్లా
మౌనంగా తలూపే క్షణాల్లా
లోతుగా గొంతుకోసుకుపోయిన
మృత జీవుల ఘోష మాది.
ఈ దేహాలకి ఆప్యాయతల లేపనాలు ఎవరు పూస్తారో?
మౌన సమాధిపై మాటల గుచ్ఛం ఎవరుంచుతారో?
అనుభూతుల నిన్నకి పునర్జన్మ ఎవరందిస్తారో?